హిందూ సమ్మేళనానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన సమితి సభ్యులు…

హిందూ సమ్మేళనానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన సమితి సభ్యులు

పరకాల,నేటిధాత్రి

హిందూ సమ్మేళన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గౌరవ అధ్యక్షులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్,అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వరరావు,సహా అధ్యక్షులు మాడుగుల పాపిరెడ్డి రెడ్డి,ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, కోశాధికారి తిప్పర్తి యుగేందర్ చారి,సమితి సభ్యులు ఆహ్వానించారు.హిందూ సమ్మేళన నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఎమ్మెల్యే సమ్మేళన విజయవంతానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం హిందూ సమ్మేళన జాగరణ సమితి తరపున ఎమ్మెల్యే రేవూరిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి,ఏసీపీ సతీష్ బాబు, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్,వెన్నంపల్లి పాపన్న,సమితి సభ్యులు,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version