మంత్రి సీతక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంనగర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గాదే జయకృష్ణ
ఏటూరునాగారం, నేటిధాత్రి
ఏటూరునాగారం మండలం రాంనగర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత వార్డు సభ్యులు గాదె జయకృష్ణ గారు సుమారు 20 మంది నాయకులు మంత్రి సీతక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి సీతక్క గారు ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తామని వారందరిని పార్టీలోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, PACS మాజీ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,మండల సీనియర్ నాయకులు చిటమట రఘు,జిల్లా వాక్యదర్శి వావిలాల ఎల్లయ్య,మాజీ ఎంపీటీసీ కోడి గోపాల్,రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
