యువత సురక్షితమైన డ్రైవింగ్ కోసం పోలీసుల అవగాహన సదస్సు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చేల్పూర్ గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గణపురం మండలం సిఐ సిహెచ్ కరుణాకర్ రావు, ఎస్సై రేఖ అశోక్ ఆధ్వర్యంలో నేటి యువతకు డ్రైవింగ్ లో పాటించవలసిన రూల్స్ వివరిస్తూ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని ఈ విధమైన రూల్స్ ను పాటించనిచో చట్టరీత్య చర్యలు తీసుకోబడును తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్పూర్ సర్పంచ్ వార్డు మెంబర్స్ యువత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
