పేదల నేస్తం…శీనన్న హస్తం!

పేదల ఆత్మ బంధువు శీనన్న

ఆపదలో వున్నవారి ఆపద్భాందవుడు శీనన్న

ఏటా కొన్ని వేల మందికి ఇతోదిక సాయం చేసే నాయకుడు శీనన్న

కార్యకర్తలను కడుపులో పెట్డుకొని చూసుకుంటాడు.

అనుచరులకు ఎల్లవేళలా అండగా వుంటాడు.

అభిమానుల ఆలోచన మేరకు అడుగులు వేస్తుంటాడు.

శ్రేయోభిలాషుల సూచనలు తీసుకుంటాడు.

ప్రజాసేవలో ముందుంటాడు.

ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించగలడు.

పట్టువదలని విక్రమార్కుడు.

అంచెలంచెలుగా ఎదిగిన కార్యోన్ముఖుడు.

కష్టపడి జీవితాన్ని, వ్యక్తిగా మానవత్వాన్ని నింపుకున్నాడు.

రాజకీయాలలో తొలి అడుగులోనే ఎంపి పదవిని అందుకున్నాడు.

ప్రజాభిమానంతో జిల్లాను శాసించే నాయకుడయ్యాడు.

బిఆర్‌ఎస్‌ ను ఖమ్మం జిల్లాలో కట్టడి చేశాడు.

ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాక రాకుండా చేస్తానన్నాడు.

బిఆర్‌ఎస్‌ కు రాజకీయంగా చుక్కలు చూపించాడు.

ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ కు తావులేకుండా చేశాడు.

నమ్మిన వారిని మోసం చేస్తే పరిణామం ఎలా వుంటుందో చూపించాడు.

అభిమానించిన వారికి ద్రోహం చేస్తే ఎలా వుంటుందో రాజకీయంగా బుద్ధి చెప్పాడు.

ఖమ్మంలో తనకు తిరుగులేదని శపథం చేసి మరీ నిరూపించాడు.

మంత్రిగా దూసుకుపోతున్నారు.

క్యాబినెట్‌లో పొంగులేటి ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
నాయకుడంటే ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడాలి. నాయకుడు వేసే అడుగులపై ప్రజలకు విశ్వాసం కలగాలి. నాయకుడిని నమ్మితే తమకు న్యాయం జరగుతుందన్న భరోసా కలగాలి. అప్పుడే ప్రజలు నాయకుడిని ఆదరిస్తారు. అభిమానిస్తారు. నాయకుడిగా గుర్తిస్తారు. తమకు సేవ చేస్తాడని విశ్వసిస్తారు. అప్పుడు ఆ నాయకుడు ఏది చెప్పినా ప్రజలు ఆయన వెంటే వుంటారు. ఆ నాయకుడిని కీర్తిస్తారు. ఎందుకంటే నాయకుల్లో చాలా రకాలు వుంటారు. పరిస్దితులు అనుకూలంగా మారి అదృష్టం వరించి కొందరు నాయకలౌతుంటారు. అనుకోని అవకాశాలు వచ్చి నాయకులయ్యే వారు చాలా మంది వుంటారు. కాని కొంత మంది మాత్రమే ప్రజల మన్ననలతో నాయకులౌతారు. కొంత మంది సమస్యల మీద పోరాటం చేసి గుర్తింపు తెచ్చుకుంటారు. నాయకులౌతారు. కొందరు వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేసి, వారి సమస్యలు తీర్చి, ఆర్ధికపరమైన ఇబ్బందులను తొలగించి, ఆరోగ్యపరమైన సేవలు అందించి నాయకుడౌతారు. ఇలా ప్రజా శ్రేయస్సు కాంక్షించే వారంతా నాయకులౌతారు. కాని పట్టుదలతో మరింత ఉన్నత స్దానానికి అందరూ చేరుకోలేరు. నిత్యం ప్రజల్లో వుండేవారు మాత్రమే నాయకులౌతారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యేవారు నాయకులౌతారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ వారి సాధకబాధకాలు తెలుసుకొని, వారిని ఆదుకుంటూ వుండేవారు ప్రజల హృదయాల్లో స్ధానం సంపాదించుకుంటారు. ఇలా పరిపూర్ణమైన అంశాలు మిలితమైన నాయకులు కొందరే వుంటారు. అలాంటి నాయకుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అందరికన్నా ముందుంటారు. ఇంతటి గొప్ప సుగుణాలున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇది ప్రజలు చెప్పే మాట. ప్రజల హృదయాల నుంచి వినిపించే మాట. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేదల నాయకుడు.
పేదల మేలు కోరే నాయకుడు. పేదల అభ్యున్నతి కోసం నిత్యం పరితపించే నాయకుడు. వారి శ్రేయోభివృద్ది గురించే నిత్యం తపించే నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అందుకే పదిహేనేళ్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు ఖమ్మం జిల్లాకు మాత్రమే తెలిసిన పేరు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. కానీ అప్పటికే ఖమ్మం జిల్లా ్ప ప్రజలకు ఎంతో చేరువైన నాయకుడు. ఖమ్మం ప్రజలకు ఎంతో సేవ చేసిన నాయకుడు. ఆ సేవ తత్పరతే ఆయనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గుప్తదానాలు చేసే నాయకుడు. కాని అనూహ్యంగా 2014 ఎన్నికల ముందు అప్పటి పరిస్దితుల దృష్టా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత వైసిపి నుంచి ఎన్నికల బరిలోకి దిగాల్సివచ్చింది. అప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్ర వైసిసి అధ్యక్షుడుగా వున్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయాలను తొలి దశలోనే శాసించారు. వైసిసి నుంచి తాను పోటీ చేసి గెలవడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా గెలిపించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకున్న ఈ తరం రాజకీయ నాయకుల్లో అగ్రగణ్యుడు పొంగులేటి. తన ఎంట్రీతోనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుగోలిగినంత రాజకీయం చేయడం అంటే ఆశామాషీ కాదు. అందుకు ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ ఎన్నికల్లో ఆయనను నమ్మి ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. అందుకే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడయ్యారు. తర్వాత కాలంలో ఆయన బిఆర్‌ఎస్‌ చేరారు. 2018 ఎన్నికల్లో కేసిఆర్‌ ఆయనను పక్కన పెట్టినా ప్రజా శ్రేయస్సును కాంక్షించారే గాని రాజకీయాలను కోరుకోలేదు.
ప్రజలకు మేలు జరిగితేచాలు తనకు పదవులు అవసరం లేదనుకున్నాడు. కాని తనను నమ్ముకొని వున్న ప్రజలకు అన్యాయం జరగుతుంటే సహించలేకపోయాడు. తన వాళ్లకు నష్టం జరుగుతుంటే ఓర్పు వహించలేకపోయాడు. తన రాజకీయాన్ని చిదిమేసే దాకా తెస్తుస్తున్నా ఓర్చుకున్నాడు. కాని ప్రజలకు అన్యాయం జరిగే రాజకీయాలు సాగుతుంటే ఒక చూస్తూ ఊరుకోలేకపోయాడు. అప్పుడు ఆయన తిరుబాటు బావుటా ఎగురువేశారు. మౌనంగా వున్న తన నాయకత్వాన్ని తక్కువగా అంచనా వేసుకున్న కేసిఆర్‌కు చుక్కలుచూపించే రాజకీయం చేశాడు. దటీజ్‌ పొంగులేటి అని నిరూపించుకున్నారు. ఇది అందరికీ సాధ్యమయ్యేపనికాదు. పట్టుదల వున్న నాయకులకే సాధ్యమౌతుంది. ప్రజలకు మేలు చేయాలన్న తపన వున్న నాయకులకే సాధ్యపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే పేదల నేస్తం. పెదల పెన్నిది. తాను సంపాదించిన సొమ్మును పేదల పంచిన నాయకుడు పొంగులేటి. ఆపదలో వున్న వారిని ఆదుకోవడం ఆయన మానవత్వానికి నిదర్శనం. అందుకే ఖమ్మం ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనకు బిఆర్‌ఎస్‌లో అవమానం జరిగితే తట్టుకోలేకపోయారు. ఆయన పిలుపును విన్నారు. ఆ పిలుపు మేరకు బిఆర్‌ఎస్‌ ఖాళీ చేశారు. బిఆర్‌ఎస్‌కు ఖమ్మంలో స్ధానం లేకుండా చేశారు. తన ప్రజలంటే ఎంత నమ్మకం వుంటే ఒక నాయకుడు ఇంతటి రాజకీయాన్ని నెరపగలరు. ఈ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకన్నారు. తన నాయకత్వానికి ఎదురులేదని ప్రపంచానికి చాటారు. ఖమ్మంలో తనకంటే బలమైన నాయకుడు లేడని రుజువు చేశారు. ఇలా జిల్లా రాజకీయాలను తక్కువ సమయంలో శాసించిన నాయకులు చాలా తక్కువ. సహజంగా అదికారంలో వున్నప్పుడు రాజకీయాలను ఎవరైనా శాసిస్తారు. కాని ఒక్కడుగా, ఒంటరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు రాజకీయాలను శాసించడం అన్నది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అది పొంగులేటికి మాత్రమే సాద్యమైంది. అందుకు ప్రజల తోడ్పాడు తోడైంది. నాయకుడిగా పొంగులేని పది మెట్లు ఎక్కేలా చేసింది.
కార్యకర్తలను కడుపులో పెట్టుకొనా చూసుకోవడంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంచిన నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. వారికి ఎలాంటి అపద రాకుండా ఎళ్లవేళలా కాపాడుకుంటాడు. కార్యకర్తలను తన సోదరులుగా చూసుకుంటారు. ఆందుకే ఆయన అనుచరులు రెండు దశాబ్ధాలుగా ఆయన వెంటే వున్నారు. ఆయన నడిచే దారిలో నడుస్తున్నారు. రాజకీయంగా ఆయనకు వెన్నంటే వుంటున్నారు. పొంగులేటి వైసిసిలో వున్నప్పుడు ఆయన వెంటే వున్నారు. తర్వాత బిఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడు ఆయనతోపాటు నడిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో పొంగులేటిని నమ్ముకొని రాజకీయం సాగిస్తున్నారు. అడుగడుగునా కార్యకర్తలు పొంగులేటి ఎంత అండగా వుంటారో ఈ ఒక్క విషయంతో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా నాయకులు పార్టీలు మారినప్పుడు వారి వెంటే అందరూ రాకపోకపోవచ్చు. కాని మంత్రి పొంగులేని అనుచరులు ఆయన ఏ పార్టీలో వుంటే ఆ పార్టీని బలోపేతం చేస్తారు. వారు వదిలేసిన పార్టీని ఖాళీ చేస్తారు. బిఆర్‌ఎస్‌కు ఖమ్మం జిల్లాలో దిక్కూదివానం లేకుండా చేయడంలో పొంగులేటికి అనుచరులు, కార్యకర్తలు, నాయకులు తోడుగా నిలిచారు. అది పొంగులేటి నాయకత్వ పటిమ. కార్యకర్తల అంకితభావం. అనుచరులను కంటికి రెప్పలా చూసుకుంటే ఏ నాయకుడైనా పొంగులేటి అంతటి నాయకుడు అవుతారు. కాని పొంగులేటి లాంటి అంకితభావం అందరికీ వుండదు. అందుకే పొంగులేటి లాంటివారు చరిత్రకు కొత్త బాష్యం చెప్పే నాయకులుగా చరిత్ర సృష్టిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటును తాకనివ్వని శపదం చేశారు. నెరవేర్చుకున్నారు. తన పట్టుదల మందు ఎంత వారైనా సరే దిగదుడుపే అని రాజకీయాలకు కొత్త నడకలు నేర్పారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వంలో నెంబర్‌ టూగా వెలుగొందుతున్నారు. రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్తు వున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తన శాఖను ప్రక్షాళన చేస్తూ, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు. పాలనతో తనదైన ముద్రను వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!