-కొడారి రమేష్ యాదవ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 26
1950 జనవరి 26న భారతదేశంలో రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి మనం నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా భావిస్తామని, భారత రాజ్యాంగం..భారతదేశానికి సర్వోన్నత చట్టమని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొడారి రమేష్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలకు పైగా బ్రిటిష్ వారి చేతిలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు 15, 1947న స్వాతంత్రం సిద్ధించిందన్నారు. అదేవిధంగా బ్రిటిష్ వారు అందించిన చట్టంను ప్రక్కన పెట్టి..అంబేద్కర్ రచించిన ప్రత్యేక రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారన్నారు. స్వేచ్ఛను సాధించిన భారతావని స్వీయ నిర్ణయాలకు సిద్ధం చేసుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసి సర్వసత్తాక, సార్వభౌమ రాజ్యాంగ దినంగా మారిన రోజే ఈ గణతంత్ర దినోత్సవమన్నారు. త్యాగదనుల ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు