వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రురల్ మండలం హనుమాజీపేట రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ అద్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వేసవికాలంలో మామిడిలో తీసుకోవలసిన జాగ్రత్తలు పూత పిందె రాలుట నివారణ గురించి ,వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వివిధ పంటలలో కలుగు మార్పుల గురించి, సేంద్రియ వ్యవసాయం పై శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నందు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ..ఇట్టి కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి .భాస్కర్ మరియు మండల వ్యవసాయ అధికారి జి సాయి కిరణ్ , చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గా రాజ్ ఉద్యానవన శాఖ అధికారి గోవర్ధన్ వ్యవసాయ విస్తరణ అధికారులు వేములవాడ నియోజకవర్గ పరిధిలోగల ఆయా గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది …