సరిహద్దు బ్రిడ్జ్ పరిశీలించిన కామారెడ్డి పీఆర్డీఈ
నిజాంపేట: నేటి ధాత్రి
జిల్లాలో సరిహద్దులో గల బ్రిడ్జి ప్రమాదంలో ఉంది. నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామం నుండి ఇస్సానగర్ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న బ్రిడ్జ్ గత కొన్ని నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కింది భాగం పూర్తిగా కొట్టుకుపోయి కూలిపోయే దశలో ఉంది. దీంతో స్పందించిన కామారెడ్డి పీఆర్డీఈ స్వామిదాస్ బ్రిడ్జినీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్రిడ్జ్ కింది భాగం పూర్తిగా కొట్టుకుపోవడంతో ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్ళవద్దని ఆయన హెచ్చరించారు. సమస్యను వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాతూరి బాల్ రెడ్డి, నందగోకుల్ సర్పంచ్ పాతూరి భాను ప్రకాష్ రెడ్డి, ఇస్సానగర్ సర్పంచ్ ధర్మాగారి రాజా గౌడ్, కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.
