మరిపెడ నేటి ధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది,గుండెపుడి గ్రామ శివారులో ఉన్నటువంటి సీతారాములవారి దేవస్థానంలోకి గుర్తు తెలియని కొంతమంది దుండగులు చొరబడి దేవుళ్లను,గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు బంగారు పూతతో చేసినటువంటి నాణ్యాలు రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు యధావిధిగా ఉదయాన్నే ఊళ్లోకి వచ్చిన పూజారి గుడిలోని పక్కన ఉన్నటువంటి రూం తలుపులు తీసి ఉండడంతో లోపలికి వెళ్లి చూస్తే తలుపు తాళం పగలగొట్టి లోపల ఉన్న వాటిని దొంగతనంగా తీసుకెళ్లినట్టు గుర్తించాడు వెంటనే గ్రామస్తులకు ఈ సమాచారాన్ని తెలియజేశారు,గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు,దేవాలయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు గుండెపుడి గ్రామంలో ఉన్న ఈ గుడి చాలా పురాతనమైనది చాలా ప్రత్యేకత మహిమ కలిగినది ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు గతంలో ఈ గుడిలో దొంగతనాలు జరిగాయి అయినా కూడా మళ్లీ పోయిన విగ్రహాలు తిరిగి దొరికాయి కానీ ప్రతిసారి ఎందుకు ఇలా ఈ గుడిలోనే దొంగతనాలు జరుగుతున్నాయని ఇలా విగ్రహాల అపహరణ జరగడం పై గ్రామానికి సంబంధించిన కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆలయ సిబ్బందికి సంబంధించిన వారి సహకారం లేనిదే ఈ దొంగతనం జరగదు అని గ్రామంలోని కొంతమంది ప్రజలు అంటున్నారు ప్రతిసారి ఇలా గుడిలోని విగ్రహాలు పోవడం పట్ల ప్రజలంతా తీవ్ర ఆసహానానికి గురవుతున్నారు. పోలీసులు దుండగులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.