బీఎస్ఎన్ఎల్ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సరం పాటు పోరెండ్ల నరసింహా రాములు కొనసాగింపు:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో పొరెండ్ల నరసింహ రాములు ను భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి. ఎస్. ఎన్.ఎల్) తమ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సర కాలం పొడిగించింది. ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారు తేదీ: 25- 06- 2025 ఉత్తర్వులు జారీ చేసారు. ఇక నుండి నరసింహ రాములు గారు బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ కు సంబంధించిన కేసుల ను వరంగల్ జిల్లా కోర్టు మరియు సబ్ కోర్ట్స్ మరియు జిల్లా వినియోదారుల ఫోరంలలో బి.ఎస్.ఎన్.ఎల్ తరుపున వాదించనున్నారు. సీనియర్ న్యాయవాది అయిన పొరేండ్ల నరసింహ రాములును బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ తమ ప్యానెల్ న్యాయవాది గా మరో సంవత్సరం పాటు కొనసాగింపుగా ఉత్తర్వులు జారీ చెయ్యడం పట్ల తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు మరియు పలువురు న్యాయవాదులు నరసింహ రాములు గారికి అభినందనలు తెలిపారు.