మంత్రి సీతక్క కృషితో ములుగు జిల్లా ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది.
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి.
మంగపేట నేటిధాత్రి
ఎందరో త్యాగదనుల పలం నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలు అని రాష్ట్ర మంత్రి సీతక్క కృషితో ములుగు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయం మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు
ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ సెల్యూట్ చేసే రోజు ఇదే అని అమర వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం అని సాంబశివరెడ్డి అన్నారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని
నూతన ప్రభుత్వం పారదర్శక పాలన అందించడానికి, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
రేవంత్‌రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని
ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం,
సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ఇప్పటికే
పకడ్బందీగా అమలు చేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మిగతా పథకాలైన రైతు
భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు
మహిళలకు మహాలక్ష్మి పథకం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు అనంతరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు సాంబశివరెడ్డి బహుమతులను ప్రధానం చేశారు ఆయా కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శి కోడేపాక శ్రావణ్ కుమార్ గ్రామపంచాయతీ సిబ్బంది శెట్టిపల్లి వెంకటేశ్వర్లు మనబంటి ఆనందం కుసిని సీతారాములు ప్రధానోపాధ్యాయురాలు బానోతు సుమలత ఉపాధ్యాయులు కొమరం నాగేశ్వరరావు బానోతు విజయభాస్కర్ అంగన్వాడీ టీచర్లు మేరీ పద్మ సరళ నాయకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రాజమల్ల సుకుమార్ పేసా మొబలైజర్ డబ్బుల ముత్యాలరావు అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు షేక్ మోయునుద్దీన్ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రూప భద్రయ్య నాయకులు నాగిరెడ్డి బాలకృష్ణ వెంకట్ రెడ్డి సంజీవరెడ్డి దూలగొండ నారాయణ యలగొండ పెద్ద లక్ష్మయ్య నాగుల రాంబాబు శెట్టిపెళ్లి నరసింహారావు రవి చౌదరి సెగ్గం వెంకటేశ్వర్లు గండి ధర్మరాజు విద్యార్థినీ విద్యార్థులు మరియు సాంబశివరెడ్డి వ్యక్తిగత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు