ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే జీతాలు చెల్లించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు జీతాలు రాక పండగ పూట పస్తులే నేనా అని పీల్డ్ అసిస్టెంట్ల ఝరాసంగం మండల స్వతంత్ర సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ పటేల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ గడిచిన గత 20 సంవత్సరాలు నుండి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటు వంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రావడం లేదన్నారు.
గత మూడు నెలల నుండి జీతాలు రాక ఫీల్డ్ అసిస్టెంట్లు హరిగోస పడుతున్నారన్నారు. పండుగ పూట జీతాలు వస్తాయని ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదురుచూస్తున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.