హంటర్ రోడ్డు లో గల గౌడ హాస్టల్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా పతాకాన్ని ఎగరవేసిన గోపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఏడుగురు సభ్యులందరికీ జోహార్లు తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తాళ్లపల్లి సురేష్ గౌడ్, కోశాధికారి చిర్రా ఉపేందర్ గౌడ్, పంజాల మధు గౌడ్, నర్మెట్ట శ్రీనివాస్ గౌడ్, నర్మెట రవీందర్ గౌడ్ తదితర జిల్లా గోపా నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.