మీడియాపై దాడిని ఖండిస్తున్నాం.

టీయూడబ్ల్యూజే హెచ్ 143 అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్.

–మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి.

వేములవాడ నేటి ధాత్రి

విచక్షణ మరచి, విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవాడ టియుడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ తెలిపారు. కవరేజ్ కు వెళ్లిన వివిధ టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి దిగిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాన్షియస్నెస్ క్లబ్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో తిమ్మాపూర్ ఎక్సైజ్ సిఐ ఎస్ బాబా, ఎస్సై శ్రీకాంత్ హజరై మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కాన్షియస్నెన్స్ క్లబ్ లో సభ్యులుగా ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులు ఉంటారని, ఏదైనా మాదక ద్రవ్యాల గురుంచి సమాచారం ఉంటే వీరికి తెలియజేసి మాదకద్రవ్యాల నిర్మూలనలో అందరూ బాగస్వామ్యం కావాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ భారతి, గురుకుల సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సాయి కిరణ్, రమేష్, మాలతి ఎక్సైజ్ సిబ్బంది రాజేశం, సురేష్ , మనోహర్ , దేవంపల్లి గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు రేనుకుంట బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, సీనియర్ జర్నలిస్ట్ మొగురం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

అనాధాశ్రమానికి నిత్యవసర సరుకులు అందించిన శ్రీ అక్షయ ట్రస్ట్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమంలో బుధవారం రోజున శ్రీ అక్షయ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సమితి నస్పూర్ వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సీఎండీ డాక్టర్.మాలి రమేష్ మాట్లాడుతూ ఆర్ఎంపి డాక్టర్ కుమార్ కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం ద్వారా అనాధలను,మతిస్థిమితం లేని వారిని చేరదీసి వారిని కంటికి రెప్పలా,స్వంత వారిలా చూసుకోవటం,అన్ని తానే అయి ఆదుకోవడం అతని యొక్క గొప్ప మనసుకి నిదర్శనమని,సమాజంలో చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తుల్ని చూస్తుంటామని అన్నారు.అలాగే ఆశ్రమంలో ఇక ముందు కూడా క్రమంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని,మనసున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు అందరూ కూడా తమకు తోచినంత సహాయాన్ని అనాధాశ్రమానికి అందించాలని డాక్టర్ మాలి రమేష్ కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఎండీ డాక్టర్.మాలి రమేష్,జాతీయ ప్రధాన కార్యదర్శి యండపల్లి ఆగస్టన్,కోశాధికారి యండపల్లి సుధీర్ కుమార్, ఉప కార్యదర్శులు యండపల్లి సుశీల,వేదకుమారి,అలుగునూరి లత,సూర సప్న,కంబాల శ్రీవాణి,గౌతమ్,ఉదయ్ కుమార్,గోగు తిమోతి,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

భూమిని ఒక వ్యక్తికి అమ్మి అదే భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు సహాయంతో మరో వ్యక్తికి అమ్మి బెదిరింపులకు పాల్పడిన సిరిగిరి రమేష్ అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.

వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్.

వేములవాడ నేటి ధాత్రి

అశోక్ నగర్ కరీంనగర్ కు చెందినటువంటి బొద్దుల రాంనారాయణ వేములవాడ లోని నందికమాన్ ప్రాంతంలో, సిరిసిల్ల అంబేద్కర్ నగర్ చెందినటువంటి సిరిగిరి రమేష్ దగ్గర 2004 సంవత్సరంలో 200 చదరపుగజాల స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేసుకోగా గత నెల రోజుల క్రితం అతను తన ప్లాటు వద్దకు వెళ్లగా సిరిగిరి రమేష్ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి వేరే వారికి తన భూమిని విక్రయించాడని తెలిసింది. దీని గురించి సిరిగిరి రమేష్ ని ప్రశ్నించగా తనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించారు.అతని ప్లాట్ అతని కావాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు.అతనికి భయపడి బొద్దుల రాoనారాయణ లక్ష రూపాయలు ఇచ్చాడు. మరల మరో 50 వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు.లేకుంటే తనని తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు.బొద్దుల రంనారాయణ పిర్యాదు మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.

సిరిగిరి రమేష్ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధించిన పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

దగాపడ్డ కళాకారుల డప్పుల మోత పోస్టర్ ఆవిష్కరణ.

చిట్యాల, నేటిధాత్రి ;

పాటల పల్లకిలో 32 గంటలు దగాపడ్డ కళాకారుల డప్పుల మోత పోస్టర్ చిట్యాల మండల కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కళాకారుల సంఘం నాయకులు జన్నె యుగేందర్ , జిల్లా ఇంచార్జి కొండ్ర కుమార్ హాజరై మాట్లాడుతూ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని ఈనెల 12, 13 తేదీల్లో పాటల పల్లకిలో 32 గంటల దగాపడ్డ కళాకారుల డప్పుల మోత కార్యక్రమం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నదని, మన ప్రముఖ కవి గాయకులు నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు మన రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు మరియు తెలంగాణ ప్రముఖ కళాకారులు వస్తున్నారనీ అన్నారు అందుకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కళాకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12 ,13 వ తేదీన జరుగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు ఈ కార్యక్రమంలో జానపద గేయ రచయితలు దాసారపు నరేష్ , మ్యాదరి సునీల్ , వైనాల రమేష్,గాయకులు పుల్ల ప్రతాప్, కోట మహేష్, మంద జగన్, దుడపాక శ్రీనివాస్ , డప్పు రాజు తదితరుల పాల్గోన్నారు

జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ జడ్చర్ల కేద్రంలో నిరసన

మతిభ్రమించిన పెద్దరాయుడు పై
సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నిరసన గా జడ్చర్ల కేంద్రం లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో వార్తను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు (పెదరాయుడు)చేసిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి, అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను జనాలకు చూపించేందుకు తాపత్రయం పడుతున్న జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, నియోజకవర్గం జర్నలిస్టులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకొని సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రాచాల నరేందర్ గౌడ్, మానే శశికాంత్, రవీందర్ గౌడ్, శ్రీధర్, తదితరులు ఉన్నారు..

చందుర్తిలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భూమి పూజ

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ రేణుక దేవి ఆలయం సమీపంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం గ్రామస్తులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ఆలయ నిర్మాణ నికి ప్రముఖ ఎన్నారై మోతె రాములు 10 లక్షల 16 వేల రూపాయలు, మల్లికార్జున స్వామి విగ్రహం, అయ్యప్ప సేవా సమితి వారు మేడలమ్మ,కేతమ్మ విగ్రహాలు,ప్రముఖ వ్యాపారవేత్త లింగాల మల్లయ్య శివలింగం నంది విగ్రహాలు, గ్రామ మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ గణపతి విగ్రహాలను అందజేస్తున్నారని గ్రామస్తులు అన్నారు.

అలాగే ఆలయ నిర్మాణంలో అవసరం అయిన ధ్వజస్తంభం , ఇతర నిర్మాణాలకు గ్రామస్తులు భక్తులు తమకు తోచిన సహాయం అందజేయవలసిందిగా కోరారు.
గత కొన్ని సంవత్సరాల గ్రామ ప్రజల కోరిక అయినా మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామంలోని అన్ని కులాల వారి సహకారంతో నిర్మించుకోవడం ఆనందకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

“రంగోత్సవ్” జాతీయ స్థాయి డ్రాయింగ్ కలరింగ్ పోటీలలో ప్రతిభ చాటిన సురభి హైస్కూల్ విద్యార్థులు

గంగాధర నేటిధాత్రి :

జాతీయస్థాయి రంగోత్సవ్ డ్రాయింగ్ కలరింగ్ పోటీలలో మండలంలోని మధుర నగర్ చౌరస్తాలో గల సురభి కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు పాఠశాల కరస్పాండెంట్ వీరేశం తెలిపారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రాయింగ్ కలరింగ్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను విద్యార్థులకు కరస్పాండెంట్ వీరేశం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి కలరింగ్ పోటీలలో దాదాపు 109 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 24 మంది విద్యార్థులు వివిధ కలరింగ్ లలో ప్రతిభను చూపినందుకుగాను వారందరికీ ప్రశంస పత్రాలతో పాటు మెడల్స్ ను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వీర నర్సయ్య, కలరింగ్ నిర్వాహకులు కె రామానుజాచారి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడంలో నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి

ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను బాధితులకు వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది…గత ప్రభుత్వంలోనే లబ్ధిదారులను గుర్తించి వారికి లాటరీ సిస్టంలో డ్రా తీసి రూములు అలాట్మెంట్ చేసి రూమ్ నంబర్స్ కూడా కేటాయించడం జరిగింది… ఇది జరిగిన అనంతరం ఎన్నికల కోడ్ రావడం వల్ల బాధితులకు పట్టాలు అందలేదని తెలిపారు…అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పుడు కేటాయించిన లబ్ధిదారులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు వారికి అనుకూలించిన వారికి ఇవ్వడం కోసం కుట్ర పన్ని స్థానిక ఎమ్మెల్యే కమిషనర్ వాటిని అలాగే ఎవరికి కేటాయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారని ఆయన తెలియజేశారు… అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ… వాటిని అలాగే ఎవరికి కేటాయించకుండా ఉండడం వల్ల అవి అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని,, అక్కడ ఉన్న సామాగ్రి ఇతరత్రా సామానులు అన్ని చోరీకి గురికాపడుతున్నాయని తెలిపారు…బేషరతుగా గత ప్రభుత్వంలో గుర్తించిన పేద లబ్ధిదారులకు తిరిగి ఆ డబల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది… లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలసి వచ్చిన సంఘాలను కూడగట్టుకొని డబల్ బెడ్ రూమ్ బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణిగుంట్ల మహేష్ జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి నియోజకవర్గ ఇన్చార్జి నితిన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు…

అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర జరిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం శబరిగిరీసుడు అయ్యప్ప స్వామికి వినాయకునికి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆధ్వర్యంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అర్చకులు ఆరుట్ల కృష్ణమాచా రి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు చేసినారు ఈ కార్యక్రమంలో గట్టు కిషన్ మార్త సుమన్ గోరంట్ల ప్రశాంత్ భక్తులు పాల్గొన్నారు.

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో బోయ హన్మంతు కూతురు గౌతమి వివాహానికి బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.10,000/- రూపాయల ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించరు. రాజపూర్ మండలంలోని గ్రామాల ప్రజల కు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ గ్రామాలలోని ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరినీ అభిమన్యు రెడ్డి ఆదుకుంటున్నారని పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ హన్మగాళ్ల నర్సింహులు, మాజీ ఉప సర్పంచ్ అల్లే శ్రీనివాస్, వట్టెం సత్తయ్య, మాజీ ఎ.ఎమ్.సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, అచ్చయ్య, అరిఫ్, లింగం, నాజీమ్ బేగ్, వెంకట్ రాజు, షాకేర్ గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ లో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

జైపూర్,నేటి ధాత్రి:

బుధవారం రోజున తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకముగా నిర్వహిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ,జైపూర్ మండల స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలను జైపూర్ గ్రామ పంచాయతీ లోనీ టీఎస్ డబ్ల్యూ ఆర్ఈఎస్ స్కూల్ నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 రోజుల వరకు గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందనీ,విద్యార్థులు ఆటలను స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ గౌడ్, తహసీల్దార్ వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఎంఈఓ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు,పంచాయితి కార్యదర్శి ఎ.సుమన్,బి.ఉదయ్ కుమార్,ఫిజికల్ డైరెక్టర్లు,పిటీలు,విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాదా రక్షాలు అందజేత.

మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని పంతులుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి 12 మంది విద్యార్థులకు బహుకరించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణ కంటి రామ్మూర్తి, పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి ఉడత రాజేందర్, ఏ ఏ సి సి చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, పంచాయతి కార్యదర్శి విష్ణు, ఉపాధ్యాయులు రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో విలేకరుల నిరసన

వనపర్తి నెటిధాత్రి
మీడియాపై మోహన్ బాబు చేసిన దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం ఐజేయు విలేకరుల సంగం పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో టిడబ్ల్యూజే ఐజేయు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోవిలేకరులు నిరసన వ్యక్తం చేశారు .విలేకరుల పై దాడిని ఖండించాలని,దాడికి పాల్పడ్డ మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
టి యు డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ సినిమా నటుడు పెద్ద రాయుడు మతిస్థిమితం కోల్పోయి జీరో రాయుడుగా తయారయ్యాడని విమర్శించారు , ఎన్నో సినిమా రంగాలలో దేవత రూపంలో నటనలు చేసిన మోహన్ బాబు అయ్యప్ప స్వామి భక్తుడు స్వామి ధరించిన టీవీ9 జర్నలిస్టుపై దాడిచేసి అత్యాయత్నానికి పాల్పడిన విషయం సినిమా రంగానికి తెలంగాణ సమాజానికి సిగ్గుచేటని ఆయన విమర్శించారు, బాబు మోహన్ మతిభ్రమించి మతిస్థిమితం కోల్పోయి టీవీ9 విలేకరితోపాటు టీవీ5, ఈటీవీ విలేకరులపై దాడులు చేసి పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించిన మోహన్ బాబు పై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతినిత్యం ప్రతిక్షణం అణువు అణువునా ఎలాంటి జీతాలు లేకపోయినా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని విలేకరుల పట్ల ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులను సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఐజేయు మాజీ నేషనల్ కౌన్సిల్ సబ్యులు వనపర్తి సీనియర్ విలేకరి మల్యాల బాలస్వామి మాట్లాడుతూ యాక్షన్ కింగ్ మోహన్ బాబు నటనలు విలేకరుల వద్ద సాగవనిఅన్నారు.జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించినమోహన్ బాబు పై చర్యలు తీసుకువాలని విలేకరు లు మోహన్ బాబును వదిలిపెట్టరని ఆన్నారు .ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే ఐజేయూ జిల్లా కార్యదర్శి డి.మాధవరావు,వనపర్తి జిల్లా విలేకరుల రాజు, లక్ష్మణ్, విజయ్, సీనియర్ విలేకరి కె రవిశంకర్ గౌడ్ విలేకరులు వహీద్,ఆంజనేయులు,అరుణ్ కుమార్, శ్రీనివాసులు, మన్యం పాల్గొన్నారు

భద్రాచలం మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పెరిగిన రద్దీకి తగినట్లుగా బస్సులు సంఖ్యను పెంచాలి

భద్రాచలం నేటిదాత్రి

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం మంచి విషయం మంచి విషయం కానీ పెరిగిన పయనికుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు పెంచనందువలన ప్రయాణం చాలా ఇబ్బందిగా పరిణమించింది అలాగే బస్సులు పాతవి కావటం వల్ల అక్కడక్కడ ఆగిపోతున్నవి ప్రయాణాల రద్దీ వలన ముఖ్యమైన చోట కొన్ని డిపోల బస్సులు ఆపటం లేదు డ్రైవర్లు కండక్టర్ డ్రైవరు ఉంటున్నారు విసుకుంటున్నారు కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా కొన్ని డిపోల బస్సులు ముఖ్యంగా ఖమ్మం డిపో బస్సులు ఆపటం లేదు వారిని ఆదేశించి బస్సులో ఆపించాలని ఆ విధంగా కలెక్టర్ ను కలుసుకుటకు సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ నాయకుల ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్టిసి డిఎం కి మెమోరండం అందించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కే కల్పనా మాట్లాడుతూ ప్రజల డిమాండ్ ని ఆమోదించకపోతే గౌరవించకపోతే ప్రజా ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల మహేశ్వరి షకీరా బిరుదుస్ కుమారి కృష్ణవేణి శారద నారాయణ తదితరులు పాల్గొన్నారు

బ్లూ ఇండియా పార్టీ సభా ను విజయవంతం చేయండి

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని శ్రీభార్గవ ఫంక్షన్ హాల్ లో 15 వ తేదీన జరగబోయే సభా ను విజయవంతం చేయాలని బ్లూ ఇండియా పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ బానోతు లింగన్న పిలుపునిచ్చారు, ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లూ ఇండియా పార్టీ కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ జనాభా దామాషా ప్రకారం అధికారంలోనూ ప్రాతినిధ్యం కల్పించుట లక్ష్యంగా బ్లూ ఇండియా పార్టీ పనిచేస్తుంది అన్నారు, అన్ని రంగాల వారికి అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్, టిడిపి లాంటి పార్టీలు బిసి, ఎస్టి, ఎస్సి, మైనార్టీల చేత స్థాపించబడలేదు అన్నారు ఓసీల చేత స్థాపించబడ్డాయి అన్నారు, మన కులాల వర్గాల చేత స్థాపించబడ్డ ఏకైక పార్టీ బ్లూ ఇండియా పార్టీ అన్నారు, ఈ కార్యక్రమంలో బ్లూ ఇండియా పార్టీ మహబూబాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ నునావత్ బాలు నాయక్, భూక్యా బిచ్చా నాయక్, మోహన్ నాయక్, కుమార్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు

నూతన దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల ,నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శృంగారపు రంగాచారి ఉమామహేశ్వరుల ఏకైక పుత్రిక పూజిత తరుణుల వివాహం. హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షనల్లో జరుగుతున్న వివాహానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు కాంగ్రెస్ నాయకులు హాజరై
నూతన దంపతులను ఆశీర్వదించి చిరుకానుక అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి. వారి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య
మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య ..
చిట్యాల టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్. బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్.
కాంగ్రెస్ నాయకులు ఆకుల ఆది రెడ్డి. ఆకుల రవీందర్.
క్యాతం మార్కండేయ. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలతీర్పు ఎటువైపో!

నేతల గుండెల్లో గుబులు

మారుతున్న రాజకీయ పరిణామాలు

శాయంపేట నేటి ధాత్రి:

రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి దక్కుతుందో తెలియక అధికార పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది మండల పరిధిలోని గ్రామాల్లో ఘనంగా రాజకీయ పరిణా మాలు చాలావరకు మారాయి మండలంలోని కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం నెలకొన్నది రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ప్రజలలో మమేకమవుతున్నారు అధిష్టానం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో శ్రేణుల్లో ఈ విషయం చర్చనీయంగా మారుతుంది. సర్పంచ్ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ నేతలు మండలంలో విస్తృత పర్యటిస్తున్నారు టిక్కట విషయంపై అధిష్టానం నుంచి పిలుపు ఎవరికి వస్తుందోనన్న విషయం తర్జన బర్జన అవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల పోరు కాకా పుట్టిస్తుంది ప్రధాన పార్టీల భవిష్యత్తు గుండెల్లో గుబులు రేపుతుంది నోటిఫికేషన్ రావడమే తరువాయి ఎన్నికల సమరానికి సిద్ధమైన లీడర్లకు టికెట్ల టెన్షన్ పుట్టుకొస్తుంది.

సర్పంచ్ టికెట్ల పంచాయతీ…పార్టీ పెద్దలకు తలనొప్పి.

సర్పంచ్ ఎన్నికల పర్వం ప్రధాన పార్టీల బాధ్యులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది సర్పంచ్ టికెట్ల కోసం ఆశావా దులు ఎక్కువగా పోటీ ఉండడంతో ఎవరికి ఇవ్వాలని విషయంలో డైలాగ్ నడుస్తోంది రానున్న తరుణంలో టికెట్ల పంపిణీ ఇబ్బందికరంగా మారింది అదెలా ఉంటే టిక్కెట్లను తమకే ఇవ్వాలంటూ కొందరు పట్టుబడుతున్నారు ఆ మేరకు ఆ మేరకు పైరవీలు చేయడం జరుగుతుంది అత్యధిక ఓటర్లు టిఆర్ఎస్ చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్న ఇటీవల కాంగ్రెస్ వలసలు పెరగడంతో పార్టీ బల బలాలు ఎక్కువమందిని ఎవరు ప్రసన్నం చేసుకుంటారో వారికే వరిస్తుంది.పార్టీ బాధ్యులకు ఈసారి టిక్కెట్లు పంపిణీ తలకు మించిన భారంగా కనిపిస్తుంది. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలకు కొందరు నేతలు రావడం యువజన యువకుల కుల సంఘాలు ప్రతినిధులు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండడంతో మాజీలు తర్జనభర్జన అవుతున్నారు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సీన్ రివర్స్ టికెట్ రానిపక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారు కొన్నిచోట్ల వార్డుల్లో బీఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల్లో ఆశావా దులు చాలా మంది ఉండడంతో టికెట్ ఎవరికీ ఇవ్వాలనేది ముఖ్య నేతలకు తలనొప్పిగా మారనుంది!

నేడే అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలోని గచ్చుబావి ఆవరణలో గురువారం నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహ పడిపూజ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని అయ్యప్ప సేవా సమితి వారు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా డిసెంబర్ 12వ తేదీన గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమా చారి చేతుల మీదుగా మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం కన్నుల పండగ నిర్వహించడం జరుగుతుందని గురు స్వామి మర్రి (షిరిడి) మల్లేశం అన్నారు అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మండలంలోని మాలాధారణ స్వాములు పాలుపంచుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు..

అలాగే దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులందరూ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

నిరుపేద దళితులకు డబుల్ బెడ్ రూములు అందేనా.

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు AMC కాలనీ నందు దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు *అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబల్ బెడ్ రూములు పక్కదారి పడుతున్న విషయమై సమావేశం నిర్వహించడం జరిగింది.

రోజువారీ కష్టం చేసే వారికీ, అర్హులైన వారికి, దళితులకు డబల్ బెడ్ రూంలు అందటంలేదని, గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో దళితులకి డబల్ బెడ్ రూముల పంపిణీలో అన్యాయం జరిగిందని.
ఈ ప్రజా ప్రభుత్వంలోనైనా ఎదురుచూస్తున్న వారికి అందుతాయి అనుకున్న లోపే ఒక్కదారి పడుతున్నాయని.

రోజు వారి కష్టం చేస్తూ నెలకి 4000,3000 అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్నారని, 20 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ జీవిస్తున్న దళితులకి ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా అందలేదని అయినా ఆవేదన వ్యక్తం చేశారు.మరి ఇంకెప్పుడూ దళితులకి డబల్ బెడ్ రూములు వస్తాయో చెప్పాలని ఈ విధంగా ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో శాంతి రాజు, చీకటి దశమ్ బాబు, రాజు, బర్ల రామకృష్ణ,దాసరి సామేలు, కొంగ దిలీపు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version