అంకుర్ మొక్కజొన్న భాస్కర ప్రదర్శన క్షేత్రం
కేసముద్రం/ నేటి ధాత్రి
నాగలి సంపత్ అనే రైతు అంకుర్ సీడ్స్ మొక్కజొన్న భాస్కర్ అనే రకం పెట్టడం జరిగింది, ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల రైతులు వచ్చి చూడడం జరిగింది, టి ఎస్ ఎం నాగేంద్రబాబు మాట్లాడుతూ, భాస్కర్ అనే మొక్కజొన్న రకం చాలా మంచి దిగుబడిని ఇస్తుందని చేను గాలి వర్షం తట్టుకొని అడ్డం పడదని కంకి కలరు బాగుంటుందని చివరిదాకా గింజలు ఉంటాయని మార్కెట్లో కూడా అధిక రేటు పలుకుతుందని రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఈ విత్తనం వాడ వల్ల అధిక లాభాలు పొందవచ్చునని రైతులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కోమటిపల్లి సర్పంచ్ మద్దెల బిక్షపతి రైతులకు మంచి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఎడవల్లి శ్రీనివాసరెడ్డి ఇనుగుర్తి డీలర్ కాసాని ఐలయ్య వివిధ గ్రామాల రైతులు 140 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి గండి శ్రీనివాస్ సృజన్ యాకన్న వీరన్న బాలు నాయక్ వివిధ గ్రామ రైతులు పాల్గొన్నారు.
