మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం కు ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి
ఎమ్మెల్యే కాలనీ శాఖ 8వ మహాసభలో తీర్మాణo
స్థానికంగా ప్రజా సమస్యలు గుర్తించి ప్రజా పోరాటాలు నిర్మించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు అన్నారు. ఎమ్మెల్యే కాలనీ సిపిఎం శాఖ 8వ మహాసభ కుంజ మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానాలు ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, రోజురోజుకీ పేదరికంలోకి నెట్టబడుతున్నారని అన్నారు. పేద ప్రజలకు కనీసం కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో భద్రాచలం కు అనుకుని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని, ఎమ్మెల్యే కాలనీలో అంగనవాడి సెంటర్ కు పక్కాభవనం మంజూరు చేసి నిర్మించాలని, ట్రైన్లు సిసి రోడ్లు వేయాలని, కరెంటు పోసి కొత్తవి ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. మహాసభకు ముందు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకట రామారావు, నాదెళ్ల లీలావతి, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు ఎం వి ప్రసాద్ రావు, డి సీతాలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు ఎంవిఎస్ నారాయణ, ముండ్రు ఝాన్సీ, కనక శ్రీ, హైమావతి, సత్యవతి, రుక్మిణి, దేవి, మంగమ్మ, రామిరెడ్డి, గొడ్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.