యోగా సాధన ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యం…

యోగా సాధన ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య వారోత్సవం హోమియోపతి డేని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా సెషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ హాజరైనారు
ఈ సందర్భంగా హోమియోపతి వైద్య విధాన పితామహుడు డా. క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యూయెల్ హానెమాన్ 271వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వత్తిడి జయించడానికి యోగా అద్భుతమైన సాధనమని తెలిపారు. ప్రజలు ప్రతిరోజూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని క్రమం తప్పక సాధన చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ వల్ల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆయుష్ సేవలను ప్రజలకు మరింత చేరువచేయడాని ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుండే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలు వత్తిడి లేని జీవనం సాగించేందుకు యోగా చక్కగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను వివరించారు. యోగ సెషన్ అనంతరం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆయుష్ వైద్యులు డా. తనూజా రాణి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విజయ లక్ష్మి, మునిసిపల్ చైర్మన్ బుర్ర కొమ్మరయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, డిపిఆర్వో శ్రీనివాస్, ఆర్డిఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, ఆయుష్ జిల్లా వైద్య బృందం, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version