జాతరలో సామాన్యభక్తులకే ప్రాధాన్యతః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి(నేటిధాత్రి:
తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురష్కరించుకుని వడిబాల క్రతువు సంప్రదాయబద్దంగా మంగళవారం ఉదయం జరిగింది. వడిబాల క్రతువులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన సతీమణి సత్యవతితో కలిసి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి అభిషేకం జరిగింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు పాలకమండలి ఛైర్మన్ మహేష్ యాదవ్, ఈఓ జయకుమార్ లు అమ్మవారి దర్శనం చేయించారు. వడిబాలతో అమ్మవారి జాతర ప్రారంభమైందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈనెల 13వ తేది చంప నరకడంతో జాతర ముగుస్తుందని ఆయన చెప్పారు. గంగ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ కార్పోరేషన్, టిటిడి, తుడా సంయుక్తంగా పూర్తి చేశాయని ఆయన తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం కల్పనలో సామాన్యులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. విఐపిలకు ఉదయం 6గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని ఆయన వివరించారు. పాలకమండలి ఛైర్మన్, సభ్యులు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. అనంతరం తాళ్ళపాక పెద్దగంగమ్మ ఆలయం, అంకాళమ్మ ఆలయం, వేశలమ్మ ఆలయాల్లో జరిగిన వడిబాల, అభిషేకం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పోరేషన్ అదనపు కమిషనర్ శారదా దేవి, ఈఓలు జయకుమార్, మునిశేఖర్, టిడిపి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, రాష్ట్ర యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, బిజేపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, టిడిపి క్లస్టర్ ఇన్చార్జీలు జేబి శ్రీనివాస్, పులుగోరు మురళీ, పెద్దగంగమ్మ ఆలయ ఛైర్ పర్శన్ వేదవతి రాయల్, అంకాళమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్ కొండా రాజ్ మోహన్, వేశాలమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్ జగదీష్, కొత్తవీధి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ వినోద్ రాయల్, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, పల్లెవీధి రమేష్, మాజీ కార్పోరేటర్స్ నరసింహాచ్చారి, సీకే రేవతి, నరేంద్ర, భరణీ యాదవ్,మునిరామయ్య జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, కోదండ రెడ్డి,అశోక్ కుమార్, కెఎంకే లోకేష్,ఆళ్వార్ మురళీ,సనీల్ చక్రవర్తి,ఆముదాల వెంకటేష్,జేకే రాయల్, జానకిరామ్ రెడ్డి, రాజేష్ ఆచ్చారి, శ్రావణ్, ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, రామకృష్ణ,బిజేపి నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…
