‘‘నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన ‘‘ఐఏఎస్‌,ఐపీఎసు అధికారుల సంఘాలు.

ప్రధానంగా ‘‘నేటిధాత్రి’’ సూటిగా సందించిన ప్రశ్నలు?

`‘‘ఐఏఎస్‌, ఐపీఎసుఅధికారుల స్పందనకు కారణం?

`‘‘ఐఏఎసు లంటే అంత ఆశామాషిగా వుందా? అని ‘‘నేటిధాత్రి’’ నిలదీసింది.

`మహిళా ‘‘ఐఏఎసు అధికారులు అంత అలుసై పోయారా? అని ప్రశ్నించింది ‘‘నేటిధాత్రి’’.

`మహిళా ‘‘ఐఏఎసు ల జీవితాల మీద అభండాలా? మీడియా దుర్నీతిని ‘‘నేటిధాత్రి’’ నీలదీసింది.

`పరోక్షంగా మంత్రి ని హీరో ను చేస్తారా? అని మీడియను కడిగేసింది.

`ఏ రంగంలో వున్నా అవమానాలు, అనుమానాలు తప్పవా? అని మేలుకొలిపింది.

`మంత్రికేనా కుటుంబం వుండేది? అధికారుల సంఘానికి గుర్తు చేసింది.

`ఆ మహిళా ‘‘ఐఏఎసు అధికారికి కుటుంబం ఉండదా? అని మీడియా ప్రపంచానికి చెప్పింది ‘‘నేటిధాత్రి’’.

’’ఆల్‌ ఇండియా క్యాడరు అధికారులపై ఊహజనిత వార్తలు సృష్టి స్తారా! అని నిగ్గ తీసి అడిగింది’’నేటిధాత్రి’’.

`మీడియా చేతిలో వుంది కదా అని ఎలాంటి కట్టు కథైనా అల్లేస్తారా? అని ‘‘నేటిధాత్రి’’ తూర్పర పట్టింది.

`ఆ కలెక్టర్‌ అని చెప్పగలిగిన మీడియా మంత్రి పేరు ఎందుకు దాచారు? అని ‘‘నేటిధాత్రి’’ నిలదీసింది.

`మహిళా కలెక్టర్‌ పరువు పోయినా పర్వాలేదనుకున్నారా? అని ‘‘నేటిధాత్రి’’ కడిగిపారేసింది.

’’ఐఏఎసు ల సంఘం ఏం చేస్తున్నట్లు? అని ‘‘నేటిధాత్రి’’ గాటుగా ప్రశ్నించింది.

`మహిళా ‘‘ఐఏఎసు ఆత్మభిమానం మీద దెబ్బ కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అని నిర్మొహమాటం లేకుండా అడిగింది. నేటిధాత్రి.

మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? అని గుర్తు చేసింది.

`తోటి మహిళా ‘‘ఐఏఎసు అధికారులు మాకెందుకు అనుకుంటున్నారా? అని కూడా అక్షేపించింది ‘‘నేటిధాత్రి’’.

ఓ మంత్రిని హీరో ను చేస్తూ అధికారి మీద స్టోరీ చేస్తే ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారని గుర్తు చేసింది ‘‘నేటిధాత్రి’’.

ఇదెక్కడి దిక్కుమాలిన జర్నలిజం? అని కడిగి పారేసింది కూడా నేటిధాత్రి.

జర్నలిజం నైతిక విలువలు వదులుకోవడాన్ని తప్పని సూచించింది నేటిధాత్రి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ఉద్యోగులైన ఐఏఎస్‌, ఐపిఎస్‌లు అంటే అయ్యా ఎస్‌లు కాదు. అడ్మినిస్ట్రేషన్‌ హెడ్‌లు. రాష్ట్ర ప్రభుత్వం సాగాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా, ప్రజలకు కొత్త కొత్త పథకాలు అందాలన్నా వాటి రూపకల్పన, అమలులో ఐఏఎస్‌ అదికారులదే కీలకపాత్ర. పైగా ఐఏఎస్‌ అధికారులైన కలెక్టర్‌లు ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌లు. వారు విధినిర్వహణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందులో మంచి చెడులను విశ్లేశించొచ్చు. పాలనా పరమైన పొరపాట్లు వుంటే మీడియా పరంగా ప్రశ్నించొచ్చు. కాని వారి వారి వ్యక్తిగత జీవితాలపై లేనిపోనివి రాయడం సరైంది కాదు. అందులోనూ వారికి సంబంధం లేని విషయాలను సెన్సెషన్‌ కోసం వెలుగులోకి తీసుకురావొద్దు. ఇటీవల కొన్ని న్యూస్‌ ఛానళ్లలో పెద్దఎత్తున ఇలాంటి వార్తల ప్రసారమయ్యాయి. దాంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్తితి వచ్చింది. పైగా మహిళా ఉన్నతాదికారి మీద లేని పోని నిందలు వేస్తూ ఓ కథనం ప్రసారం చేశారు. అదిగో పులి అంటే, ఇదిదో తోక అన్నట్లు వున్నవి లేనివి వండి వార్చారు. దాంతో ఐఏఎస్‌ అధికారుల్లో అలజడులు మొదలయ్యాయి. ప్రభుత్వపరంగా ఉన్నత స్దానంలో వున్న ఉద్యోగుల మీద అలాంటి వార్తలు వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవడానికి ముందుకు రాలేరు. మీడియా ఆఫ్‌ద రికార్డు అంటూ రాసే వార్త తనపైనే అని చెప్పుకునే పరిస్తితి వుండదు. మీడియా ఎవరో ఏదో చెప్పారని, వాటిని పూర్తిగా నిర్దారించుకోకుండా, పూర్తి వివరాలు సేకరించకుండానే వార్తలు ప్రసారం చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి. వారి జీవితాలు తలకిందులౌతాయి. తర్వాత ఎంత మెత్తుకున్నా తిరిగి వారి గౌరవం రావడం కష్టం. అయినా ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌ బాద్యతలో వున్న వారిపై వ్యక్తిగతమైన వార్తలు రాసేప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసవరం వుంటుంది. వృత్తి నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లినా, పొరపాట్లు జరిగినా ప్రశ్నించే హక్కు మీడియాకు వుంది. కాని వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసే అదికారం ఎవరికీ లేదు. అందుకే ఈ విషయంలో మొదట సూటిగా స్పష్టంగా మీడియా సమాజానికి నేటిధాత్రి ప్రశ్నలు సందించింది. ఇంత రచ్చ జరుగుతున్నా ఐఏఎస్‌ అధికారుల సంఘం స్పందించకపోవడాన్ని కూడా నేటిధాత్రి ప్రశ్నించింది. ఆ మరుసటి రోజే సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల సంఘాలు స్పందించాయి. అదే రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ చానల్‌ ప్రసారాలను ఖండిరచారు. చట్టం తన పని తాను చూసుకుపోతుందన్నారు. ఉన్నతోద్యోగుల విషయంలో ఇలాంటి వార్తలు రాయడాన్ని ఆయన ఖండిరచారు. అయితే నేటిధాత్రి మొదటి రోజే చాలా ఘాటుగా ఆ చానల్‌ ప్రసారాన్ని ఖండిరచింది. ఐఏఎస్‌ అధికారులకు కూడా ప్రశ్నలు సందించింది. ఐఏఎస్‌ మహిళా అదికారులంటే అంత ఆశామాషీగా వుందా? అని నిలదీసింది. మహిళా ఉన్నతాదికారులంటే మీడియాకు అంత అలుసైపోయిందా? అని నిలదీసింది. మహిళా ఐఎఎస్‌ అధికారుల జీవితాల మీద వ్యక్తిగత విమర్శలకోసం వేయరాని అభాండాలు వేయడాన్ని ఏ సమాజం స్వాగతించదు. అలాంటి దుర్నీతి మీడియాను ఖచ్చితంగా అందరూ నిలదీయాల్సిన అవసరం వుంది. ఒక మహాళా అదికారి మీద వేయకూడని ముద్ర వేయడం వల్ల అవతలి వ్యక్తులు హరోలౌతారు. ఆ మహిళా అదికారులు సమాజంలో చులకనౌతారు. ఆ అదికారి విషయంలో షశబిషలు లేకుండా చెప్పి, నాయకుల విషయంలో ఫజిల్‌ పూరించండి అన్నట్లు చెప్పి వదిలేయడం వల్ల ఆ అధికారి ఎంత మానసిక క్షభ అనుభిస్తారో అనే ఆలోచన లేకుండా ఎలా ప్రసారం చేశారు. పైగా ఆ ప్రోగ్రాంను మళ్లీ మహిళా యాంకర్‌తోనే ప్రసారం చేయించారు. ఇంతకన్నా దుర్మార్గమేమైనా వుందా? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మిగతా చానళ్లు కూడ నిజానిజాలు తెలుసుకోకుండా అవి కూడా మహిళా యాంకర్లతోనే కథనాలు ప్రసారం చేశాయి. ఇంతకన్నా దుర్గారం ఏదైనా వుంటుంది. మొత్తం తెలుగు మీడియాలోనే ఒక్క నేటిధాత్రి మాత్రమే ఇదెక్కడి సంసృతి, ఇదెక్కడి సంప్రదాయం, మహిళా ఐఏఎస్‌ అధికారి పరువును బజారుకీడుస్తారా? వార్తను రాసింది. కేవలం ఒక్క నేటిధాత్రి మాత్రమే ఆ అధికారులకు అండగా వార్తను ప్రచురించింది. ఆ కథనంలో ప్రస్తావించిన సంబందిత మంత్రికేనా కుటుంబం వుండేది. ఆ మంత్రికేనా కుటుంబ విలువలు వుండేది అని ఆ చానళ్లను నిలదీసింది. ఆల్‌ఇండియా క్యాడర్‌ మహిళా ఉన్నతోద్యోగుల మీద ఊహజని కథనాలు వండి వారుస్తారా? అని నేటిధాత్రి నిగ్గదీసింది. మీడియా చేతిలో వుంది కాదా? అని ఎలాంటి వార్తలైనా సృష్టిస్తారా అని నేటిధాత్రి ప్రశ్నించింది. ఆ కలెక్టర్‌ గురించి కీలకమైన విషయాలు చెప్పిన మీడియా మంత్రి పేరు ఎందుకు చెప్పలేకపోయింది? అంత దమ్ము లేనప్పుడు ఎందుకు ఇలాంటి నీచమైన వార్తలు ప్రసారం చేయాలని కడిగేసింది. కలెక్టర్‌ మహిళ కావడంతో ఆమె పరువు పోయినా ఫరవాలేదనుకున్నారా? మంత్రికి మాత్రం మరక అంటకుండా వుండాలని చూశారా? ఇలాంటివి పురుష అదికారులైనా, మంత్రులైనా, నాయకులైనా, ఇతరులెవ్వరైనా తట్టుకోగలరు. అవసరమైతే వివరణ ఇచ్చుకోగలరు. కాని మహిళా అదికారుల మీద ఇలాంటి తప్పుడు కథనాలు రాసి వివరణలిచ్చుకో అన్నట్లు వదిలేస్తే దానిని జర్నలిజం అంటారా? అందుకే ఐఏఎస్‌ల సంఘం ఏం చేస్తున్నట్లు? నిద్రపోతుందా? అని నేటిధాత్రి నిలదీసింది. పురుష ఐఎఎస్‌ అదికారుల మీద చిన్న వార్తలు వస్తేనే వెంటనే స్పందిస్తారు. కాని ఒక మహిళా ఐఏఎస్‌ అదికారి మీద ఇలాంటి తప్పుడు కధనాలు వస్తుంటే ఆ సంఘం ఏం చేస్తోందని నేటిదాత్రి ప్రశ్నించింది. మహిళా ఉన్నతాదికారి ఆత్మాభిమానం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారా? అని నేటిధాత్రి ఆ అదికారుల సంఘాన్ని నిలదీసింది. ఇంత పెద్ద అబాండాలు ఏ మహిళా ఐఏఎస్‌ అధికారి మీద వేసి వార్తలు రాస్తుంటే ఇతర మహిళా అదికారులు మాకెందుకు లే అనుకున్నారా? అని కూడా నేటిదాత్రి అడిగింది. ఇదెక్కడి దిక్కుమాలిన జర్నలిజం అని ఆ ప్రసారం చేసిన చానళ్లను కూడా నేటిధాత్రి ప్రశ్నించింది. ఎట్టకేలకు అందరూ స్పందించారు. మంత్రి కూడా ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఐఏఎస్‌ అదికారుల సంఘం కూడా ఆయా చానళ్లకు నోటీసులు ఇస్తామని చెప్పింది. పోలీసు శాఖ కూడా వెంటనే రంగంలోకి దిగింది. దోషులపై 20 రోజుల్లో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఏది ఏమైనా నేటిధాత్రి తన సామాజిక బాద్యతను మరోసారి నిలబెట్టుకున్నది. సామాజిక బాద్యత నిర్వహణలో మళ్లీ నేటిదాత్రి మాత్రమే ముందుదని నిరూపించుకున్నది. నేటిధాత్రికి అదికారుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version