మిల్లర్ల నెత్తిన బకాయిల పిడుగు?

యూనియన్‌ నాయకులు చొరవ తీసుకోకపోతే మిల్లర్లు నష్టపోతారు.

`చెల్లించని బకాయిలపై అదనపు భారం?

`టెండర్‌ ప్యాడీ లేకుండా బకాయిలు వసూలు?

`గడువు దాటిన తర్వాత ఇలాంటి నిర్ణయం వద్దంటున్న మిల్లర్లు?

`బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా వున్నామంటూ వేడుకోలు.

`ప్రభుత్వం కనికరించాలని మిల్లర్ల విజ్ఞప్తి.

`ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి.

`మళ్ళీ దివాలా తీసే పరిస్థితి తేవొద్దని విజ్ఞాపనలు.

`మిల్లర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం వుంది.

`ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించండి.

`బకాయిలన్నీ చెల్లిస్తాం…30 రోజుల గడువు ఇస్తే ఊపిరి పీల్చుకుంటాం

`మరొక్క అవకాశం వచ్చేలా ప్రభుత్వ పెద్దలను ఒప్పించండి.

`తోటి మిల్లర్‌ను ఈ ఆపద నుంచి గట్టెక్కించండి.

`మిల్లర్‌ వ్యవస్థ బాగుంటేనే వ్యవస్థకు మేలు కలుగుతుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ మిల్లర్ల మీద బకాయిల పిడుగు పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన బకాయిలలో దాదాపు 95శాతం మిల్లర్లు చెల్లించేశారు. ఇంకా కొంచెం బకాయిలు పెండింగ్ లో వున్నాయి. వాటిని కూడా మిల్లర్లు చెల్లించేందుకు సిద్దంగానే వున్నారు. కాని మిల్లర్లకు నష్టం చేకూర్చేలా బకాయిల వసూలు చేసే కొత్త ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసి ఆవేదన చెందుతున్నారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్లు సుమారు 23వేల కోట్లు పై చిలుకు బకాయిలు పడ్డారు. ఇదంతా 2014 నుంచి ఈ బకాయిల వసూలు పూర్తి స్దాయిలో జరగేలేదు. కారణాలు ఏవైనా కావొచ్చు. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత , commissioner‌ చౌహాన్‌ చొరవతో మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా బకాయిలు వసూలు చేయించారు. బకాయిలు చెల్లించేందుకు మిల్లర్లు కూడా ఎక్కడా మొండికేయలేదు. రాజకీయం చేయలేదు. రాజకీయ నాయకుల అండదండలలో తప్పించుకునే ఆస్కారం లేకుండా సివిల్‌ సప్లయ్‌ కమీషనర్‌ చౌహాన్‌ చాలా జాగ్రత్తగా మొండి బకాయిలు ఈ పద్దెనిమిది నెలల్లో వసూలు చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే మిగతా బకాయిలు చెల్లించడంలో ఆలస్యానికి మిల్లర్లు కారణం కాదని తెలుస్తోంది. గతంలో తెలంగాణలో టెండర్‌ ప్యాడీ విధానం అనేది లేదు. దేశ వ్యాప్తంగా కూడా ఇది ఏరాష్ట్రంలోనూ లేదు. పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రంలో కూడా తెలంగాణలో వున్నటు వంటి టెండర్‌ ప్యాడీ విధానం లేదు. కాని తెలంగాణలో మాత్రమే ఈ టెండర్‌ ప్యాడీ విధానం తీసుకొచ్చారు. ఇందుకు అనేక కారణాలు వున్నాయి. వాటి జోలికి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు. కాని మిల్లర్లు కొంత బకాయిలు పడ్డారు. ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్దంగానే వున్నారు. కాని కొంత సమయం కోరుతున్నారు. అంతే తప్ప తాము బకాయిలు చెల్లించేందుకు ససేమిరా అనడం లేదు. నిజం చెప్పాలంటే లోపమంతా టెండర్‌ ప్యాడీ విధానంలోనే వుంది. దేశంలో ఎక్కడైనా వడ్లను రైతులనుంచి నేరుగా మిల్లర్లు సేకరిస్తారు. కాని తెలంగాణలో మధ్య దళారీ వ్యవస్ధ అయిన టెండర్‌ ప్యాడీ సేకరిస్తారు. తెలంగాణలో నలుగురు టెండర్‌ ప్యాడీ కాంట్రాక్టర్లు ఉన్నారు.. వాళ్లు సేకరించిన వడ్ల సేకరణకు ముందే చెల్లించాలి. ఆచరణలో మాత్రం మిల్లులకు చేరిన తర్వాత మిల్లుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధకు చెందిన వాళ్లే రైతుల నుంచినేరుగా వడ్లు సేకరించి, వారి వారి గోడౌన్‌లలో దాచిపెట్టాలి. కాని వారికి ఎలాంటి గోడౌన్లు లేవు. దాంతో టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ ఆదీనంలో వుండాల్సిన వడ్లను మిల్లర్ల ఆదీనంలో వున్న గోడౌన్లలో దాచేస్తున్నారు. మిల్లర్లకు ఈ విదంగా కూడా నష్టం జరుగుతోంది. టెండర్‌ ప్యాడీ సేకరించిన వడ్లను నేరుగా తిరిగి మిల్లర్ల గోడౌన్లకు చేర్చుతున్నారు. ఈ మాత్రం దానికి టెండర్‌ ప్యాడీ వ్యవస్తే వృధా. గతంలోనూ రైతులనుంచి మిల్లర్లు నేరుగా వడ్లు సేకరించి తమ గోడౌన్లకు తరలించుకునే వారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. కాని మధ్యలో టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వచ్చేసింది. అందుకు ఆ టెండర్‌ వ్యవస్ధకు కూర్చున్న చోట కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం వారికి క్వింటాలుకు రెండువందల రూపాయలకు పైగ చెల్లిస్తుంది. అలాంటప్పుడు టెండర్‌ పాడీ వ్యవస్ధే మొత్తం సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాలి. ఎందుకంటే రైతులకు ముందుగానే ప్రభుత్వం నేరుగా వడ్ల సొమ్ము రైతు ఖాతాల్లో వేస్తోంది. ఆ వడ్లకొనుగోలు చేసిన టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలి. అంతేకాని టెండర్‌ ప్యాడీ మిల్లర్లకు వడ్లు తరలించడం, వారి నుంచి ముక్కు పిండి వసూలుచేయడం జరుగుతోంది. ఈ వ్యవస్ధ వద్దే వద్దు ఇని మిల్లర్లు చాలా కాలం నుంచి మొత్తుకుంటున్నారు. టెండర్‌ ప్యాడీకి ఇచ్చే కమీషన్‌ ఏదో మాకే ఇస్తే మరింత సేవ చేయడానికి సిద్దంగా వున్నామని ప్రభుత్వాన్ని అనేక సార్లు మిల్లర్లు విన్నవించుకున్నారు. మొత్తానికి కొత్త ప్రభుత్వం మిల్లర్ల వద్ద పేరుకుపోయిన బకాయిలు వసూలు చేశారు. ఇంకా మరో 3వేల కోట్ల పైచిలుకు రూపాయల బకాయిలున్నట్లు గుర్తించారు. వాటిని వసూలు చేయాలనుకుంటున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఈ బకాయిల వసూలు టెండర్‌ ప్యాడీ లేకుండా చేస్తామంటున్నారు. నిజానికి ఈ బకాయిలు మొత్తం టెండర్‌ ప్యాడీ నుంచి వసూలు చేయాలి. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏ ఏడాదికి చెందిన వడ్లను ఆ ఏడాది సేకరించి, ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన బాధ్యత మొత్తం టెండర్‌ ప్యాడీ మీదే వుంటుంది. కాని టెండర్‌ ప్యాడీ వ్యవస్ద ఈ బకాయిల వసూలుకు తెరతీసింది. తాను మాత్రం పక్కకు తప్పుకున్నది. అంటే ప్రభుత్వానికి టెండర్‌ ప్యాడీ చెల్లించాల్సిన సొమ్మును మిల్లర్ల రూపంలో వసూలు చేయించాలిన ఎత్తుగడ వేసింది. దాంతో టెండర్‌ ప్యాడీ మీద వేళాడాల్సిన కత్తి, మిల్లర్ల మెడమీదకు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మిల్లర్లు బకాయిలను చెల్లించడంలో అదనపు బారం మేపేందుకు సిద్దమౌతున్నట్లు తెలిసింది. నిజానికి మిల్లర్లు గతంలోనే పూర్తి బకాయిలు చెల్లించేందుకు సిద్దమయ్యారు. కాని ఎక్కడో ఏదో జరిగింది. దాంతో పూర్తి చెల్లింపులకు బ్రేక్‌ పడిరది. అప్పుడు ఆగిపోవడం వల్ల ఇప్పుడు బకాయిల చెల్లింపుకు అదనపు బారం వేయాలని చూస్తున్నట్లు మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒక్క నెల సమయం కావాలని కోరుతున్నారు. తాము బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా వున్నామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం కనికరించాలని కోరుతున్నారు. అదనపు బారం లేకుండా చెల్లింపులు సకాలంలో పూర్తి చేస్తామంటున్నారు. అందుకు ఒక్కనెల కావాలంటున్నారు. ఈ విషయంలో మిల్లర్‌ అసోసియేషన్‌ నాయకులు చొరవతీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో యూనియన్‌ మిల్లర్లను కాపాడుకోవాల్సిన అవసరం వుందటున్నారు. బకాయిలన్నీ గడువులోపల చెల్లిస్తామంటున్న సంగతి ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతున్నారు. గడువు ఒక్కనెల పెంచితే చాలు ఊరిపి పీల్చుకుంటామని మిల్లర్లు చెబుతున్నారు. మరొక్క అవకాశమివ్వండని కోరుతున్నారు. తోటి మిల్లర్లను ఇలాంటి పరిస్ధితినుంచి గట్కెక్కించాలని యూనియన్‌ను మిల్లర్లు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version