సిట్టింగ్ షాప్ లో కుళ్ళిపోయిన మాంసం
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పట్టణంలోని కనకదుర్గ వైన్స్ పక్కనున్న
సిట్టింగ్ షాప్‌లో మురిగిపోయిన చికెన్‌ను రోస్ట్ చేసి విక్రయిస్తున్న ఘటన వెలుగుచూసింది. మద్యం సేవించేందుకు వచ్చిన పలువురు కస్టమర్లు రోస్ట్ ముక్కల్లో దుర్వాసనతో పాటు రంగు మారిన మాంసం గమనించి వ్యతిరేకించారు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న మందమర్రి మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. షాప్‌లో నిల్వ ఉంచిన మురిగిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకుని, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు యజమానిపై చర్యలు తీసుకునే విషయాన్ని అధికారులు తెలిపారు.
చెడిపోయిన మాంసాన్ని విక్రయించడం కస్టమర్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ విభాగం కూడా దృష్టి సారించి, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.