మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు దొరకడు ఆడబిడ్డగా ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.


మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు దొరకడని, ఆడబిడ్డగా ఆదరించి నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్, కాట్రాల్ , తాండ, దంతపల్లి, బాపనయ్య తాండ, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బోనాలు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడారు.గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేక పోగా ..ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉన్నాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. 13 ఏళ్లపాటు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుకోకుండా పత్తా లేకుండా పోయిన మైనంపల్లి తన కొడుకును ఎమ్మెల్యేగా చేసేందుకు ఎత్తుకొని వచ్చాడని ఆరోపించారు. నియోజకవర్గపై ఎలాంటి అవగాహన లేని వారు ఎమ్మెల్యే గా గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు అలోచించి ఓటు వేస్తే అభివృద్ధి చెందుతుదని అన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలు విని మోసపోవద్దని, 11 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ 10 ఏళ్ళ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిదని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాల ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగుకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రైతు భీమా, రైతు బంధు పథకాలను ప్రవేశ పెట్టింట్లు చెప్పారు. కల్యాణలక్షి పథకం కింద అడబిడ్డల పెళ్లి కోసం రూ. 1, 00,116 అందచేస్తున్నామని, అధికారంలోకి వస్తే మరింత పెచ్చుకొనున్నామని తెలిపారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3,000 పింఛన్ ఇవ్వనున్నాట్లు పేర్కొన్నారు. రామయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 2001 లో ఉమ్మడి రామయంపేట మండలంలో జడ్పిటిసి సభ్యురాలుగా తనకు రాజకీయ జీవితాన్ని అందించిందని, మీరు పెట్టిన మొక్కను అని గుర్తుంచుకొని తనకు ఓటు వేస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version