ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణా కార్యక్ర మాలు

స్టెప్ సమన్వయకర్త కందగట్ల గోపాల్

శాయంపేట నేటిధాత్రి:

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎడ్యుకేటర్స్ పేరెంట్స్ (స్టెప్) ఆద్వర్యంలో అక్టోబర్ 4,5,6 మూడు రోజులపాటు ఉపాధ్యాయు లకు, విద్యార్థులకు ఉచిత వ్యక్తిత్వశిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని వరంగల్ విభాగం స్టెప్ సమన్వయకర్త కందకట్లగోపాల్ తెలిపారు. విద్యార్థులలో ఉన్న మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, వారిలో ఆత్మ విశ్వాసం నింపి తద్వారా వారిని మంచి పౌరులుగాతీర్చి దిద్దడానికి ప్రతీ ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా మని వీటిని గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం లో గల నెక్కళ్లు గ్రామం లో ఉన్న ధ్యాన మందిరంలో 3రోజుల పాటు నిర్వహిస్తు న్నామని తెలిపారు .ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో పాటు మెటీరియల్ మరియు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. 3 రోజులకు సరిపడే దుస్తులు, బెడ్ షీట్స్ తీసుకొని రావాలి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావచ్చని కోరుతున్నారు .ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు కందకట్ల గోపాల్ ఫొన్ నంబర్ 9392213311 ఫొన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోగలరని కోరడం జరిగింది.

రాజ్యాంగ నిర్మాతను అవమానపరచడం సరికాదు

గంగాధర నేటిధాత్రి :

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వాట్సప్ గ్రూపుల్లో అవమానపరుస్తూ సంక్షిప్త వార్తలను ప్రచారం చేయడం సరికాదని అంబేద్కర్ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగాధర మండలంలోని గంగాధర సైనికులు అనే వాట్సాప్ గ్రూపులో అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా సంక్షిప్త సమాచారం పంపించడం పై ఆ గ్రూపుకు చెందిన అడ్మిన్ దేశెట్టి శ్రీనివాస్ పై అంబేద్కర్ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యుడైన దేశెట్టి శ్రీనివాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

మంత్రిని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన వేముల స్వరూప తిరుపతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నామని వాటినీ గుర్తించిన కాంగ్రెస్.పార్టీ మాకు సరైన గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి మార్కెట్ కమిటీ చైర్మన్గా డైరెక్టర్ గా మమ్మల్ని నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వీరి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్ డైరెక్టర్లు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాముని వనిత నలిని కాంత్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు ఉన్నారు

“ఎంఈఓ” లకు వడుప్సా నేతల సన్మానం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్, ఖిలా వరంగల్ మండలంల ఎంఈఓ లు గంప అశోక్ కుమార్, వి. ప్రసాద్ లను వడుప్సా వరంగల్ డివిజన్ కమిటీ నేతలు వరంగల్ ఎంఈఓ కార్యాలయంలో సోమవారం పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సలహాదారు కె భూపాల్ రావు, వరంగల్ డివిజన్ అధ్యక్షులు బొల్లo కనకయ్య, సెక్రటరీ విలియమ్స్, కోశాధికారి సుధీర్, డివిజన్ సలహాదారు విద్యాసాగర్, ఉపాధ్యక్షులు రాజు, జి సురేష్ , జాయింట్ సెక్రటరీ నసీర్, కన్వీనర్ ఖలీల్, లీగల్ కన్వీనర్ ఉస్మాన్, అకాడమిక్ కన్వీనర్ అశోక్, కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, టి.వెంకటేశ్వర్లు, సమీర్, లియాకత్ అలీ, మురళి, గౌస్ తదితరులు పాల్గొన్నారు,

టిపిసిసి అధ్యక్షుడుని కలిసిన ఆరెల్లి రవి గౌడ్.

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ ని ఆదివారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వాటర్స్ లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉర్సు కరీమబాద్ కు చెందిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అరెల్లి రవి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలంగా ఉండడానికి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో తనకు సముచిత స్థానం కల్పిస్తానని టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట ఇవ్వడం జరిగిందని ఆరేల్లి రవి తెలిపారు.

మహనీయుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాలి

బీజేపీ మండల అధ్యక్షులు రాకేష్
చందుర్తి, నేటిధాత్రి:

భారత దేశ స్వాతంత్ర్యం కొరకు మరియు దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన భారతదేశ వీరుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బిజెపి మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ అన్నారు.మంగళవారం రోజున మండల కేంద్రానికి చెందిన బత్తుల ఉదయ్ మరియు ముడపల్లి గ్రామానికి చెందిన పుల్కాం మనోజ్ కు భగత్ సింగ్ జీవిత చరిత్ర అందజేశారు.చందుర్తి మండలంలో స్వాతంత్ర సమరయోధుల జీవితచరిత్ర లు సుమారు 300 పుస్తకాలు పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ,మహారానా ప్రతాప్, సుభాష్ చంద్రబోస్, అంబేత్కర్, అల్లూరి సీతారామరాజు, జాన్సీ లక్ష్మి భాయ్ తదితరులు చరిత్రలు నేటి తరానికి తెలియజేప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

శ్రీ వేద స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు

శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామంలోని శ్రీవేద పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యా యుల ఆధ్వర్యంలో విద్యా ర్థులు పాఠశాలలోని బతు కమ్మలను తయారుచేసి బతుకమ్మ ఆటపాటలతో కోలాటాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవ పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రియాంక, వేద, కీర్తి రెడ్డి, సల్మా తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతమైన వాతావరణంలో దేవి నవరాత్రులు నిర్వహించాలి

జమ్మికుంట: నేటిధాత్రి
ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని పట్టణ సీఐ రవి ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే ఉత్సవ కమిటీ సభ్యుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలకు మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారు కాబట్టి అన్ని రకాలైన ఏర్పాట్లను చేయాలని, దీనికి తోడు ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్లు కాకుండా ముందస్తుగానే మంటపం ప్రాంతంలో అవసరమైన నీటిని, ఇసుకను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉత్సవాల ఊరేగింపు సమయంలో డిజె సౌండ్ లు వాడకుండా భక్తిపరమైన పాటలతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహకరించాలని సిఐ కోరారు. మంటపాల వద్ద రాత్రి వేళలో ఒకరు ఇద్దరు ఉండడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తొమ్మిది రోజులపాటు నిర్వహించే దేవీ నవరాత్రులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన వెలిచాల రాజేందర్ రావు

సిరిసిల్ల /కరీంనగర్(నేటి ధాత్రి):

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులతో రాజేందర్ రావు మాట్లాడారు. పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

గోవిందా పూర్ లో స్వచ్ఛతాహి సేవ

జమ్మికుంట: నేటి ధాత్రి
పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలను అరికట్టవచ్చని కోరపల్లి గ్రామ కార్యదర్శి తారక రామారావు తెలిపారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోవిందపురం గ్రామంలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని గ్రామంలోని పురవీధుల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోండు బిక్షపతి, గైకోడి నాగరాజు, దొగ్గల భాస్కర్ ,కారోబార్ సారయ్య, కొండు తిరుపతి ,లక్ష్మయ్య, సారథి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సీపిఎం నాయకులు

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ కి సిపిఎం పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.పరకాల పట్టణంలో ఉన్న సెంట్రల్ లైటింగ్స్ అంబేద్కర్ సెంటర్ నుండి వ్యవసాయ మార్కెట్ వరకు అలాగే పరకాల మొత్తంలోని మెయిన్ రోడ్ అలాగే వాడలల్లో ఇంటి సమీపాల్లో వీధి దీపాలు వెలుగుగాక ప్రజలు,వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీధి దీపాలు మరమ్మత్తు పనులు చేపించి వెలుగు ఇచ్చేలా చూడాలని పట్టణంలో ఉన్న 22 వార్డుల సమస్యలు పరిష్కరించాలి రోడ్లు మరియు డ్రైనేజీలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ పర్యటించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్,హేమంత్,ఈశ్వర్,సాయి తేజ,శివ,అరవింద్ పాల్గొన్నారు.

“ఎంఈఓ” లకు వడుప్సా నేతల సన్మానం

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్, ఖిలా వరంగల్ మండలంల ఎంఈఓ లు గంప అశోక్ కుమార్, వి. ప్రసాద్ లను వడుప్సా వరంగల్ డివిజన్ కమిటీ నేతలు వరంగల్ ఎంఈఓ కార్యాలయంలో సోమవారం పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సలహాదారు కె భూపాల్ రావు, వరంగల్ డివిజన్ అధ్యక్షులు బొల్లo కనకయ్య, సెక్రటరీ విలియమ్స్, కోశాధికారి సుధీర్, డివిజన్ సలహాదారు విద్యాసాగర్, ఉపాధ్యక్షులు రాజు, జి సురేష్ , జాయింట్ సెక్రటరీ నసీర్, కన్వీనర్ ఖలీల్, లీగల్ కన్వీనర్ ఉస్మాన్, అకాడమిక్ కన్వీనర్ అశోక్, కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, టి.వెంకటేశ్వర్లు, సమీర్, లియాకత్ అలీ, మురళి, గౌస్ తదితరులు పాల్గొన్నారు,

అక్టోబర్ 17 న హైద్రాబాద్ ఉప్పల్ లో నిర్వహించే భారీ బహిరంగ”యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన”సభను విజయవంతం చేద్దాం

టైగర్ ఆలీ నవాబ్…………………………………….హైద్రాబాద్,సెప్టెంబర్30:తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి అక్టోబర్ 17 న నిర్వహించే భారీ బహిరంగ “యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన”సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,TWJA రాష్ట్ర అధ్యక్షులు టైగర్ ఆలీ నవాబ్ సోమవారం రోజున విలేకరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో నీ 1000 మంది యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల పాల్గొంటున్నారని,ఈ యొక్క కార్యక్రమం మా రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నామని,ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అదే విధంగా నూతనంగా ఎన్నిక కబడిన మా యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ గారికి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి సమ్మయ్య గౌడ్,ప్రచార కార్యదర్శి రాధ గోవింద్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజిత్,రాము,రాష్ట్ర కార్యదర్శి ధోటి సైదులు యాదవ్ గార్లకు టైగర్ అలీ నవాబ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నాకొక తిక్కుంది?

https://epaper.netidhatri.com/view/393/netidhathri-e-paper-1st-october-2024%09

దానికి లెక్కలేకనే దారి తప్పింది!!

పవన్‌ రాజకీయం సుడిగుండమైంది!

రాజకీయం లోతు తెలియక ముందే ఆట ఆగిపోనుంది.

ఒకసారి నాకు కులం లేదంటాడు.మరోసారి

కుల రాజకీయం చేయడం తప్పదంటాడు.

తాను బాప్టిజం స్వీకరించానంటాడు?

చెగువేరా లాంటి తిరుగుబాటు నాయకుడు ఆదర్శమంటాడు.

తన తండ్రి మంగళహరతితో సిగరెట్‌ వెలిగించుకునే వారంటాడు.

మా ఇంట్లో నిత్యం రామనామ జపం ఉంటుందంటాడు.

అందరి ఆహారపు అలవాట్లను గౌరవిస్తా అంటాడు.

బీఫ్‌ తినాల్సివస్తే తింటానంటాడు.

ముస్లింల సంప్రదాయం గౌరవిస్తానంటాడు.

ఇప్పుడు హిందువుల జోలికొస్తే తాట తీస్తానంటాడు.

తిరుమలలో అపచారం జరిగిందని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగాడు.

తప్పు చేసిన వాళ్లు ప్రాయశ్చిత్తం గురించి చెప్పాలి.

-తాను పసుపు దుస్తులు, పాదరక్షలు వేసుకొన ప్రాయశ్చిత్త దిక్ష కు కొత్త అర్థం చెప్పాడు.

-ప్రతిసారి పలుచన కావడం తప్ప చేసిందేముంది?

-పూటకో మాట…నోటి నిండా తీట!

-చెగువేరాను ఎటు పంపించారు?

-మహాత్మా బాపులే ఆశయాలు ఏమయ్యాయి!

-భగత్‌ సింగ్‌ త్యాగం ఏమైంది?

-సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా?

-దాసరి గారు అందుకే అన్నారు..పిచ్చోడి చేతిలో రాయి సినిమా తీశారు.

-హిందువుల మనోభావాలా…దానికి అర్థం తెలుసా?

-రాజ్యాంగ బద్ద పదవిలో వుంటూ తిక్క మాటలా!

-వరద బాధితుల సహాయమప్పుడు ఇబ్బంది కలిగిందా?..ఇప్పుడు జనాలను రెచ్చగొట్టడం సరైందా?

-అధికారంలో వున్నవారు ఆరోపణలా చేసేది!

-నిజాలు నిగ్గు తేల్చక ఏం చేస్తున్నారు?

-పవన్‌ హడావుడి పాత చింతకాయ తొక్కు!

ఒక అబద్దం వెయ్యి అబద్దాలును మోసుకొస్తుంది. సినిమా నటులు సినిమాలు చేసినప్పుడు ఎన్ని మాట్లాడినా చెల్లుతుంది. కాని ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. ప్రతి మాటకు ఒక అర్దం వుండేలా చూసుకోవాలి. అర్ధం పర్ధం లేని మాటలు ఎల్ల కాలం చెల్లవని తెలుసుకోవాలి. కాని తనపై ప్రజలకు పెరిగిన నమ్మకమో, అదృష్టమో కాని ఒక్కసారి నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఒక దశలో పవన్‌ సినిమాలకు కూడా పనికి రారు అనుకున్నారు. వరసగా పది సినిమాలు నడవకపోయినా, స్టార్‌ డమ్‌ నిలుపుకున్నారు. అలాగని ఆయన చేసిన పాతిక సినిమాలలో వండర్‌ క్రియేట్‌ చేసినవి ఏమీ లేదు. రికార్డులు బద్దలు కొట్టినవి లేవు. కాని యువతలో పెద్ద ఫాలోయింగ్‌ ఏర్పండి. అది ప్రజా రాజ్యం పార్టీ తర్వాత మరింత పెరిగింది. ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి రాజకీయ గ్రాఫ్‌ పడిపోయింది. కాని జనసేన ఏర్పాటు తర్వాత మెల్లిమెల్లిగా అటు సినిమాల్లోనైనా, ఇటు రాజకీయాల్లోనైనా ఆయనపై కొంత నమ్మకాలు పెరిగాయి. దాదాపు పదిహేను సంవత్సరాల పాటు పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా కోల్పోయాడు. అడపా దడపా తన నిర్ణయాలు ఎలా వున్నా, ప్రజలు ఎన్నికల సమయాల్లో ఆదరించకపోయినా సినీ నటుడు కావడం వల్ల క్రేజ్‌ అలాగే వుండిపోయింది. కాకపోతే పవన్‌ను రాజకీయ పార్టీలు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. 2014 ఎన్నికల్లో పవన్‌ పోటీ చేయలేదు. ఆయన పార్టీ పేరు మీద ఎవరినీ పోటీకి నిలపలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా బోల్తాపడ్డారు. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారు. అన్న చిరంజీవి రెండు చోట్ల పోటి చేసి ఒక్క చోట తిరుపతిలో గెలిచారు. కాని పవన్‌ ఒక్క చోట కూడా గెలవలేదు. కాని ఆయన రాజకీయం అప్పటినుంచి మొదలైందని అన్నట్లుగానే వున్నారు. రాజకీయాల నుంచి పారిపోతారనుకుంటే నిలబడ్డారన్న నమ్మకంతో ప్రజలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్ధానాల్లో గెలిపించారు. దాంతో పవన్‌ తనమీద తనకు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఆ నమ్మకం అతి విశ్వాసమైపోయింది. అతిని మరింత పెంచుకున్నట్లైంది. సినిమా నటుడుగా వున్నా, రాజకీయాల్లో పెద్దగా ప్రాధన్యత లేనప్పుడు పవన్‌ రకరకాల మాటలు మాట్లాడారు. అది ఇప్పుడు పెద్ద కుంపటైపోయింది. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్‌ చేసిన హంగామాతో ఆయనపై పెద్దఎత్తున ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మేధావులు కూడా ఆయనను ఎవరూ సమర్ధించలేకపోయారు. ఒకప్పుడు పవన్‌ను గమనించిన వారికి, ఇప్పుడు అదే పవన్‌ను గమనిస్తున్న వారికి ఆశ్చర్యవేస్తోంది. ఆయన ఆనాడు ఎన్ని మాట్లాడినా మతం రంగు పులుముకోకపోవడం వల్ల అవి పెద్దగా బైటకు రాలేదు. కాని ఇప్పుడు ఆయన తన అసలు స్వరూపం ఇదే అని చూపించారు. ముందు విద్యార్ధి దశ గురించి మాట్లాడుకుంటే తనకు చిన్ననాటి నుంచి చదువు మీద సరైన శ్రద్ద లేదని చెప్పాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని తనకు కావాల్సిన ఇంగ్లీష్‌ను గురువులు బోధించలేకపోయారన్నారు. అందరూ ఉలిక్కిపడ్డారు. తనకు కావాల్సిన ఇంగ్లీష్‌ను గురువులు నేర్పించలేకపోవడం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇక తర్వాత ఒక సారి తాను ఎంబిబిఎస్‌ చేయాలనుకున్నానని అని చెప్పాడు. బైపిసి తీసుకోవాలనుకున్నా అన్నాడు. మరో దగ్గర తాను ఎంపిసి తీసుకున్నానని చెప్పాడు. ఇలా ఎక్కడికెళ్తే అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. కాని పెద్దగా పవన్‌ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోలేదు. కాని ఎప్పుడైతే జనసేన స్ధాపన చేశారో అప్పటి ఆయన మాటలు మార్చుతున్న విధానం వల్ల క్రెడిబిలిటీ దెబ్బతిన్నదని చెప్పడంలో సందేహం లేదు. తొలుత చెగువేరా వంటి పోరాట యోధుడు లేడంటూ కీర్తించడం మొదలు పెట్టారు. దాంతో ఆయన అభిమానులంతా చెగువేరా బనియన్లు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. టూవీలర్‌ వెయికిల్స్‌ మీద చెరువేరా బొమ్మలు వేసుకున్నారు. కొన్ని సినిమాల్లో చెగువేరా ధరించే దస్తులను వేసుకున్నారు. ఇలా పెద్దఎత్తున ప్రచారం చేశారు. కాని అసలు చెగువేరా అనే వ్యక్తి క్యూబాలో ఏం చేశాడన్నది ఎవరికీ తెలియదు. నోట్లో చుట్ట ముక్క పెట్టుకొని ఫోజులిచ్చిన చెగువేరా వల్ల క్యూబాలో వచ్చిన మార్పు ఏమిటో తెలియదు. అయినా ఆయన చెగువేరా జీవితంతో నేర్చుకున్నదేమిటో కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. తాను చెగువేరాలాగా పోరాటం చేసిందేమీ లేదు. తర్వాత కొంత కాలానికి తాను కమ్యూనిజమ్‌ బావాలు వున్న కుటుంబంలో పుట్టానన్నారు. తన తండ్రికి దైవారాధన అంటే అసలే ఇష్టం వుండేది కాదన్నారు. ఇవన్నీ ఆయన స్వయంగా చెప్పిన మాటలే. ఇంట్లో పూజ చేసిన తర్వాత మంగళహారతిలో వుండే దీపానికి తన తండ్రి సిగరెట్‌ అంటించుకునేవారంటూ చెప్పారు. అంటే తనుకు సనాతన ధర్మాల మీద నమ్మకాలు లేవంటూ చెప్పారు. తన కుటుంబం క్రిస్టియానిటీతో ముడిపడి వుందన్నారు. తన కొడుక్కు ఏదో చిన్న గాయమైన సందర్భంలో మేరీ మాతను తలుచుకుంటే ఆ నొప్పి తగ్గిపోయిందని చెప్పాడు. అసలు క్రైస్తవులలో మేరీ మాతను పూజించే వర్గం చాలా తక్కువ. కాని ఆయన మేరీ మాతను పూజించానని చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లపై ఆ మధ్య పెద్దఎత్తున వివాదం చెలరేగింది. ఆ సమయంలో తాను భీఫ్‌ను వ్యతిరేకించాలన్న ఒత్తిడేదైనా వస్తే ముందు దానిని తింటానంటూ చెప్పారు. తర్వాత సినీ నటుడు ఆలీ కూతురు వివాహ సమయంలో ఆలీ ఇంట్లో విందుకు హజరైన పవన్‌ కింద కూర్చొని ముస్లిం సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. ఇంత వరకు బాగానే వుంది. తాను అన్ని మతాలకు అతీతడనంటూ ప్రజల్లోకి వెళ్లిన పవన్‌ కాళ్యాన్‌ గెలిచిన తర్వాత ఇటీవల తిరుమల లడ్డూ వివదంలో సనాతన ధర్మ రక్ష పరిరక్షకుడి అవతారం ఎత్తారు. దాన్ని కూడా ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. కాని ఆయన అడుగుడుగునా చెప్పిన మాటలకు, ఆచరిస్తున్న విధాలకు పొంతన లేకుండాపోయింది. ఆయన అసలు నిజస్వరూపం బైట పడిపోయింది. కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిచ్చెనైనా వాడుకుంటాడని అర్ధమైపోయింది. ఒకప్పుడు సమాజంలో ఏవైనా వివాదాలు జరుతున్నాయంటే అవి హిందు మత వాదుల వల్లనే అంటూ కూడా మాట్లాడిన సందర్భం వుంది. కాని ఇప్పుడు హిందూ మతం జోలికి వస్తే ఒక్కొక్కడి తాట తీస్తానంటూ చెప్పడం మొదలు పెట్టారు. అసలు పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ మొదలు పెట్టారు. ఎక్కడకు వచ్చారు. అసలు బొంత పురుగు సీతా కోక చిలుకగా మారినట్లు తాను ఏదిచెప్పినా అందంగా వుంటుందనుకుంటున్నాడో ఏమో? అన్న సందేహం కలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల లడ్దూ విషయంలో పవన్‌ చేసిన అతి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందనేచెప్పాలి. ఇక కులం విషయానికి వస్తే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా మన దేశ సమాజిక వ్యవస్ధ కులాల పునాదుల మీదే ఆధారపడి వుంది. చివరకు ముస్లింలలో కూడా హెచ్చు తగ్గులున్నాయి. అందులో కూడా కులాలు గూడు కట్టుకొని వున్నాయి. కాని తాను అందరివాడినంటూ రాజకీయం మొదలు పెట్టాడు. తనకు ఏ కులం లేదన్నాడు. అందరి వాడిని అని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఏ కులం పవన్‌ను నమ్మి ఓట్లు వేయలేదు. వెంటే తన రూటు మార్చుకున్నాడు. కుల రాజకీయం చేస్తే తప్ప రాజకీయ మనుగడ లేదనుకున్నాడు. కులాన్ని ఏకంచేసే పని పెట్టుకున్నారు. ఇక్కడ సక్సెస్‌ సాధించాడు. కులం లేని రాజకీయం లేదని జ్ఞానోదయం పొందాడు. ఆ కులం పునాదుల మీద మత రాజకీయాన్ని నిలిపి ఇక తనకు తిరుగుండదన్న ఆలోచన చేశాడు. ఇదే సమయంలో తిరుమల లడ్డూ వివాదం తనకు కలిసొస్తుందని భావించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మించి స్పందించడం మొదలు పెట్టారు. విజయవాడుకు వరదలు వచ్చిన సమయంలో ఆయన ప్రజలకు దూరంగా వున్నారు. ఏదో సాకుచెప్పి తప్పించుకున్నాడు. కాని మత రాజకీయం అవసరం వచ్చేసరికి ఈ వారంలో రోజుల్లోనే రకరకాల విన్యాసాలు వేశాడు. తిరుమలలో అపచారం జరిగితే అక్కడ ప్రాయశ్చితం చేసుకోవాలి. కాని విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లు కడిగి పాపపరిహారం చేసినట్లు చెప్పుకున్నాడు. విచిత్రమైన రాజకీయం నెరిపాడు. ఇక ప్రాయశ్చిత్త దీక్ష పేరును మొదలు పెట్టి తనకన్నా హిందూ పరిరక్షకుడు లేడన్నట్లు విపరీత ప్రచారం మొదలు పెట్టారు. అది మొదటికే మోసం తెచ్చిపెట్టింది. మొదటి నుంచి పవన్‌ చెప్పుకునే సినీ డైలాగ్‌ ఇప్పుడు మళ్లీ ఆయనకే విచిత్రంగా వినిపిస్తోంది. నాకొక తిక్కుంది..అదిసినిమాల వరకే లెక్క పనిచేసింది..కాని ఇప్పుడు ఆ తిక్కకు రాజకీయల్లో దారి మూసుకుపోయే పరిస్ధితి ఎదురౌతోంది. ఇక ఆ తిక్కేమిటో ఆ లెక్కేమిటో ప్రజలు కూడ తేల్చే సమయం భవిష్యత్తులో ఎలా వుంటుందో చూడాలి. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రింకోర్టు వ్యాఖ్యలతో పవన్‌ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో కూడా చూడాలి.

అమ్మవారి సేవలో పాత్రులమౌవుతాం: ఎంపీ రవిచంద్ర

అక్టోబర్ 3తేదీ నుండి 12వ తేది వరకు జరిగే శ్రీ ఓరుగల్లు భద్రకాళీ మాత శరన్నవరాత్రి మహోత్సవముల సందర్బంగా వేలాదిమంది భక్తులు వీక్షించే అమ్మవారి హంసవాహన సేవ తెప్పోత్సవ కార్యక్రమ శాశ్వత దాత అయినా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించి అమ్మవారి సేవలో పాల్గొనాలని కోరిన శ్రీ భద్రకాళి దేవస్థానం వేద పండితులు అరవింద్ శర్మ. దత్తు శర్మ.అనంతరం అమ్మవారి వేద ఆశీర్వచనంతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అమ్మవారి హంస వాహనాన్ని రకరకాల విద్యుత్ కాంతులతో వివిధ రకాల పుష్పములచే సర్వాంగ సుందరంగా అలంకరించి తెప్పోత్సవ సేవా కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులమందరం పాల్గొని అమ్మవారి సేవలో పాత్రులమౌవుతామని వేద పండితులకు చెప్పడం జరిగింది.

శ్రీ శృంగేరి శంకర మఠం వారి ఆహ్వానం

ఆటోనగర్ రోడ్ శ్రీనివాస కాలనీ, శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ శారద దేవి శరన్నవరాత్రి ఉత్సవముల సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించిన ప్రధానార్చకులు సంగమేశ్వర జోషి, అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు…

పోషణ అభియాన్ లో భాగంగా అవగాహన కార్యక్రమం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి లో జరిగిన పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ నిర్మల దేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లులకు ఆరు సంవత్సరముల పిల్లలకు బాలింతలకు కిశోర బాలికలకు ఎనిమియా పరీక్షలు జరిపినారు అలాగే బరువు తక్కువ ఉన్న పిల్లలనుNRC. కి అలాగే బరువు తక్కువ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ తినిపించాలని 20 మంది గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం అన్న ప్రసన్న o చేశామని ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సత్యవతి వీరు భాయి పుష్పలత శోభారాణి శారద పద్మ సరళ అందరూ టీచర్లు సులోచన పద్మ పుష్పలత 9 సెక్టర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

నూతన తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ గౌడ్

మర్యాదపూర్వకంగా కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు

వీణవంక,( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన గుర్రం శ్రీనివాస్ తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కార్యక్రమం భాగంగా తహసిల్దార్ గారిని మర్యాదపూర్వకంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, గారి ఆధ్వర్యంలో నాయకులంతా కలిసి శాలువాతో సత్కరించి మండల అభివృద్ధికి తోడ్పడుతూ… ప్రజల సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేసి వారికి సేవలు అందించాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి కొమురయ్య, నల్ల కొండల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, కట్కూరి ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు కంకణాల జగదీష్ రెడ్డి,నాగిడి రాంరెడ్డి, కండే మహేందర్, కొలిపాక మల్లయ్య,గెల్లు కొమురయ్య,తదితరులు పాలుగోన్నారు.

తొర్రూర్ లో పుట్టగొడుగుల వెలుస్తున్న మెడికల్ షాపులు

నాసిరకం మందులతో రోగి గుండె జేబుకు చిల్లు
మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్
తొర్రూర్ (డివిజన్)నేటి ధాత్రి

వైద్యో నరాయణో హరి వైద్యుడిని దేవుడితో పోలుస్తారు ప్రజలు జ్వరం రాగానే ముందుగా గుర్తుకు వచ్చేది డాక్టరే అలాంటి డాక్టర్ల లే జబ్బు వచ్చినా రోగికి నాసిరకం మందులు రాస్తూ ఇస్తూ అధిక లాభాల వచ్చే మందులు రాస్తూ రోగులను ఇంకా వ్యాధిగ్రస్తులుగా చేస్తూ డాక్టర్లపై నమ్మకం కోల్పోయేలా, ప్రజలు హాస్పిటల్లో అంటేనే భయపడే రోజులు వచ్చాయి జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళితే పది రకాల టెస్టులు చేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ నకిలీ మందులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న తొర్రూర్ ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యం ఆడింది ఆట పాడిందే పాట గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్లు చేసి చనిపోయిన సంఘటనలు మరువకముందే మరికొన్ని సంఘటనలు పైకి వస్తున్నాయి ఎన్ని జరుగుతున్న ఉన్నతాధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేకుండా మామూలు తీసుకొని తూతూ మంత్రంగా తనిఖీ చేసి వదిలి వేస్తున్నరూ. తాజాగా శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ చింతలపల్లి రోడ్డు లోని కవిత హాస్పిటల్ లో సిద్ధార్థ మెడికల్స్ అనే మందుల షాపులో ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతూ అందులో పని చేసే వ్యక్తిని ప్రైవేటుగా ఎటువంటి చదువు లేకుండా ఫార్మసిస్ట్ గా పెట్టుకొని మెడికల్ షాప్ లో మందులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్ కవిత రాసి ఇచ్చిన
ప్రిస్క్రిప్షన్ పై మెడికల్ షాప్ లో మందులు ఇస్తూ అధికంగా దోచుకుంటున్న సంఘటన వెలుగులోకి వచ్చింది ఆదివారం రోజున చర్లపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ వెళితే గర్భసంచి కి సంబంధించిన ఆపరేషన్ కు అధిక మొత్తంలో ఆపరేషన్ ఖర్చు మెడిసిన్ మిగతా వాటికి అన్నిటికీ 50 000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆమె వెనుతిరిగి ఇంత ఖర్చవుతుందని గుండె ఆగినంత పని అయింది. ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అంగన్వాడి పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైనుపాక అందుకు తండా చల్లగరిగే అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో సోమవారం రోజున పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద తెలిపారు, ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ జయప్రద పాల్గొని మాట్లాడుతు పోషణ మాస ఉత్సవాలు ముగింపు వేడుకలను అంగన్వాడీ కేంద్రం కింద నాలుగు సెంటర్లకు ఎల్ఈడి టీవీలు పెయింటింగ్ వేయించడం ఇంకుడు గుంతలు నిర్మించడము, పోషణ వాటికలు ఏర్పాటు చేసినందున ఈ నాలుగు కేంద్రాలలో స్టేట్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ప్రారంభించడం జరిగింది తల్లులు పిల్లలు టీవీలో వస్తున్న ఆటలు పాటలు అక్షరాలను వీక్షిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఒక పాపకు అక్షరాభ్యాసం చేసి బతకమ్మ సంబరాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో సుజాత కరుణ కస్తూరి సుభద్ర అలాగే 30 మంది టీచర్స్, కార్యదర్శి విష్ణువర్ధన్, ఏ ఈ ఓ సుమంత్, పాల్గొన్నారు

చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేనిన బీజేపీ నాయకులు

పరకాల నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహారిస్తున్న తీరును రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ 24గంటల బీజేపీ ప్రజాప్రతినిధులు దీక్ష లో భాగంగా సోమవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల మండల రూరల్ అధ్యక్షులు ముస్కె దేవేందర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులు బీజేపీ నాయకులు బయలుదేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు మార్చబోయిన బాబన్న,మండల కార్యదర్శి రామకృష్ణ,మండల నాయకులు,కార్యకర్తలు పరకాల మండలంలోని పలుగ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version