ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో 105,106,107,108బూత్ లలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడప గడపకు స్టిక్కర్, నరేంద్ర మోదీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ది పనుల కరపత్రంలను పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గం ప్రభారీ రాజేష్, బీజేపీ జిల్లాకార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి వెల్ముల రమేష్, బూత్ కమిటి అధ్యక్షులు కంకణాల ఆనందం, వేముల గణేష్, జిట్టా రాజు, చింతల తిరుపతి, సామల చందు, గొండ మధు, గాండ్ల సాయి కుమార్, ఉప్పు రవీందర్, జిల్లెల్ల సురేష్, గాండ్ల లచ్చయ్య, అవుదరి శేఖర్, అవుదరి సంపత్, అంబటి వినోద్, అమిరిశెట్టి సురేష్, అమిరిశెట్టి తిరుపతి, సాగర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మనస్తాపంతో నిరుద్యోగి ఆత్మహత్య

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం లో ఆకుల భారతి పెద్ద కుమారుడైన ఆకుల రంజిత్ వయసు 30 సం.. గత 2, 3 సం.. ల నుండి 3 సార్లు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అప్లై చేసి పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించక పోవడంతో ఉద్యోగం రావట్లేదని గత 4 రోజుల నుండి మనస్థాపం చెందుతూ ఇంట్లో ఎవరు లేని సమయం లో లుంగీ తో ఉరి వేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు క్రిందికి దించి 108 అంబులెన్స్ కి కాల్ చేయగా వారు వచ్చి అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు రోదించారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రియాంక తన తండ్రి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దానిని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం జూనియర్ అసిస్టెంట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో నడికుడ యంపిడిఓ శ్రీనివాస్,మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఏపిఓ ఇందిర,టెక్నికల్ అసిస్టెంట్ సుమలత, కార్యాలయ సిబ్బంది, ఈజియస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో నరేన్ గార్డెన్ లో 170 మంది పార్టీలో చేరారు

కూకట్పల్లి ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేట ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మ హిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు మధులత,సీనియర్ నాయ కులు బాలస్వామి,మో జెస్,పోశెట్టిగౌ డ్,యాదగిరి,ఫారూఖ్,ఖాలీమ్,భిక్షపతి,రవీందర్,పుట్టం
దేవి,సరిత,పర్వీన్,యస్మిద్,మహముదాలు కాంగ్రెస్ కండువా కప్పు కుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు సుమారు వందమంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం జరిగింది.సోమవా రం రోజు ఉదయం నల్లగండ్లలోని జగదీ శ్వర్ గౌడ్ సమక్షంలో సుమారు 170 మంది నరేన్ గార్డెన్ లో పార్టీలో చేరారు. అంతకు ముందు నల్లగండ్ల లోని ఆయన నివాసం వద్ద 30 మంది పార్టీ తీర్థం పు చ్చుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మారిన కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ విషయాన్ని మీడియా మిత్రులతో తెలి యజేశారు.ఈ సందర్భంగా కార్పొ రేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాను న్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి చేవెళ్ల పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించా లని అన్నారు.కార్యక్ర మంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,అగ్రవాసు,సంగమే ష్,రాజు,అరుణ,బాలస్వామి సాగర్,త దితరులు పాల్గొన్నారు.

ఎంపీపీగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికపై డిఆర్డివో శ్రీధర్ ఎన్నికలు నిర్వహించారు. ఈఎన్నికల్లో ఎంపీపీ పదవికి జవ్వాజి హరీష్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీఫాంతో నామినేషన్ దాఖలు చేయడంతో రామడుగు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని డిఆర్డివో తెలిపారు. మొత్తం పద్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా వెలిచాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గతంలోనే రాజీనామా చేయగా మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. మిగిలిన పదకొండు మంది సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా జవ్వాజి హరీష్ ను ఏకగ్రీవంగా ఎన్నికోవడంతో, హరీష్ కు నియామక పత్రాన్ని డిఆర్డివో అందజేశారు. ఎంపిక అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నమస్కరించి హరీష్ ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరై హరీష్ ను అభినందించారు. ఎంపిపి హరీష్ మాట్లాడుతూ రామడుగు మండల పరిషత్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అన్ని పార్టీల సహచర ఎంపిటిసి సభ్యులకు మొట్టమొదటగా నాహృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈమండలంలో ఉన్నత బాధ్యతలు రావడానికి అవకాశం కల్పించిన వన్నారం, కొక్కెరకుంట గ్రామ ప్రజలకు జీవితాంతం ఋణపడి ఉంటానని, ఎంపిటిసిగా ప్రయాణం చేపట్టిన నాటి నుండి నేడు ఎంపిపిగా పదవీ బాధ్యతలు చేపట్టేవరకు నాకు అన్ని విషయాల్లో సహకరించిన పాత్రికేయ మిత్రులకు ఈసందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, అతి పిన్న వయసులోనే నాలో వున్న రాజకీయ ఆసక్తిని గుర్తించి, ఎంపిటిసి టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొప్పదండి నియోజకవర్గంలోనే తనకి మొట్టమొదటి అవకాశం కల్పించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి ఈసందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఉన్న ఈకొద్ది సమయం అయినప్పటికి యువ నాయకులు చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సంపూర్ణ సహాయ సహకారాలతో రామడుగు మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనకు సహకరించిన ప్రతీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఎంపిడివో రాజేశ్వరి, సూపరింటెండెంట్ రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మైలారం గ్రామంలో రక్తదాన శిబిరం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సోమవారం మైలారం గ్రామంలో తెలంగాణ వాలంటరీ బ్లడ్ బ్యాంకు వారికి ధర్మసమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మహారాజ్ రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని రక్త దానం చేయడం వల్ల కులమత బేధాలు లేకుండా . ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో కాపాడుకునే ఆవాకాశముంటుందని ముందుగానే అపాయాలను దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేస్తు నేను రక్తదానం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నా నేను ఇచ్చిన రక్తముతో ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం వచ్చింది అందుకే ప్రతి ఆరోగ్యవంతుడు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడుకోవాలని అదే మానవ ధర్మమని తెలిపారు.

జైపూర్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

నేటి ధాత్రి జైపూర్ :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట, మిట్టపల్లి, రసూల్ పల్లి, నర్వ , టేకుమట్ల బెజ్జాల గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీని వీడి సోమవారం రోజున చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే వివేక్ అందరికీ కండువాలు కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఇంతమంది పార్టీలోకి చేరడం చాలా సంతోషకరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త శ్రేయస్సు కోరుకుంటుందని, అమ్మలా ఆదరిస్తుందని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ముందుకు సాగాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా మారుతుందని తెలిపారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడపడానికి నా సాయ శక్తుల కృషి చేస్తానని, ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా పరిష్కారాన్ని చూపిస్తామని తెలియజేశారు. పార్టీలోకి చేరిన నూతన కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తవక్కల్ విద్యార్థినిలను అభినందించిన చైర్మన్ అబ్ధుల్ అజీజ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఆశ్లేష, దీక్షిత,రచన,ఐశ్వర్య, శ్రీవైష్ణవి లు మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో జాతీయస్థాయిలో మూడవ స్థానం సాధించారని, భారతదేశ గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారని, ఈ నెల 8న హైదరాబాద్ లో వీరికి భారతదేశ గౌరవ పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను సైతం అందజేశారని తవక్కల్ విద్యా సంస్థల ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులను తవక్కల్ విద్యా సంస్థల చైర్మైన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… చదువు తో పాటు సాంస్కృతిక రంగాలలో రాణిస్తున్న విద్యార్థుల కృషిని వారి తల్లితండ్రుల ప్రోత్సహాన్ని సైతం కొనియాడుతున్నానని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు ఇంత చక్కటి తోడ్పాటునందించి వారి విజయానికి కృషి చేసిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీ వారి కృషిని కూడా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఉపాధ్యాయబృందం విద్యార్థులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి 65 వ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో Rs.25000 /- ఆర్థిక సహాయం*

హసన్పర్తి (నేటిదాత్రి ) :

ఆదివారం రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇటీవల మృతి చెందిన చుంచు సురేష్ గారి ఇంటికి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. సురేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని, చిన్న వయసులోనే చుంచు సురేష్ గారు మరణించడం వారి కుటుంబానికి తీరని లోటు అని శ్రీ నాగవల్లి రమేష్ , శ్రీ వెన్నపురెడ్డి జగన్ ,పోరిక స్వప్న రాజు నాయక్(బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి) మేకల చంద్రబాబు, కాగితోజు అఖిలేష్, అభిలాష్, సూరం రంజిత్, తిరుమల్, నితిన్ గారు నివాళులు అర్పించారు మరియు బిజెపి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు వారికి ఆర్థికంగా 25 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా, వచ్చే విద్యా సంవత్సరం జూన్ లో వారి పిల్లలకు కావలసిన నోట్స్ బుక్స్ కూడా ఇస్తామని పోరిక స్వప్నరాజు నాయక్ గారు సురేష్ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది.

నాటు సారా( గుడుంబా) దారుని బైండోవర్

జైపూర్ నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామపంచాయతీ గోపాల్ పూర్ కు చెందిన జుమ్మడి మహేందర్ s% రాజయ్య ను గుడుంబా విక్రయ దారునిగా అనుమానిస్తూ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు మంచిర్యాల డివిజన్ ఎక్సైజ్ శాఖ ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గుడుంబా క్రయ విక్రయ అనుమానిత కుటుంబాలను మంచిర్యాల డివిజన్ ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. కాగా జూమ్మడి మహేందర్ గుడుంబా క్రయ విక్రయాలకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేక ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ తహసీల్దార్ ప్రసాద్ వనజా రెడ్డి ఎదుట బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్, ప్రసాద్,మహేష్ ప్రణీత మంచిర్యాల అబ్కార్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు

చందుర్తి, నేటిధాత్రి:

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారిని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట గంగాధర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెరుక గంగరాజు బిజెపి ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు చింతకుంట సాగర్ పేరుక రంజిత్ ముప్పిడి సత్తయ్య మెరుపుల వేణు అనీలు శేఖర్, ప్రకాష్ ,వెంకటేష్ ,తిరుపతి, మల్లేశం, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

వినాయక కాలనీ నూతన కమిటీ సమావేశం

హన్మకొండ:

గోపాలపురంలో నూతన కమిటీ సమావేశం అధ్యక్షులు పల్లెబోయిన కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ సబ్ ఇన్స్పెక్టర్ ధామరూపాల దేవేందర్ హాజరయ్యారు నూతన కమిటీకి తెలియజేస్తూ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఒక కుటుంబ పాలనగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన పాత కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఆరె రాకేష్ రెడ్డి అధ్యక్షులు కోరిక రామ్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి తంగేళ్ల రవి ప్రసాద్ కోశాధికారి పొన్నోజు శ్రీనివాస్ మిగతా కమిటీ సభ్యులకు కొత్త కమిటీ సన్మానం చేయడంతోపాటు కాలనీ వాసులు అందరు కలిసి ఎస్సై కి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బంక సురేందర్, కోశాధికారి పోచంపల్లి రమేష్, లక్ష్మణ్, రవీందర్, తిరుపతిరెడ్డి, బజన్ నాయక్, భాస్కర్, మధుసూదన్, వెంకన్న, రవి, సంతోష్, రమణాకర్, రాజేందర్, విజేందర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఇందారం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

అవగాహన సదస్సులు జరిపినప్పటికీ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు

మానవ నిర్లక్ష్యమే దీనికి కారణం మంటలు ఆర్పివేసిన అటవీ అగ్ని మాపక సిబ్బంది

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా అటవీ డివిజన్ పరిధిలోని జైపూర్ మండలం ఇందారం రక్షిత అటవీ ప్రాంతం లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంచిర్యాల – హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న ఇందారం అటవీ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ కు ఆదివారం రాత్రి కొందరు పత్రికా విలేకరులు వారి సామాజిక భాద్యత గా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన తమ అటవీ శాఖ అధికారులకు, ఇతర సిబ్బందికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి చేరుకున్నారు.వాచర్ తుత్తుర్ల శంకర్ సహాయంతో ఫైర్ కంట్రోల్ బ్లోయర్ తో మంటలు అర్పివేయిస్తూ మంచిర్యాల అగ్ని మాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఫైర్ ఇంజిన్ ను ప్రమాద స్థలానికి పంపించారు.అటవీ, అగ్ని మాపక సిబ్బంది అందరూ శ్రమించి మంటలు అడవి అంతా విస్తరించకుండా పూర్తిగా అర్పివేసారు. సకాలంలో ఈ మంటలను ఆర్పివేసి అటవీ ప్రాంతాన్ని రక్షించారు. ప్రధాన రహదారి వెంట వెళ్లే వారు సిగరెట్ లేదా బీడీలు తాగి పడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మానవ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల విషయం లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటేనే సాధ్యమైనంత వరకు వాటిని నివారించవచ్చని అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి ప్రమాదాల వల్లే మంచిగా పెరిగిన పచ్చని చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయాన్నారు. ఎక్కడైనా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

జైపూర్ ఎస్టిపిపిలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రోజున
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టిపీపి ఈడి శ్రీ బసివి రెడ్డి ఇతర అధికారులు మరియు ఉద్యోగులతో కలిసి ఉదయం 7 గంటలకు ఎస్టిపిపి నుండి బైక్ ర్యాలీతో పెగడపల్లి వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియం వద్దకు చేరుకొని పతాక ఆవిష్కరణ చేశారు. తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అలాగే ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఈడీ బసివి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ శిల్పి , సామాజిక, ఆర్థిక వేత్తయని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తియని కొనియాడారు. అంబేద్కర్ అనేక వివక్షలకు గురి అవుతు కూడా అవమానాలకు కృంగిపోకుండా ఆ కసినీ మెట్లుగా ఉపయోగించుకొని తాను రెండు పిఎచ్ డి లను పొంది,64 సబ్జెక్టులలో మాస్టర్స్ సాధించి, సమాజ అభివృద్ధికై కృషి చేశారని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి విద్య ఒక్కటే మార్గం అని సూచించారనీ అన్నారు. అలాగే విద్యను ప్రోత్సహించండి అదే వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఈడి అన్నారు. నిన్న ఎస్టిపిపిలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 121 మంది రక్తదానం చేశారని ప్రశంసించారు. సమాజంలో సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవైతాలికుడు అనగా సమాజాన్ని మేల్కొల్పేవాడు అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు అని, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే అంబేద్కర్ రాజకీయ అధికారం లేకుంటే ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందలేదని అన్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు మరియు ఎస్టిపిపి ఉద్యోగులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన మరియు డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షురాలు భవాని, ఈడి బసివి రెడ్డి , చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం ) శ్రీ జే ఎన్ సింగ్, ఏజీ ఎం (సివిల్ ) శ్రీ ప్రసాద్, ఏజీఎం( ఫైనాన్స్) శ్రీ సుధాకర్, ఏజీఎం (ఎఫ్జీడి) శ్రీ రమణ డీజీఎం శ్రీ మదన్మోహన్, ఎస్టీ ఎంప్లాయిస్ అధ్యక్షులు డి. పంతులు, ఎస్సీ లైసెనింగ్ ఆఫీసర్ శ్రీ వెంకటయ్య, ఎస్టి లైజనింగ్ ఆఫీసర్ శ్రీ బీమా, సి ఎం ఓఏఐ తరఫున శ్రీ సంతోష్ కుమార్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి,పర్సనల్ మేనేజర్ శ్రీ రామశాస్త్రి, పవర్ మేక్ ప్లాంట్ హెడ్ శ్రీ అఖిల్ కపూర్ ఇతర అధికారులు ,ఉద్యోగులు మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆశీర్వదించండి అండగా ఉంటా..

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి

షాద్ నగర్ పట్టణ, ఫరూఖ్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.

వంశీచంద్ రెడ్డి గెలుపుకై కార్యకర్తలు సన్నిద్ధం కావాలి.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే అండగా నిలబడతానని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. వంశి చంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా సోమవారం పట్టణ కేంద్రంలో ఫరూఖ్ నగర్ మండలం, షాద్ నగర్ పట్టణ కార్యకర్తల సమావేశాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసిందని గెలిపించే బాధ్యత మీదే అన్నారు. నేను ఏ పదవిలో ఉన్న మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను అన్నారు. రాష్ట్రంలో మన ప్రజా ప్రభుత్వం ఉన్నదని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తొమ్మిదన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయని బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి నిబద్ధత చాటుకున్నదని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్లుగానే, కేంద్రంలో అధికారంలో తెచ్చుకుంటేనే బిజెపి చేతిలో నిర్వీర్యమైన ఈ దేశాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ నుండి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కి రెండింతలు మెజార్టీ ఇవ్వడం కొరకు కార్యకర్తలు సన్నద్ధమన్నారు. దాంట్లో ఎలాంటి అతిశయం లేదని అన్నారు. కార్యకర్తలు అందరూ గ్రామాల్లో ఒక సైనికుల్లా పనిచేసి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తే ప్రతి పని, ప్రతి పథకం కూడా అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, రఘు, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ జెడ్పిటిసి కందివనం సూర్య ప్రకాష్, ఎంపిటిసిలు మాజీ సర్పంచులు వివిధ విభాగాల బాధ్యులు, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు..

సి డి పి ఓ కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.

చెన్నూర్ నేటి ధాత్రి::

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో రిటర్మెంట్ ఆర్ సి బెనిఫిట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు 60 సంవత్సరాలు దాటిన వారికి వీడిఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని కోరుతూ సిడిపిఓ కి వినతి పత్రం అందజేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు నగేష్ , అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రవీణ, పద్మావతి, శారద, మణిమాల,విజయలక్ష్మి, భారతి,లలిత,సురేఖ, సావిత్రి, రాజు భాయ్,హేమలత, సుగుణ,ఈశ్వరి,సునీత తదితరులు పాల్గొన్నారు

కొల్చారం మండలంలోని పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి రాధా కిషన్

కొల్చారం (మెదక్)నేటిధాత్రి :-

సోమవారం నుండి ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, మండల విద్యాధికారి నీలకంఠం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్చారం, ప్రాథమిక పాఠశాల కొల్చారం, లేక్ వ్యూ ప్రైవేట్ పాఠశాల కొల్చారం, సీతారాం తండా, రంగంపేట ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు.
తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించడం జరిగింది, విద్యార్థుల హాజరు గురించి ఉపాధ్యాయులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధా కిషన్, ఎంఈఓ నీలకంతం మాట్లాడుతూ
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఎనగండ్ల క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో

– ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు…

– అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కొల్చారం ఎంపిపి మంజుల కాశీనాథ్….

-మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన అంబేద్కర్…

– ఎంపీపీ మంజుల….

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-

కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి ,పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచి ఆర్థికంగా,సామాజికంగా ఎంతో వెనుకబడిన అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడి తన మేధా సంపత్తితో తొలి భారత క్యాబినెట్లో న్యాయశాఖ, మంత్రిగా సామాజిక న్యాయం కోసం అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆమె అన్నారు. ఆయన అడుగు జాడల్లో సామాజిక అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని అన్నారు. మహనీయుల జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని, అంబేద్కర్ యువతకు మార్గదర్శనం అన్నారు. దేశ ప్రజలందరికి సమాన ఓటు హక్కు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్, ,క్రాంతి యువజన సంగం అధ్యక్షులు గోపాల్ మరియు మాజీ ఉప సర్పంచ్ సుమలత బాబు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సింహా గౌడ్, మన్నే సుభాష్, కొరబోయిన శివ ప్రసాద్, లింగం క్రాంతి యువజన సంఘం యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నుతల నిశిధర్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ ని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ప్రధానమంత్రినరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గ్రామంలో పేద మధ్యతరగతి ప్రజలకు చేరాయని కరోనా కష్టకాలంలో కూడా దేశాన్ని కాపాడుకున్న గొప్ప మహా నాయకుడు అని ఏ దేశం చేయని విధంగా ఉచిత కరోనా టీకాను ఇప్పించిన ఘనత నరేంద్ర మోడీది,ఆయన యొక్క ఆలోచన విధానాలతోని ప్రపంచంలోనే అగ్రగామిగా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నదని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని అలాంటి నాయకుడు మనకు దొరకడము మన దేశ ప్రజల అదృష్టమని మళ్లీ ఒకసారి నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని కావున పార్టీలకతీతంగా నరేంద్ర మోడీ అభివృద్ధిని కొనియాడుతున్నారని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ కి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరురీ రమేష్ ని గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని ఆయన అన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ చెక్క నరసయ్య గజనాల రవీందర్ బీజేవైఎం మండల అధ్యక్షులు మైదాన్ శ్రీకాంత్ ఓబీసీ మోర్ చ జిల్లా కార్యదర్శి వల్లాల ప్రవీణ్ కుమారస్వామి శ్రీహరి చింతల రాజేందర్ రాకమ్ శ్రావణ్ దశరథం మహేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచo గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి

శాయంపేట నేటి ధాత్రి:

ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మండల జర్నలిస్టు అధ్యక్షుడు కూడలివద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆయన 133 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మ కమైనద న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగము వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version