మల్కాజిగిరి
06 నవంబర్
చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో అధ్వర్యంలో సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం,వినాయక నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ ఎస్ గార్డెన్ లో బిఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి తో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కరిక్రమంలో బిఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ ఇంఛార్జి బద్దం పరుశురాం రెడ్డి, మల్కాజిగిరి ఎలక్షన్,సర్కిల్ ఇంఛార్జి అర్.జితేందర్ రెడ్డి,కార్పొరేటర్ ఎకే. మురుగేష్ ,జేఏసీ వెంకన్న పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా బిఅర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చికెన్ ఓనర్స్ అసోియేషన్ తనకు మద్దతు తెలిపినందుకు ముందుగా చికెన్ ఓనర్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు.తమ విద్య సంస్థలో విద్యార్థులకు కొనుగోలు చేస్తున్న చికెన్,గుడ్లు అసోసియేషన్ సభ్యులు దగ్గర కొనుగోలు చేస్తాం అని అన్నారు,అదేవిధంగా చికెన్ సర్ఫార చేస్తున్న కంపెనీల యాజమాన్యంతో మాట్లాడు చికెన్ తక్కువ ధరకు ఇప్పిస్తానని అన్నారు.ప్రభుత్వ పదకలు ,దళిత బందు,డబుల్ బెడ్ రూం,ఏ స్కీములు అయిన లబ్ధిదారులకు అందేవిధంగా కృషి చేస్తానని అన్నారు.తన తల్లి పేరు అరుంధతి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు అన్నీ వినియోగించుకోవాలని కోరారు.బద్దం పరుశురాం రెడ్డి మాట్లాడుతూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్,బిఅర్ఎస్ పార్టీ కి మద్దతు తెలపడం చాలా మించి నిర్ణయం అని అన్నారు.జవహర్ నగర్ కార్పొరేటర్ మురుగేష్ మాట్లాడుతూ చికెన్ ఓనర్స్ అససియేషన్ సభ్యులకు అందరికీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నీ విధాలుగా అండగా ఉంటాడు అని అన్నారు.బిఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షడు అర్.జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐక్య మత్యమే బలం అని వినికిడికి ఈ రోజు చికెన్ ఓనర్స్ అసోియేషన్ సభ్యులను చూస్తే అర్థం అవతుంది అని అన్నారు.మర్రి రాజశేఖర్ రెడ్డి కి మద్దతు తెలపడం ద్వారా చికెన్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు విద్య,వైద్య పరంగా రాజఖర్ రెడ్డి రెడ్డి మీకు సహకరిస్తారు అని తెలిపారు.చికెన్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ తమ అసోసియేషన్ కి గెలిచే పార్టీ అండ ఉండాలి అని,అప్పుడే తమ అసోసియేషన్ కి న్యాయం జరుగుతుంది అని అన్నారు.తమకు ఏ సమస్యా వచ్చిన మర్రి రాజశేఖర్ రెడ్డి తమకు అండగా ఉండాలి అని కోరారు. శ్రీనివాస్ రెడ్డి,విజయ్,అజయ్ గౌడ్, గోపాల్ తో పాటు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.