దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న మార్కెట్కు వచ్చే ప్రజలు
పట్టించుకోని సానిటేషన్ ఇన్స్పెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పరిధిలోని కూరగాయల మార్కెట్ పక్కన పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సానిటేషన్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు
కూరగాయల మార్కెట్ పరిసరాల్లో మురికి కాలువలో చెత్త తొలగించకపోవడం, డ్రెయినేజీల నిర్వహణ లోపించడం వంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సానిటేషన్ ఇన్స్పెక్టర్ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత పరిస్థితి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్, ప్రాంతాల్లో రోజువారీ పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు డంపింగ్, చెత్త సేకరణ మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో సరిగా జరగకపోవడం కారణంగా జనం అసౌకర్యానికి గురవుతున్నారు ప్రజల ఇబ్బందులు సకాలంలో చెత్త సేకరించకపోవడంతో దుర్గంధం వ్యాపించి దుర్వాసన పరిసర ప్రాంతంలో ఏర్పడుతోంది
దోమలు, వృథా నీరు వల్ల అనారోగ్యం సంబంధిత ప్రభావాలు పెరిగే ప్రమాదం ఉంది పరిష్కారానికి శానిటేషన్ ఇన్స్పెక్టర్ పారిశుధ్య సిబ్బంది తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే బాధ్యత మున్సిపల్ అధికారులదే సాంకేతికంగా, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చెత్త సమస్య సుదీర్ఘంగా కొనసాగుతోంది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను తొలగించాలి అంటున్న భూపాలపల్లి మున్సిపల్ పట్టణ ప్రజలు పేర్కొన్నారు
