గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజల జేబులు కాళీ
◆:- దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రిలు.
◆:- ఆస్పత్రి పేరేమో మనుషులను బ్రతికించేది, ఆసుపత్రి బిల్లు చూస్తే ప్రజలకు ప్రాణాలు పోతున్నాయి.
◆:- హాస్పిటల్ యజమాన్యం ప్రభుత్వ వైద్యులు,
◆:–ప్రభుత్వ వైద్య అధికారులే ప్రోత్సహిస్తున్నారా?
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఆసుపత్రి గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ లక్షల లక్షలు దోచుకుంటున్నట్లు ప్రజలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజలను పీడించి లక్షల్లో దోచుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ సొంతగా ప్రైవేట్ హాస్పిటల్లు ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే పేద రోగుల నుండి లక్షల్లో దండుకుంటున్నా గాని జిల్లా వైద్యాధికారులు
పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఒక్కరోజు అడ్మిన్ అయితే 20000 నుండి 30 వేల రూపాయల ఫీజు, డాక్టర్ వచ్చి పేషెంట్ ని పరీక్షిస్తే ఒక రోజుకి 1500 రూపాయలు తీసుకుంటూ పేద ప్రజలను నిలువునా దోపిడికి గురి చేస్తున్నా కానీ జిల్లా వైద్య అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించుకుంటూ పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తూ ఇటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కానీ జిల్లా వైద్య అధికారులకు ఎందుకు కనబడడం లేదు. ఇలాంటి ప్రైవేట్ ఆస్పత్రి పైన చర్యలు తీసుకుంటే తప్ప పట్టణంలో పేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందే పరిస్థితి కనబడటం లేదని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ వైద్యులు యజమాన్యంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఆస్పత్రిని ఎవరి అండ దండ తో నడుపుతున్నారో ప్రజలకు అర్థం కాని ప్రశ్న? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఇలాంటి ఆసుపత్రి పైన ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటే తప్ప పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి లక్షల్లో దోపిడి నుండి ఉపశమనం కలిగించిన వారు అవుతారని ప్రజలు కోరుతున్నారు.
