ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత .
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరులో 90% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి.కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.. తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ లకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేనియెడల ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని అన్నారు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు, కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చిట్యాల మండల సభ్యులు శీలపాక నాగరాజ్, పుల్ల అశోక్, నేరెళ్ల రమేష్, మట్టే వాడ కుమార్ సాదా రాకేష్ ముదిరాజ్, క్యాతం నాగరాజ్ పద్మశాలి తదితరులు పాల్గొన్నారు.