విలీన గ్రామాల అభ్యర్థులకు న్యాయం చేయండి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల పరిధిలో రేషన్ షాపు ల నిర్వాహకుల నియామకానికి గత నెల 29 తేది నాడు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో సిరిసిల్ల విలీన గ్రామాలైన రగుడు,చంద్రంపేట, చిన్నబోనాల, ముష్టిపల్లి, పెద్దుర్, సర్ధపూర్ గ్రామాలు కూడా కలవు. కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అర్హులు అందరు అప్లై చేసుకోవాలని తెలిపారు. వ్రాత పరీక్ష తదుపరి ఇంటర్వ్యూ పద్ధతుల ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది. అయితే విలీన గ్రామాల అర్హత కలిగిన అభ్యర్థులు అందరు అప్లై చేసుకున్నారు. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ లకు హాజరైనారు, తీరా చూస్తే గ్రామంలోని స్థానిక అభ్యర్థులకు కాకుండా సిరిసిల్ల పట్టణంలోని గ్రామ స్థానికతలేని వ్యక్తులకు షాప్ లు కేటాయిస్తున్నట్లు ప్రకటన వెలువరించడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిరిసిల్ల విలీన గ్రామాల కౌన్సిలర్ లు అందరు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లో అభ్యర్థి చౌకధరల దుకాణం యొక్క గ్రామ నివాసి అయి ఉండవలెను అని పేర్కొన్నారు. కానీ గ్రామ నివాసి కానటువంటి వారిని ఎంపిక చేశారు. మా గ్రామంలో అర్హులైన అభ్యర్థులు ఉండగా ఇతరులకి కేటాయించడాన్ని విలీన గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా మా గ్రామాలలోని నిరుద్యోగులైన అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కనుక విలీన గ్రామాల రేషన్ షాపులను గ్రామాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు కేటాయించాల్సిందిగా కలెక్టర్ ని కోరగా పరిశీలిస్తామని చెప్పారనీ అన్నారు.ఈ కార్యక్రమంలో విలీన గ్రామాల నాయకులు పోచవేని ఎల్లయ్య, పాతూరి రాజిరెడ్డి, బుర్ర మల్లికార్జున్ గౌడ్, ఒగ్గు రాజేశం, ఎరవెల్లి రమణారావు, నర్మేట ప్రభుదాస్, ఎల్లం లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!