జాతీయ అవార్డుకు ఎంపికైన రామకృష్ణగౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల
మండలం బూర్నపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ళ రామకృష్ణగౌడ్ రాష్ట్రీయ సేవ పురష్కర్ జాతీయ ఆవార్డు 2025కు ఎంపికైనట్లు, ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఫౌండర్, చైర్మన్ ఆకుల రమేష్ తెలిపారు. రామకృష్ణగౌడ్ అన్ని కులాలను ఏకం చేయడంతో పాటు, ఆయన చేసిన వివిద సామాజిక కార్యక్రమాలను గుర్తించడంతో పాటు, నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గ పాల్గోని రాష్ట్ర సాదనలో తనదైన ప్రతిభ కనపర్చడం, నేడు బీఆర్ఎస్ కార్మిక శాఖ తరుపు కార్మికులను ఏకతాటిపైకి తేవడంతో పాటు వారిని చైతన్యం పరచడంతో పాటు, వారి హక్కుల కోసం పోరాడం గుర్తించి ఉత్తమ జాతీయ ఆవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 30 న హైదరాబాద్లో జరిగే జాతీయ సమావేశంలో రామకృష్ణకు ఈ ఆవార్డును ప్రదానం చేయనున్నట్లు ఆయన పెర్కోన్నారు. మారుమూల గ్రామమైన బూర్నపల్లి గ్రామం నుండి జాతీయ స్థాయి ఆవార్డుకు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు రామకృష్ణగౌడ్ కి శుభకాంక్షలు తెలిపి అభినందిస్తున్నారు.