ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17
గ్రామాల అభివృద్దే మా ప్రభుత్వ ధ్యయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం మండలంలోని ఇప్పలపల్లి, గణేష్ పల్లి గ్రామాలల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో జీపీ బిల్డింగ్ కు సుమారు రూ. 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన జీపీ భవనాలను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ఆశాలత, ఎంపీడీవో కృష్ణవేణి లతో పాటు స్థానిక సర్పంచ్ యుగంధర్ ఎంపీపీ యారా సంజీవరెడ్డి సుజాత జడ్పిటిసి జోర్క సదయ్య పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.