నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ సదస్సుకు హాజరుకానున్న సాంబశివరెడ్డి….

తెలంగాణ రైతు బిడ్డకి జాతీయ ప్రతినిధుల పక్కన కూర్చునే అరుదైన గౌరవం….

హాజరుకానున్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు…

హైదరాబాద్ నగరంలో నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ సదస్సు….

గొప్ప గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటా….

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట నేటిధాత్రి

భారత కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నవంబర్ పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీలలో రెండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ సదస్సుకు హాజరుకావాలని భారత ప్రభుత్వం నుండి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డికి శని వారం ఆహ్వానం అందింది ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ (జాతీయ సుగంధ సమావేశం) సదస్సుకు హాజరు కావాలని భారత ప్రభుత్వం నుండి తనకు ఆహ్వానం. రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు దేశవ్యాప్తంగా ఇరువై రాష్ట్రాలకు పైగా ప్రతినిధుల మధ్య కూర్చునే అరుదైన అవకాశం కల్పించటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు తనను ఈ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన ఘనత ఈ ప్రాంత రైతులదేనని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సాంబశివరెడ్డి తెలిపారు అంతేకాకుండా ఇంతటి గొప్ప అవకాశాన్ని తనకు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారతదేశంలో రైతులు పండిస్తున్న సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎగుమతులు ప్రాసెసింగ్ ప్రపంచ విపనిలో మార్కెట్ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కార మార్గాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ లో సుగంధ ద్రవ్యాల ఎగుమతి దారులు ప్రాసెసర్సు కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని సాంబశివ రెడ్డి తెలిపారు దేశవ్యాప్తంగా స్పైస్ కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు హాజరుకానుండగా రైతు విభాగం యఫ్. పి. ఓ నుండీ సాంబశివ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందటం విశేషం కాగా సాంబశివరెడ్డికి నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం రావడం పట్ల రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు….

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version