డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనండి
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
డిజిటల్ లైవ్ సర్టిఫికెట్ స్పెషల్ డ్రైవ్ లో పెన్షన్ దారులందరూ పాల్గొనాలని సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.రమాకాంత్ సోమవారం ప్రకటనలు పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెన్షన్ పొందుతున్న కార్మికులు లైవ్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే పెన్షన్ పొందుతారని,సుమారు నాలుగు కోట్ల 50 లక్షల కార్మికులు ఈ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుందని అన్నారు.సరైన పద్ధతిలో ఈ సర్టిఫికెట్ సమర్పించని కారణంగా ఎంతో మంది పెన్షన్ పొందలేకుండా లేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తేలిందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 2000 కేంద్రాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ తీసుకుంటుందని,సింగరేణిలో నవంబర్ 3 నుంచి 28 వరకు ఏరియాల వారీగా కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.ఈ స్పెషల్ డ్రైవ్ సీఎమ్పిఎఫ్ రీజినల్ కమిషనర్ శ్రీహరి పచారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.రామగుండం 1 డివిజన్ నవంబర్ 3,4 రామగుండం 3డివిజన్ నవంబర్ 6,7 రామగుండం 4 డివిజన్లలో నవంబర్ 10,11 అలాగే హైదరాబాద్, శ్రీరాంపూర్ లో నవంబర్ 12, 13 మందమర్రి లో నవంబర్ 17,18 బెల్లంపల్లి లో నవంబర్ 19,20 భూపాలపల్లి లో నవంబర్ 24,25 వకీల్ పల్లిలో నవంబర్ 26 గోదావరిఖని కార్యాలయంలో నవంబర్ 3 నుంచి 28 నవంబర్ వరకు నిర్వహిస్తారని తెలిపారు.పెన్షన్ పొందిన కార్మికులు పైన తెలుపబడిన ప్రాంతాలలో ఎక్కడైనా ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెన్షనర్ ఎవరి సహాయం లేకుండా తనంతట తానే తీసుకునే వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
