భారత్–పాకిస్తాన్ మధ్య ఉన్న ఇండస్ వాటర్స్ ఒప్పందం నిలిపివేతపై ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.
ఏప్రిల్ 22న పహల్గాం దాడి అనంతరం, భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, “ఇప్పటి నుంచి భారత జలాలు భారత ప్రయోజనాలకే వినియోగిస్తాం, అభివృద్ధికి మళ్లిస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ న్యూఢిల్లీపై హెచ్చరికలు జారీ చేస్తూ, “మా దేశానికి చెందిన ఒక్క చుక్క నీరైనా దోచుకోనివ్వం” అని అన్నారు. ఆయనకన్నా ముందు పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఈ హెచ్చరికలు వాస్తవ యుద్ధానికి దారితీసే అవకాశముందా? లేక ఇవి కేవలం రాజకీయ బెదిరింపులా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.