కోడి నిండా మందులే.. ప్రాణాలు గాలిలో దీపాలే!

పౌల్ట్రీ కోడి..ప్రాణాలు హరీ!

`మందుల కోడి..క్యాన్సర్ కు రహదారి!

`సర్వ రోగాల కోడి..సర్వ మానవాళికి రోగాల ముడి.

`లెగ్ పీసులు తిని లేవలేక పోతున్నాం.

`బోన్లేస్ పేరుతో మన బొక్కలు గుల్ల చేసుంటున్నాం.

స్టేరాయిడ్ కోళ్లను తిని స్టేచర్ ఇంటి దాక తెచ్చుకుంటున్నాం.

`నాణ్యత లేని జీవి కోడి.. జీవం తీసే విష ప్రాణి.

`28 రోజుల కోడి.. బతుకులకు ఉరి.

`ప్రోటీన్స్ పేరుతో పొట్ట నింపుకుంటున్నాం!

`పొట్ట పాడుచేసుకుంటున్నాం.

`మందుల కోడి…మన బతుకులకు యమపురి!

`మందులతోనే కోడి మాంసం.. తిని రోగాలు తెచ్చుకుంటున్నాం!

`కోడికి విష జ్వరం…ఆ కోళ్లు తిని మనిషి సర్వ నాశనం.

`చర్మం నిండా విషమే..తింటే బతుకు భారమే!

`కోడిని పెంచేది విషమే..తింటే ప్రాణాలు పోయేది ఖాయమే.

`కోడి నిండా రోగాలే..తెలిసి తింటున్న ముర్కులమే.

`జంతువులు కూడా కొన్ని తినవు..వాసన కూడా చూడవు!

`తినకూడని చికెన్ తింటున్నాం..కమ్మగా వేయించుకుంటున్నాం.

`ముక్క లేనిదే ముద్ద దిగదు.. ప్రమాదమని తెలిసినా తినకుండా ఉంటలేము.

హైదరాబాద్, నేటిధాత్రి:
లొట్టలేసుకొని తినగానే సరిపోదు. దానిలోపల ఎన్ని కనిపించని పురుగులున్నాయో తెలుసుకో..దాని శరీరమంతా ఎంత విషపూరితమైన వుందో అర్దం చేసుకో..పొట్ట నిండా తినడానికి అదేమీ సంపూర్ణ ఆహారం కాదు. దాని నుంచి వెళ్లిన విషం నీ ఒళ్లంతా నిండుతుందని తెలుసుకో..దాని ద్వారా ఊహించని రోగాలొస్తాయని గుర్తుంచుకో..కోరి కోరి కష్టాన్ని తెచ్చుకోవడం అంటే ఇదే మరి. ప్రపంచంలో మనం తింటున్న అన్ని ఆహారాలలో అత్యంత కలుషితమైన, విషపూరితమైన,కల్తీ మయమైన ఏకైక ఆహరం ఫౌల్ట్రీ కోడి. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా అందరికీ అదే కావాలి. పండగ, పబ్బం అనేది ఏదీ అసవరం లేదు. నిత్యం పౌల్రీ కోడితో వండిని ముక్క లేనిదే చాలా మందికి ముద్ద దిగదు. రోజూ తినకుండా వుండలేదు. పూటపూటకు చికెన్‌తోనే తినేవారు కూడా చాలా మంది వున్నారు. ఆకలైందంటే చాలు ముందు మనసు మాంసాహారం మీదకు అందులోనూ చికెన్ వైపు మళ్లించుకుండా వుండలేదు. సహజంగా బైట తినే సమయంలో మటన్ తినాలంటే ఖర్చు ఎక్కువ. పైగా అది నిజమైన మటనా కాదా? అనేది తెలియదు. దాంతో సగటు వ్యక్తి ఎంచుకునే ఏకైక మాంసాహారం చికెన్. చికెన్ అనేది ప్రొటీన్ అనే భ్రమలో అందరం బతుకుతున్నాం. వైద్యులు కూడా అదే చెబుతున్నారు. తినమని ప్రోత్సహిస్తున్నారు. ఇక కరోనా తర్వాత బాగా పెరిగిన బిజినెస్‌లలో చికెన్ అన్నింటికన్నా ముందుందని చెప్పడంలో సందేహం లేదు. ఆ సమయంలో ప్రొటీన్ ఫుడ్ అవసరం అని వైద్యులు సూచించినట్లు ప్రభుత్వాలు కూడా ప్రచారం చేశాయి. చికెన్ బాగా తినమని చెప్పాయి. దాంతో జనం కరోనా సమయం నుంచి ఎగబడి తింటున్నారు. ఖర్చుకు కూడా వెనుకాడకుండా కొన్ని కుటుంబాలు నిత్యం తింటున్నాయి. కాస్తో కూస్తో ఆర్ధిక స్దోమత సహకరించని వాళ్లు వారానికి ఒక్కసారైనా తింటున్నారు. అయితే ఇక్కడ కరోనా సమయంలో ప్రభుత్వం చెప్పింది చికెన్ తినమని చెప్పే ముందు నాణ్యమైన కోడి మాంసం తినమని చెప్పాలి. కాని అలా చెప్పలేదు. చికెన్ అనగానే సహజంగా పౌల్రీ కోడి మాత్రమే అనే అర్దం వచ్చింది. నిజానికి ప్రజలకు ఇప్ప్పుడు అందుబాటులో వున్నది కూడా పౌల్రీ చికెన్ మాత్రమే. ఏదైనా సరే కొంత కాలం తింటే పెద్దగా ప్రభావం వుండకపోవచ్చు. కాని నిరంతరం తింటుంటే అది పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుందన్న సంగతి మర్చిపోతున్నాం. ఒకప్ప్పుడు పౌల్రీ కోడి అనేది మూడు నెలల తర్వాత అమ్మకాలు జరిగేవి. వాటి పెంపకంలో జాగ్రత్తలుండేవి. పెద్దగా మందులు వాడకాలు వుండేవి కాదు. కోళ్లకు ఏవైనా వైరస్‌లు సోకుండా కొన్ని రకాల చుక్కల మందులు వాడుతూ వుండేవారు. ఆ కోడి కూడా సుమరు మూడు నెలల పాటు పెంచి, మార్కెట్‌కు చేరవేసేవారు. కాని కాలం మారింది. ఆ సమయంలో ప్రతి ఊరిలో చిన్న చిన్న షెడ్లలో బాయిలర్ కోళ్లు పెంచుకునే వారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని, రైతులు ఊరికి సమీపంలోనో, లేక వ్యవసాయ క్షేత్రాల వద్ద చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకొని కుటీర పరిశ్రమగా పెంపకాలు మొదలు పెట్టారు. కోళ్ల పెంపకం దారులను కూడా రైతులుగానే భావించేవారు. కాని వ్యాపారంలోకి పెద్ద పెద్ద వ్యాపారులు చేరిపోయారు. వందల, వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. చిన్న చిన్న పౌల్రీ పరిశ్రమలను మింగేశారు. ఇప్ప్పుడు అలాంటి చిన్న చిన్న ఫౌల్రీ రైతులు ఎక్కడా కనిపించరు. కొన్ని దశాబ్దాల పాటు పౌల్ట్రీని నమ్ముకున్న నిండా మునిపోయారు. పెద్దపెద్ద కంపనీలు వచ్చాయి. వాటిలో కొన్ని కోట్ల కోళ్ల పంపకాలు జరుగుతన్నాయి. ఇంత వరకు బాగానే వుంది. వందల, వేల ఎకరాల్లో ఫామ్‌లు నిర్మించి కోట్లాది కోళ్లపెంపకాలతో వేల కోట్ల రూపాయల వ్యాపారాలు సాగిస్తున్నారు. కాని కోడి జీవితాన్ని కుదించారు. మూడు నెలలు పాటు ఎలాంటి మందులు వాడకుండా, సహజమైన వాతారణంలో, ఆరోగ్యకరమైన కోళ్లను పెంచేవారు. కాని ఇప్ప్పుడు దాని జీవిత కాలం 28 రోజుల మాత్రమే అని నిర్ణయించేశారు. కోడి పిల్లల తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ వచ్చేందుకు వాటికి నానా రకాల మందులు వాడుతున్నారు. అందులో స్టెరాయిడ్స్ వాడుతున్నారని చెబుతున్నారు. కోడి అది వేగంగా పెరగాలి. ఫామ్ దాటి వినియోగదారుల నోటికి చేరాలి. అంటే కోడి ముప్పై రోజుల్లోనే దాని జీవితం ముగిసిపోవాలి. అలా తయారైన కోడిలో అనువణువు విషంతో నిండిపోయేలా తయారౌతోంది. ముప్పై రోజులు దాటితే సహజంగానే ఆ కోడి చనిపోతుంది. అంతలా తన శరీరంలో విషాన్ని పెంచుకునేలా కోడిని తయారు చేస్తున్నారు. పైకి నిగనిగలాడేలా పెంచుతున్నారు. ప్రపంచంలో ఏ జీవి అంత తొందరగా పెరిగే అవకాశం లేదు. మన తినే మేకలే కాని, ఏ ఇతర మాంసాహర జీవులు 28 రోజుల్లో తినేందుకు వీలు లేదు. కాదు కూడా.. అవి పెరగడానికి కొంత సమయం పడుతుంది. పైగా అవి సహజసిద్దంగా పెరుగుతాయి. నాటు కోళ్లు పెరడగానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. వాటిలో అనవసరమైన కొవ్వు వుండదు. వాటికి ఎలాంటి రోగాలు వుండవు. ఇలా ఫామ్‌లలో పెంచే కుందేళ్లే గాని, అనేక రకాల మాంసాహరం అందించే ఏ జీవిలోనూ ఫౌల్ట్రీ కోడిలో వుండేంత విషయం వుండదు. అసలు ఆ కోడిలో నాణ్యతే వుండదు. మొత్తం శరీరం నిగనిగలాడుతున్నట్లు కనిపించినా అంత విషమయమై వుంటుంది. అలాంటి కోడి కూరను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ హాస్టళ్లలలోని పిల్లలకు ఖర్చుతో కూడుకున్న మటన్‌ను పెట్టలేక, తక్కువలో వచ్చే ఈ చికెన్‌ను అందిస్తున్నారు. ఇళ్లలోనూ పిల్లలకు చికెన్‌ను బాగా అలవాటు చేస్తున్నారు. ఆ చికెన్ తినడం వల్ల ఆడపిల్లలు తొందరంగా ఎదుగుతున్నారన్న భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తున్నది లేదు. ఈ మధ్య కూరగాయలు, పండ్లు, ఫలాలు, బియ్యం, ఇతర పదార్దాలన్నీ ఆర్గానిక్ కావాలని కోరుకుంటున్నారు. కాని మాంసంలో కూడా ఆర్గానిక్ అనేది ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎలాంటి మందులు వాడకుండా పెంచిన కోళ్లను మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం లేదు. ప్రజలు కూడా కోరడం లేదు. శాఖాహరం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమాజం, మాంసం విషయంలో, అందులో పౌల్ట్రీ కోడి విషయంలో మాత్రం ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. వినియోగానిక దూరంగా వుండడం లేదు. పెరిగిపోయిన ీVAటల్ వ్యాపారాల పుణ్యమా అని పౌల్ట్రీకోడికి విపరీతమైన గిరాకి పెరిగిపోయింది. ఆ విషపూరిత కోడికి ీVAటళ్లు మరిన్న రసాయనాలు అద్ది వాటి నుంచి కుళ్లిన వాసనలు రాకుండా, కల్తీ నూనెలో వేయించిస్తున్నారు. వాటని చూడగానే తినాలిపించేలా తయారు చేస్తున్నారు. అలాంటి రుచులకు అలవాటు పడిన ప్రజలు కూడా ఇంట్లో వంటలు మానుకున్నారు. స్విగ్గిలు, జొమాటాలో వచ్చిన తర్వాత ీVAటళ్లకు వెళ్లే తీరిక లేని వాళ్లు, సమయం లేని వాళ్లు ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. తెప్పించుకుంటున్నారు. రాత్రైనా, పగలైనా అర్ధరాత్రైనా సరే ఆర్టర్లు పెట్టుకొని తెప్పించుకుంటున్నారు. పిల్లలు అడిగిందే తడువుగా కూడా తెప్పించి తినిపిస్తున్నారు. వారి జీవితాల్లో చిన్న వయసు నుంచే విషాలు నింపుతున్నారు. వారి శరీరాలను రోగాల పుట్టలను చేస్తున్నారు. కాన్యర్‌కు రహదారులు వేస్తున్నారు. జిహ్వ చాపల్యంతో విపరీతంగా ఖర్చు పెట్టి కోడి కూర తిని, ఆరోగ్యం చెడగొట్టుకొని, ఆసుపత్రుల పాలౌతున్నారు. మళ్లీ బాగు పడేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. బతుకు దివాళా తీసిన తర్వాత నాన్ వెజ్ మానేశామని అదేదో గొప్ప పని చేసినట్లు చెప్ప్పుకుంటున్నారు. సర్వం సర్వమంగళమైన తర్వాత శాఖాహరానికి మారామని చెప్ప్పుకుంటే సరిపోదు. ముందే జాగ్రత్త పడి వుంటే ఆయుష్సు పెరిగేది. ఆస్తులు మిగిలేవి. ఆరోగ్యం సంపూర్ణంగా వుండేది. అనారోగ్యాలతో బాధపడాల్సిన అవసరం లేకుండేది. లేని పోని చింతలు వుండేవి కాదు. ప్రాణ బీతితో బతికే కాలం అసలే వుండేదికాదు. అందుకే పూర్వం పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. ఇప్ప్పుడు కడుపునిండా కల్తీ సరుకులైనా, కుళ్లిన మాంసం ముద్దలైనా సరే తింటే సరి..అనుకొని పొట్టలు నింపుకుంటున్నారు. రోగాలు తెచ్చుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version