ప్రయాణికుల సౌకర్యం కోసం రూట్ సర్వే నిర్వహించిన ఆర్టీసీ అధికారులు
వర్దన్నపేట (నేటిధాత్రి):
నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబేల్లి గ్రామంలో తెలంగాణ ఆర్టీసీ జిల్లా అధికారులు రూట్ సర్వే నిర్వహించి ప్రయాణికుల సౌకర్యాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆర్టిసి అధికారులే గ్రామస్థాయిలో పర్యటించడం మహిళలకు ఉచిత బస్సును కల్పించి గ్రామస్థాయిలో ప్రయాణికులతో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా గ్రామానికి అదనంగా వరంగల్ నుండి అన్నారం వెళ్లే సర్వేసును నల్లబేల్లి గ్రామం మీదుగా నడుపుటకు అనుమతివ్వాలని గ్రామ ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు జక్కి శ్రీకాంత్, దోమకొండ శ్రీనివాస్, మల్యాల బసవచారి, బిర్రు మహేందర్, పోలసాని దేవేందర్రావు, మరిపట్ల బాబు, దుగ్యాల కిషన్ రావు, వడ్డే నారాయణ, బొమ్మెర శ్రీనివాస్, బిర్రు కొమురయ్య, ఏకాంబరం, చెట్టు లక్ష్మణ్, కొండ బిక్షపతి, దోమకొండ ప్రభాకర్, దోమకొండ రాము, మరుపట్ల కుమారస్వామి, తాటికాయల సమ్మయ్య, నాగయ్య, కృష్ణంరాజు, యాకయ్య, రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు