ఆకలి విలువ అప్పుడే మర్చిపోయావా?
`పేదింటి పిల్లలంటే అంత చులకనైపోయిందా?
`విద్యా హక్కు చట్టం చచ్చు బండలు చేయాలని చూస్తున్నారా?
`కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని మొదలైన డిమాండ్?
`పాండిత్యం తెలిసినంత మాత్రాన పండితుడు కాలేరు.
`పద్యాలు పడినంత మాత్రాన పరమ యోగులు కారు.
`పద్యాలు రాసినంత మాత్రాన పాపపుణ్యాలు ఎరగాలని లేదు.
`ఇవ్వన్నీ నిరూపించుకున్న గరికపాటి ని మించిన అయోగ్యుడు లేదు.
`అహం ఎక్కువ.. ఆలోచన తక్కువ.
`గతంలో అనేక సార్లు నోరు జారి తప్పైందని క్షమాపణ కోరుకున్నాడు.
`చిరంజీవి మీద చిరాకు పడి తన బుద్దిని బైట పెట్టుకున్నాడు.
`ఔసుల కులస్తులపై నోరు జారి క్షమించమని కోరాడు.
`పాండిత్యంలో తనకు తాను కిరిటీ అని గొప్పలు చెప్పుకున్నాడు.
`పేద పిల్లల విషయంలో మరోసారి నోరు జారాడు.
`స్కూల్ పిల్లల మీద మాట్లాడని మాటలు మాట్లాడాడు.
`స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అక్కర్లేదంటాడు?
`తినడానికే బడికి వచ్చే పిల్లలకు చదువబ్బదంటాడు.
`పిల్లలకు గుడ్డు ఎందుకు గాడిద గుడ్డంటావా.
`మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థి శోభనం పెళ్లి కొడుకులా తయారైతాడా?
`బుద్ది జ్ఞానం వున్న వాళ్ళు మాట్లాడే మాటలేనా?
`పిల్లలు తినే అన్నంలో బొద్దింక, బల్లి పడినా అడగొద్దా?
`ఇంత కు సంస్కారికి ప్రభుత్వ పదవా?
`తిండికి తిప్పలై చినిపోదామనుకున్నా అని గతంలో చెప్పుకున్న గరికపాటి?
`పేదింటి పిల్లలంటే అంత చులకనైపోయిందా?
హైదరాబాద్, నేటిధాత్రి:
గరికపాటి అనే పేరును తనను తాను సార్ధకం చేసుకున్నట్లుంది. తాను గరికపాటి కూడా జ్ఞానం లేని అజ్ఞాని అని నిరూపించుకున్నారు. అంతే కాదు గరిక పాటి కనీసం బురద పాటి కూడా కాదు? మురికిపాటితో కూడా సమానం కాదు? అంతకన్నా నీచం..నికష్టం! అశుద్దం అని తనను తాను సమాజం ముందు ఆవిష్కరించుకున్నారు. అవదానం చేసినంత మాత్రాన బుద్ది అబ్బలేదని తేలిపోయింది. పద్యాలు చెప్పినంత మాత్రాన పండితుడు కాలేడని తెలిపినట్లైంది. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ప్రపంచ జ్ఞాని కాదని తెలియజేసుకున్నట్లైంది. అజ్ఞాని, సుసంస్కారినని ఇప్పటికే అనేక సార్లు నిరూపించుకున్నాడు. గరిక పాటికి గోరోజనం కాస్త ఎక్కువే అని తనకు తానుగా ఓ టివి ఛానల్‌లో స్వయంగా ఒప్ప్పుకున్నాడు. కవులకు ఓపిక తక్కువ అని గొప్పగా చెప్ప్పుకున్నాడు. అలాంటి వాడి చేతి నిత్యం ప్రవనాలు చెప్పించుకోవడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం. గతంలో అనేక సార్లు నోరు జారి నాలుక కర్చుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. అయినా బుద్ది రాలేదు. ఇక రాదని కూడా మరోసారి ప్రపంచానికి చాటుకున్నాడు. అయినా వెర్రి జనం గరికపాటితో నీతలు చెప్పించుకోవడం విడ్డూరం. అసలు నీతి, నిజాయితీ, సంస్కార హీనుడుగా తనను పదే పదే నిరూపించుకుంటున్నా అతని వెంబడి పడడం జనం అమాయకత్వం. అలా ప్రజల అమాకత్వాన్ని కూడా సొమ్ము చేసుకుంటూ ప్రవచనాలను కూడా వ్యాపారం చేసుకుంటున్న బుద్ది జీవి గరికపాటి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు ప్రవచనాలు చెప్పడం కూడా దనార్జనగా మార్చుకున్న ఏకైక నికష్టుడు గరికపాటి. గతంలో అనేక సార్లు నోరు జారి అనేక సార్లు తప్పైందని క్షమాపణలు చెప్ప్పుకున్నాడు. అయినా అది అప్పటి మందమే అన్నట్లు పదే పదే నిరూపించుకుంటున్నాడు. గతంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన అలయ్ uలయ్ కార్యక్రమానికి హజరైన చిరంజీవిని చూసి అభిమానులు పోటోలు తీసుకుంటే గరిక పాటి అగ్రీVAదగ్రుడయ్యాడు. తాను సభ నుంచి వెళ్లిపోతానని గాండ్రించాడు. మరోసందర్భంలో ఆడవాళ్ల కట్టూ, బొట్టుమీద రకరకాల వ్యాఖ్యానాలు చేశాడు. ఆడవారి జడను కొత్త మీర కట్టలతో పోల్చాడు. మహిళల వస్త్రదారణల మీద హీనంగా మాట్లాడాడు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపర్చాడు. పొట్టిపొట్టి బట్టలేసుకుంటున్నారని హేళన చేశాడు. అలా మహిళల వస్త్రదారణ మీద చేయకూడని వ్యాఖ్యలు చేసి, తిట్లపాలయ్యాడు. అయినా బుద్ది రాలేదు. ఆ మధ్య కులాల విషయంలో బంగారు నగల తయారీ వత్తి కంసాలీలపై నోరు పారేసుకున్నాడు. వాళ్లంతా తిరగబడేసరికి తప్పైందని క్షమాపణ వేడుకున్నాడు. అహం తలకెక్కి కొట్టుకుంటున్నాడు. ప్రవచనాలుతో నీతులు వల్లించి, వారు వేసే బిక్షంతో బతుకుతున్నానన్న సోయి కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ప్రవచనకర్త అంటే ఆదర్శంగా వుండాలి. ఆత్మీయంగా వుండాలి. సమాజాన్ని చైతన్యం చేయాలి. వారిలో విజ్ఞానాన్ని పెంచాలి. అంతే తప్ప తాను మాత్రమే జ్ఞానిగా వుండాలి. మిగతా వాళ్లంతా అజ్ఞాలుగా వుండాలని కోరుకోడు. ప్రవచనం అంటే నీతిస్వామ్యం. కాని అది తప్పి చెప్పే ప్రవచనం అజ్ఞానికి సంకేతం. ప్రవచనం అంటే పామరులను విజ్ఞాన వంతులను చేయడం. వారిలో విద్యను నింపడం. అంతే కాని పామరులకు విద్య అవసరం లేదని చెప్పిన ఏకైక మూర్ఖుడు గరికపాటి. తనకు తెలిసిన కొన్ని పుక్కిట పురాణాలను కంఠస్తం చేసి, ఆ ముక్కలను పదే పదే చెప్పడం సమాజ చైతన్యం అనిపించుకోదు. చైతన్యం అంటే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది. అంతే కాని చీకటి రోజుల్లోకి తీసుకెళ్లడం కాదు. దేశమంతా విద్యావంతమైన సమాజం కావాలని మేధావులు కోరుకుంటారు. అందుకు ప్రభుత్వమే విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. దానికి పకడ్భందీగా అమలు చేయాలని ఏ గురువైనా కోరుకోవాలి. సమాజమంతా నూరు శాతం అక్షరాస్యత సాదించాలని చెప్పాల్సిన ప్రవచన కర్త, స్ధోమత వున్న వాడు చదువుకుంటాడు. లేకుంటే లేదని చెప్పేంత దుర్మార్గాన్ని ప్రదర్శించిన గరికపాటి వైఖరిని ఉపేక్షించకూడదు. అణగారిన వర్గాలకు విద్య అందాలి. వారు ఉన్నత విద్య చదువుకోవాలి. వారు ఉన్నత స్ధాయికి రావాలని ఎవరైనా కోరుకోవాలి. అందుకు తగిన సహాయ సహాకారాలు ప్రతి వ్యక్తి అందించేందుకు తోడ్పడాలి. అంతే కాని పిల్లలకు మధ్నాహ్న బోజనం ఎందుకు అని ప్రశ్నించే మూర్ఖుడు ఎవరైనా వున్నారంటే అది ఒక్క గరికపాటి మాత్రమే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేసిన వారు లేరు. చదువు రాని వాళ్లు కూడా గరికపాటి చేసిన వ్యాఖ్యలు చేయరు. మన దేశంలో కనీసం ఒక్క పూట భోజనం అందని కుటుంబాలు కోట్లలో వున్నాయి. అలాంటి కుటుంబాలు అలాగే పేదరింలో మగ్గిపోకుండా వారిలో విద్యా కుసుమాలు వికసింపజేయాలనే ప్రభుత్వాలు తపన పడతాయి. అలాంటి ప్రభుత్వాలకే తప్ప్పుడు సలహాలు ఇచ్చిన గరికపాటిని ఈ సమాజం క్షమించకూడదు. కేంద్ర ప్రభుత్వం కూడా అతనికి ఇచ్చిన పద్మశ్రీ కూడా రద్దు చేయాలి. చదివించే స్ధోమత లేని వారు పిల్లలకు బడికి పంపాల్సిన అవసరం లేదా? గరికపాటి. వారిని అలాగే వదిలేయాలా? 14 ఏళ్ల వయసు వచ్చే వరకు నిర్భంద విద్యను ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలన్న చట్టం గురించి మర్చిపోయినట్లున్నారు. ప్రవచనాలలో నీతిబాహ్యమైన మాటలు చెప్పడం మొదలు పెట్టి చట్టాలను మర్చిపోయినట్లున్నాడు. పిల్లలకు గుడ్డు పెట్టడం ఎందుకా? పోషకాహా లోపంతో ఎంతో మంది పిల్లలు అనారోగ్యాల పాలౌతున్నారు. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనేది ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ సంగతైనా గరికపాటికి తెలియకుండాపోయింది. మధ్నాహ్న భోజనం చేసిన విద్యార్ధి శోభనం పెళ్లికొడులా మంచమెక్కుతాడా? అనడానికైనా కొంచెం సిగ్గనిపంచలేదా గరికపాటి. గతంలో తిండి లేని రోజులు మర్చిపోయావా? గరికపాటి. వరంగల్‌లో గరికపాటి కళాశాల పెట్టి దివాలా తీసిన సంగతి మర్చిపోయావా? గరికపాటి. తిండికి కూడా దిక్కులేక చనిపోదామనుకున్నా? అని నువ్వే స్వయంగా చెప్పిన మాటలు అప్ప్పుడే మర్చిపోయావా? గరికపాటి. గరికపాటి ఆకలి కేకలు పెట్టిన రోజులు తను మర్చిపోయినా వరంగల్ మర్చిపోలేదు. చదువు చెప్పితే వచ్చే పైసలకన్నా, నాలుగు ప్రవచణాలు చెబితే సొమ్ములెక్కువొస్తున్నాయని కొత్త వేషం కట్టిన రోజులు గుర్తున్నాయా? గరికపాటి. ప్రజలను అమాయకులను చేసి, పండగ సమయాల్లో నాలుగు పద్యాలు, నీతుల రూపంలో చెప్పి పొట్టపోసుకున్న రోజులు మర్చిపోతే ఇలాంటి రోత మాటలే వస్తాయి. విద్యార్ధికి పాఠాలు చెబితే వచ్చే సొమ్ముకన్నా, పామరులకు పురాణాలు చెప్పి సొమ్ము చేసుచేసుకోవడం పుణ్యకార్యమేమీ కాదు గరికపాటి. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నావు. గొప్ప జ్ఞానినని మురిసిపోతున్నావు. అంతే కాదు ప్రవచనాలకు పిలిపి పీట వేసిన వాళ్లను కూడా చులకన చేసే వ్యాఖ్యలు చేయడం నీచత్వాన్ని ఏనాడో బైట పెట్టింది. నాకు గుమ్మడి కాయ ఒడియాలు, వంకాయ ఇగురు, అరటి కాయ బజ్జీలు అంటే ఇష్టమని చెబితే, అందరూ అదే పెడగారా? అంటూ కూడా వ్యంగ్యంగా హేళన చేసిన సందర్భాలు జనం మర్చిపోరు. ఒకనాడు తిండికి లేక ఆకలితో నకనకలాడిన రోజులు మర్చిపోతే ఇలాగే వుంటుంది. గరిక పాటి మురికి నోరును ఇప్పటికైనా ఏ ఆసిడ్‌తోనైనా కడుక్కో..ఇక ఎలాంటి నీతి భాహ్యమైన మాటలు మాట్లాడడని చెప్పి మళ్లీ ప్రవచనాల జోలికి వెళ్లకు. నీతి లేని నీతి నిజాయితీల గురించి చెబితే ఎంత అసహ్యంగా వుంటుందో నివ్వే పదే పదే నిరూపించుకంటున్నావు. బురదలో పందిని నాకు తేడా లేదని నువ్వే పదే పదే చెప్ప్పుకునేలా చేసుకుంటున్నావు. పనికి రాని పాండిత్యం ఎంత వుంటే ఏమి లాభం..నోటి నుంచి మూసి కన్నా మురికి మాటలోస్తే ఎవరికి ఉపయోగం. ఏ మాత్రం మానవత్వం వున్నా, లేకుంటే పేద పిల్లలకు విద్య అందాలన్న సోయి వుంటే స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎందుకు అని గరికపాటి అనేవారు కాదు. ఆ భోజనంలో గుడ్డెందుకు, గాడిద గుడ్డు అనడం అహం తలెక్కి మాట్లాడడమే అవుతుంది. మద్నాహ్న భోజనం మిద్యాహ్న భోజనమా? ఆ మధ్నాహ్న భోజనంలో బల్లిపడినా, పిల్లి పడినా తినాలా? ఇంత వికతమైన మాటలా? కడుపు నిండా తింటే శోభనపు పెళ్లికొడుకులా మంచమెక్కుతారా? వారికి స్కూలు యూనిఫామ్స్, పుస్తకాలు ఇవ్వడం వదానా? పైగా వచ్చే వాడు వస్తాడు..చదువుకునే వాడు చదువుకుంటాడా? ఇదేనా ఇంత కాలం గరికపాటి సంపాదించిన పాండిత్యం. ఇంకా అతన్ని కులగౌరవంతో గొప్పవారుగా కీర్తించేవారు మీ ఖర్మ!!
