కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న సఫియా సుల్తానా
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యూఢిల్లీ, జూలై 2025: కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ సంస్థ (CCRT), న్యూఢిల్లీ నిర్వహించిన 15 రోజుల జాతీయస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సఫియా సుల్తానా, CCRT డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సందీప్ శర్మ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నారు.ఈ శిక్షణలో భారత , కళలు, సమకాలీన విద్యా విధానాల్లో సృజనాత్మక ఉపాధ్యాయ విద్యా విధానాలపై లోతైన అవగాహన కలిగించే కార్యశాలలు నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఎంపికైన ఉపాధ్యాయులతో కలసి ఈ శిక్షణలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా నిలిచింది.ఈ శిక్షణ ఉపాధ్యాయుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా, విద్యా రంగంలో నూతన అధ్యాయాలను ప్రారంభించే స్ఫూర్తిని నింపింది. ఈ సందర్భంగా శ్రీమతి. సఫియా సుల్తానా గారు, ఈ అవకాశాన్ని కల్పించిన SCERT, తెలంగాణ మరియు CCRT సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.