వైద్యుల కొరతతో రోగుల ఇబ్బందులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ లోని ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకే విధులను ముగించుకుని వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా శిశువైద్యులు తమ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను చూసి ఆలస్యంగా వస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.