స్కూల్ వ్యాన్లనుతనిఖీ చేసిన ఆర్టీవో అధికారులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆర్ టి ఓ కు వినతి పత్రాన్ని అందించారు.వెంటనే స్పందించిన ఆర్టీవో అధికారులు శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్లను తనిఖీ చేసి స్కూల్ వ్యాన్లపై భారీ జరిమానా విధించడం జరిగింది
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ లో సెట్టింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఉన్నారు స్కూల్ వ్యాన్ లో తప్పనిసరిగా ఉండవలసిన ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ పూర్తిగా లేవు అన్న అధికారులు సిట్టింగ్ కెపాసిటీ మించి విద్యార్థులను వ్యాన్లో తరలిస్తున్నారు శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ను పై కేసు పెట్టి భారీ జరిమానా విధించడం జరిగిందని ఆర్టీవో అధికారులు తెలిపారు
