ఓదెల రైల్వే స్టేషన్ లో మద్యం సేవిస్తున్న రైల్వే సిబ్బంది
ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి:
ఓదెల రైల్వే స్టేషన్ లో సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా (టీటీఈ) పిలవబడే సిబ్బంది గత కొద్దిరోజులుగా ఓదెల రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ లో మద్యం సేవించే అడ్డాగా తయారు చేశారు, గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతున్న దీనిపై నిఘా పెట్టే తీరే లేకపోవడం వీరి ఇష్ట రాజ్యానికి స్టేషన్ బుకింగ్ కార్యాలయం గది వేదిక అయింది. దీనిని స్థానికులు కొంతమంది ఆదివారం గమనించి వారిని నిలతీయడంతో వారితో వాదిస్తూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ముఖాలు కొందరి కనబడకుండా జాగ్రత్త వహించిన లాభం లేకపోయింది దీనిపై రైల్వే అధికారులు విచారణ చేపడితే అసలు తతంగం బయటపడే అవకాశం ఉందని అదేవిధంగా ఇలాంటి ఒక బాధ్యత గల రైల్వే సిబ్బంది చేయడం ఇది ఇంకా ఎన్ని రోజులుగా నడుస్తుందో వారిపై విచారణ చేపట్టి రైల్వే ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు
తెలిపారు.