ఒంటరి మహిళ దారుణ హత్య

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రమైన నవాబుపేట గ్రామంలో ఒంటరి మహిళ పురుగుల లక్ష్మమ్మ (45) దారుణ హత్యకు గురైంది. గత కొన్ని సంవత్సరాల క్రితం భర్త
మృతి వాతపడ్డారు. అనంతరం కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా హైదరాబాదులో విధులు నిర్వహిస్తుంన్నారు లక్ష్మమ్మ నవాబుపేట మండల కేంద్రంలోని
తన సొంత ఇంట్లో ఒంటరిగా నివసించేది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె చుట్టుపక్కల వారికి కనిపించకపోవడంతో ఎక్కడికైనా ఊరికి
వెళ్ళి ఉండవచ్చునని
వారు భావించారు.
తీరా సోమవారం ఆమె నివసించే ఇంటి నుండి దుర్వాసన వెలువడటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పోలీసు వారు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చూడక తలపై, రక్త గాయాలతో ఆమె మృతి చెంది ఉండడం కనిపించింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. మృతురాలు మరణించిన తీరును బట్టి ఆమెపై ఎవరైనా బలవంతంగా అత్యాచారం జరిపి, హత్య చేసి ఇంటికి తాళం వేసి పారిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయమై ఇంకా పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదు.
పోలీసుల సమగ్ర విచారణతో
వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ గ్రామ ప్రజలు భావిస్తున్నారు

విఎస్ఆర్ మార్ట్ డ్రా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కౌన్సిలర్ పూర్ణచారి

పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో గల విఎస్ఆర్ ఫ్యామిలీ మార్ట్ ప్రారంభోత్సవం మరియు ఉగాది పర్వదిన సందర్భంగా మెగా బంపర్ డ్రా స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది.ప్రథమ,ద్వితీయ,తృతీయ,బహుమతులుతో పాటు 100 కన్సల్టేషన్ బహుమతులు కూడా తీయడం జరిగింది.ప్రథమ బహుమతి విజేత డి,రమ 15000 రూపాయలు,ద్వితీయ బహుమతి సౌందర్య 10000, తృతీయ బహుమతి విజేత ధనలక్ష్మి గెలుపొందడం జరిగింది.డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఖాళీ స్థలం కబ్జా చేసిన మున్సిపల్ ఉద్యోగి?

మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు చేసిన కాలనీ వాసులు

బల్దియా అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఇంటి నంబర్ పొందిన సదరు మున్సిపల్ ఉద్యోగి

నేటిధాత్రి, వరంగల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్, హన్మకొండ మండలం, ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో ఖాళి ఫ్లాట్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వరంగల్ మున్సిపాలిటి ఉద్యోగి మీద స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు, కాలనీకి సంబందించినటువంటి పెద్దలు కలిసి సోమవారం నాడు వరంగల్ మునిసిపల్ కమీషనర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖాజీపేట గ్రామ శివారు సర్వే నెం.93 ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో 400గజాల భూమి కీ.శే గాదె పాపిరెడ్డి యొక్క నివాస స్థలం అని, ఈ స్థలాన్ని అక్రమంగా కాజేయాలనే ఉద్దేశంతో మునిసిపల్ కార్పొరేషన్ లో పనిచేసే నరేందర్ అనే ఉద్యోగి, 2003లో దొంగ నోటరీ డాకుమెంట్స్ తయారు చేసి, ఓనర్ ద్వార కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ నోటరీ డాకుమెంట్స్ చేసి అతని బందువుల పేరు మీద ఇంటి నెంబర్ (24-3-78/3/ఏ) తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేసే బేర నరేందర్, అదే మునిసిపల్ ఉద్యోగులను, అధికారులను తప్పుదోవ పట్టించి ఖాళీ స్థలంలో ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉన్నట్టుగా చూపించి ఇంటి నంబర్ తీసుకున్నాడు అని బాధితులు తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై, నోటరితో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇట్టి తప్పుడు రిజిస్ట్రేషన్ పైన స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్ ను కలిసి అక్రమ ఇంటినంబర్ మీద సమగ్ర విచారణ జరిపించి కేటాయించబడిన ఇంటి నెంబర్ రద్దు చేయాలని స్థానికులు కమీషనర్ కి ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. కమీషనర్ సానుకూలంగా స్పందించి విషయాన్ని వెంటనే విచారణ చేసి, నివేదిక సమర్పించుటకు గాను, స్థానిక ఖాజీపేట డిప్యూటీ కమీషనర్ రవీందర్ కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

చట్టాలను ఉల్లంఘించిన జిల్లా పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోండి!!

జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి పిర్యాదు!!

చట్టాలను, కమీషన్ తీర్పులను లెక్క చేయని జిల్లా పంచాయతీ అధికారులు!!!

విధుల్లోనూ నిర్లక్ష్యం – అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం బే ఖాతర్!!!

ప్రత్యర్థులతో పంచాయతీ అధికారుల కుమ్మక్కు – అవినీతిపై అనుమానాలు…?!!

ఉద్దేశ్య పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ!!

జగిత్యాల నేటి ధాత్రి

చట్టాలను ఉల్లంఘించి, అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేసి, పాలనలో పారదర్శకంగా లేని జిల్లా పంచాయతీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ ఉద్యమకారుడు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ అయిన చుక్క గంగారెడ్డి సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.
జగిత్యాల జిల్లా పంచాయతీ కార్యాలయంలోని అధికారులు
చట్టాలను, కమీషన్ తీర్పులను, జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రత్యర్థులతో కుమ్మక్కై కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించి సమాచారం కూడా ఇవ్వక పోవడం బాధాకరం అన్నారు.
గత నాలుగేండ్ల నుండి అనేక సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీళ్ళు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్నాయన్నారు. తేది: 13-09-2023న జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన విచారణ నోటీసు లేఖ నం. ఎఫ్ 2/260/2023 తో
సమాచార హక్కు చట్టం – 2005 సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీలు పై అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత తేది: 30-09-2023 న ఇరువర్గాలతో విచారణ చేపట్టడం జరిగిందన్నారు.
సమాచారం ఇవ్వడంలో విఫలమై, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, చట్టాలను కూడా ఉల్లంఘించి, కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా సమాచారం ఇవ్వలేదని జిల్లా పంచాయతీ అధికారులపై జిల్లా అదనపు కలెక్టర్ అదే విచారణ సమయంలో తీవ్రంగా మండి పడ్డారని చుక్క గంగారెడ్డి వివరించారు. తక్షణమే దరఖాస్తు దారుడు కోరిన పూర్తి సమాచారం తగిన ఆధారాలతో సహా అందజేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారని ఆయన తెలిపారు.
అప్పటి నుండి అనగా గత ఆరు నెలల నుండి తాను అనేక సార్లు సంబంధిత అధికారులతో పాటు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా తాను కోరిన సమాచారం ఇవ్వాలని సంప్రదించడం జరిగిందన్నారు. అయినా నేటికీ తాను కోరిన సమాచారం అందజేయడంలో పంచాయతీ అధికారులు, ఇప్పించడంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తాను పిర్యాదు చేసిన ప్రత్యర్తులతో జిల్లా పంచాయతీ అధికారులు కుమ్మక్కై, అవినీతికి పాల్పడి ఇలా చేసి ఉంటారని ఆయన పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చట్టాలను ఉల్లంగించి, కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా సమాచారం ఇవ్వకుండా వ్యవహరించి, విధుల్లో కూడా నిర్లక్యం చేసి, జిల్లా అదనపు కలెక్టర్ చట్టబద్దంగా చేపట్టిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుల విచారణ ఆదేశాలను సైతం భే – ఖాతర్ చేసిన జిల్లా పంచాయతీ కార్యాలయంలోని సమాచార అధికారిపై, అప్పిలేట్ అధికారిపై చట్టపరంగా తగు కఠిన చర్యలు తీసుకొని మాకు సరైన న్యాయం చేస్తూ, నేను కోరిన పూర్తి సమాచారం వెంటనే ఇప్పించాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు

బీ ఆర్ ఎస్ నియోజవర్గ సమావేశంను విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ముత్తారం :- నేటి ధాత్రి

బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో ,మంథని నియోజక వర్గ ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జరిగే మంథని నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి తెలిపారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా 16.04.2024 మంగళవారం రోజున ఉదయం 11.00 గంట లకు పార్లమెంటు ఎన్నికల విషయమై మంథని ఎస్.ఎల్.బి ఫంక్షన్ హాల్ సమావేశం ఉంటుందన్నారు పార్లమెంటరీ ఎన్నికలలో గెలుపు పార్టీ పటిష్టత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు,మండలంలోని వివిధ హోదాల్లో గల యువత, మహిళా బీసీ, ఎస్ సి, ఎస్ టి,మైనారిటీ నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలని కిషన్ రెడ్డి తెలిపారు

కుంచెతో కలల ప్రపంచాన్ని సృష్టించేవాడే కళాకారుడు

నెక్కొండ, నేటిధాత్రి :

నేటి ఆధునిక ప్రపంచం లొ కుంచెతో వ్యక్తుల ప్రతిబింబాలను చిత్రీకరించి రంగుల ప్రపంచాన్ని సృష్టించి అందులో విహరించేవాడే కళాకారుడని వరల్డ్ ఆర్ట్స్ డే సందర్భంగా నెక్కొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టిస్ట్ కాలువచర్ల రఘు, ఈదునూరి సాయి కృష్ణ, లు అన్నారు. కుంచెతో మెము వేసే చిత్రాలు, అన్ని మతాలవారు పూజించే దేవుళ్ళ విగ్రహాలను ఆ విగ్రహాల నుండీ తేజస్సు ఉట్టిపడే లా తీర్చిదిద్దే కుంచె మాదని ,మా కుంచె మేము అన్ని మతాల దేవుళ్లను మా ఉంచే తో మేము స్పర్శిస్తామని ఇది ఒక వరముగా మేము భావిస్తున్నామని వారన్నారు.వ్యాపారాల ప్రకటనలు, రాజకీయ పార్టీల గుర్తుల ప్రకటనలతో వారి జీవితాలు ఒక మెలుగు వెలుగుతాయి కానీ కళాకారుల మైన మమ్మల్ని ఏ ప్రభుత్వాలు, ఏ ప్రజా ప్రతినిధి ,ఏ అధికారి , పట్టించుకోకుండా ఎలాంటి ప్రోత్సాహం చేయూత,ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి, కానీ కుంచె ను నమ్ముకున్న మాకు ఆ కుంచే జీవనాధారం అవుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్యశాఖలో అవినీతి జలగలు :ఎపిసోడ్‌ – 1 వైద్యానికే ఆమె అవినీతి రోగం!

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/3

సీఎం రేవంత్‌ గారు మీరు చర్యలు తీసుకోవాలంటే… ఈ అవినీతి అధికారిపై ఇంకా ఎన్ని పత్రికలు కథనాలు రాయాలి!?

`ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి!

`నిధుల దుర్వినియోగంలో ఆమెకు లేదు పోటీ!

`ఆరోగ్య నిధులు పక్కదారి పట్టించడంలో ఆమే మేటి!

`ఆసుపత్రులకు నాసిరకం రంగుల ఊసరవెళ్లి!

`ఉద్యోగులకు కులం పేరుతో దూషించడం ఆమెకు పరిపాటి.

`ఏడాది పాటు డిప్యూటేషన్‌…ఐదేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఉద్యోగం!

`గత ప్రభుత్వంలో ఇద్దరి ఆశీస్సులు.

`ఈ ప్రభుత్వంలో ఇద్దరి అండదండలు.

`వైద్య నిధుల దుర్వినియోగంలో ఆమెదే పైచేయి?

`అటు అవినీతి… ఇటు కుల దురంహంకారం ఆభరణాలు.

`జిల్లా వ్యాప్తంగా అనేక ఆరోపణలు.

`ఆమె డాక్టర్‌…భర్త కాంట్రాక్టర్‌!

`నలుగురు ఉద్యోగులతో కలిసి నిధులు గోల్‌ మాల్‌!

` ఆదివాసుల వైద్య నిధులతో కుర్చీలు, బల్లలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
వైద్యశాఖలో అవినీతి జలగలు పెరిగిపోతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన చేతులతోనే అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. వైద్యం చేయాల్సిన చేతులతోనే కొంత మంది లంచాలు తీసుకుంటున్నారు. నిజాయితీగా పనిచేసేవారిని పెద్ద కుర్చీలలో కూర్చొని వేధిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన విధుల్లో వుంటూ, ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేస్తున్నారు. వైద్యశాఖకు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. నిధులు మాయం చేస్తున్నారు. అవినీతికే మాయని మచ్చలౌతున్నారు. ప్రజల వైద్యం కోసం, వైద్య సదుపాయాల కోసం కేటాయించే నిధులను స్వీయ సంతర్పణలు చేసుకుంటున్నారు. పేదల నిధులు కొల్లగొడుతున్నారు. కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ప్రజలకు ప్రజా వైద్యం దూరం చేస్తున్నారు. ఇదిలా వుంటే కింది స్ధాయి ఉద్యోగులను కాల్చుకుతింటున్నారు. వేదించుకు తింటున్నారు. వారిని ఉద్యోగపరమైన ఇ బ్బందులకు గురి చేస్తున్నారు. వారిని పురుగులకన్నా హీనంగా చూస్తున్నారు. వారిపై బూతుల పంచాంగం వల్లె వేస్తున్నారు. నోరు తెరిచి అనరాని మాటలంటున్నారు. వినకూడని బాషను ప్రయోగిస్తున్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. పైగా కులాల పేరుతో దూషిస్తున్నారు. మమ్మల్నేవరూ ఏమీ చేయలేరంటూ తమ అధికార మదం చూపిస్తున్నారు. పాలకపెద్దల అండదండలతో అవినీతి రాజ్యమేలుతున్నారు. అలాంటి వారిలో ఆమె అవినీతి తిమింగలం…భద్రాద్రి జిల్లా వైద్యశాఖలో అందరూ అంటున్న మాట!
ఆమె భద్రాద్రి జిల్లా వైద్య ఉన్నతాధికారి.
ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక ఏడాది కోసం డిప్యూటేషన్‌పై వచ్చారు. గత కన్నేళ్లుగా భద్రాద్రిలోనే తిష్టవేశారు. అప్పటినుంచి ఆడిరది ఆట, పాడిరది పాటగా మల్చుకున్నారు. పదిహేను లక్షలు పెట్టి వచ్చినట్లు ప్రచారంలో వుంది. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, విధుల నిర్లక్ష్యంతో, నిధుల దుర్వినియోగంతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సంపాదిస్తున్నారు. జనం సొమ్మును మళ్లించుకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి. గతంలో అర్హత లేని ఓ ముగ్గురు దగ్గర సొమ్ములు తీసుకున్నారు. నిజమైన అర్హులకు అన్యాయం చేశారు. ఒక్కొక్కరి వద్ద మూడు లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో, నియామకాలు జరిగిన వారిచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చేశారు. వారిని కొలువుల నుంచి తొలగిస్తూ, నియామకాల నుంచి తామే స్వచ్చందంగా తప్పుకుంటున్నట్లు మరీ రాయించుకొన్నారని సమాచారం. నిధుల దుర్వినియోగంలో ఆమెను మించిన వారు లేదన్నది భద్రాద్రి జిల్లాలో వినిపించే మాట. భద్రాద్రి జిల్లా లో వున్న 29 ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, 5 అప్పర్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటరున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫేస్‌ బ్రాండిరగ్‌ పేరుతో రంగులు వేయించడానికి భద్రాద్రి జిల్లాకు రూ.47.45లక్షలు మంజూరు చేసింది. అయితే ఆమె ఎలాంటి టెండర్‌ ప్రకటన జారీ చేయకుండా, ఓ వ్యక్తికి రంగులు వేసే బాద్యత అప్పగించింది. అతనే ఆమె భర్త. ఆమె డాక్టర్‌. ఆయన కాంట్రాక్టర్‌. దాంతో ఎలాంటి టెండర్‌ ప్రకటన లేకుండానే జిల్లాలో వున్న ప్రైమరీ హెల్త్‌ సెంటర్లకు, అప్పర్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లకు రంగులు వేసే కాంట్రాక్టు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్‌ నాసిరకం రంగులు వేయించారు. ఇది పెద్దఎత్తున దుమారం రేగింది. నేరుగా తన భర్తకే కాంట్రాక్టు ఇచ్చిన సంగతి అందరికీ తెలియండంతో నిధులన్నీ సంబందిత హెల్త్‌ ఆపీసర్ల అకౌంట్లో వేయించి, వారి ద్వారా తన భర్తకు బిల్లులు చెల్లించినట్లు లెక్కలు చూపారు. మొత్తంగా నిధులు గోల్‌ మాల్‌ చేశారు. కాజేశారు. వేసిన రంగులు వెలిసిపోయాయి. హెల్త్‌ సెంటర్లు వెలవెల బోతున్నాయి. నిధులు దారి మళ్లించడంలో ఆమెకు ఆమే సాటి అందుకే ఉద్యోగులు అంటుంటారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల వైద్యం కోసం సుమారు. 83లక్షల రూపాయలు నుంచి జిల్లాకు మంజూరయ్యాయి. వాటిని ఆదివాసీల వైద్యం కోసం ఉపయోగించాల్సిందిపోయి, ఆ నిధులను పక్కదారి పట్టించి, కొన్ని బల్లలు, కుర్చీలు కొనుగోలు చేసి, నిధుల బోంచేశారు. ఖజానా ఖాళీ చేశారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట.
ఇక ఉద్యోగులంటే ఆమెకు ఎంత చిన్న చూపంటే మాటల్లో చెప్పలేం.
కింది స్ధాయి ఉద్యోగులను నోటికొచ్చినట్లు తిడుతుందంటున్నారు. కులం పేరుతో దూషిస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందని, పది మందిలో పరువు పోయేలా మాట్లాడుతుందని కన్నీటి పర్యంతమౌతున్నారు. కుల దురహరంకారంతో ఆది వాసీ ఉద్యోగులను పురుగుల కన్నా హీనంగా చూస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఓ ఇద్దరు పెద్దలు ఆమెకు ఆశీస్సులు వుండడంతో ఆమె డిప్యూటేషన్‌ మీద భద్రాద్రి జిల్లాకు వచ్చింది. డిప్యూటేషన్‌ అన్నది కేవలం ఒక్క ఏడాది కాలం వరకే వుంటుంది. తర్వాత డిప్యూటేషన్‌ కొనసాగించడానికి నిబంధులు ఒప్పుకోవు. కాని పాలక పెద్దల పుణ్యమా? అని నిబంధనలు కూడా బేకాతరు చేస్తూ ఆమెకు డిప్యూటేషన్‌ పొడిగిస్తూ వస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కూడా ఓ ఇద్దరు అండదండలతోనే ఇంకా ఆ కుర్చీలో కొనసాగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ నలుగురు ఉద్యోగులను రింగ్‌గా మార్చి వారి చేత నిధుల దుర్వినియోగం పనులు పురమాయిస్తుందని అంటున్నారు. ఆ రింగ్‌లో వున్న ఓ ఉద్యోగి కారుణ్య నియామకంలో ఆమె ఆశీస్సులతో చేరారు. తప్పుడు దృవపత్రాలతో ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఆమె కనుసన్నల్లో పనిచేసే ఆ ఉద్యోగులు కూడా లక్షలాది రూపాయల దుర్వియోగంలో పాలు పంచుకుంటున్నారని విమర్శలున్నాయి. వైద్య శాఖ నుంచి అందే నిధులన్నీంటికీ దారి మల్లించడమో, దుర్వినియోగం చేయడమో చేసి పేదలకు వైద్యం కూడా దూరం చేస్తున్నారనేది వారిపై వున్న ప్రధాన ఆరోపణ. ప్రైవేటు ఆసుపత్రులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తూ, ఆసుపత్రుల అభివృద్ది నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. డిప్యూటేషన్‌ విషయంలోనూ ఆమె రూ.15 లక్షలు సమర్పించుకొని వచ్చిందనేది అందరూ చెప్పుకుంటున్న మాట. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. వైద్య శాఖక కళంకం తెస్తున్న ఇలాంటి వారి పట్ల కఠినంగా వుండాల్సిన అసవరం వుంది. అదేంటో గాని ఈ మధ్య అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మహిళలలే ఎక్కువగా వుంటున్నారు. ఇది నిజంగా బాధాకరం. మహిళలు ఉన్నత స్ధానాలలో వుంటే, అవినీతికి ఆస్కారం వుండదన్న నమ్మకం సమాజంలో వుండేది. అందుకు భిన్నంగా వెలుగు చూస్తున్న వాస్తవాలలో మహిళా అధికారులే కనిపించడం గమనార్హం. అన్ని శాఖల్లో ఇలాంటి వారు కొంత మంది వుండడం మూలంగా మొత్తం మహిళా ఉద్యోగ వ్యవస్ధకే మచ్చ తెస్తున్నారు. వైద్య వ్యవస్ధలో మహిళా ఉద్యోగులుంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అనుకుంటాం. ఉన్నత స్ధానాల్లో వుంటే అవినీతికి ఆస్కారం వుండదనుకుంటాం. కాని కొంత మంది ఇలాంటి ఉద్యోగుల మూలంగా మహిళా ఉద్యోగులు తలెత్తుకోలేకపోతున్నారు. వైద్య శాఖలో వుండే మహిళా వైద్యులను అమ్మగా కొలుస్తాం. ప్రజల సమస్యలను ఓపికగా వింటారని ఆశిస్తాం. మెరుగైన వైద్యం ఆశిస్తాం. కాని వైద్యం మానేసి, ప్రజలకు సేవ చేయడం వదిలేసి, విధులను పక్కన పెడేసి, నిధుల వ్యవహరం మాత్రమే చూసుకుంటున్నారు. వైద్యశాఖను నిర్వీర్యం చేస్తున్నారు. పేదలకు వైద్యం దూరం, భారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకే కొత్త ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెడితే భద్రాద్రి నుంచే మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా వైద్యాధికారి తిన్న సొమ్ముంతా కక్కించాలని కోరుకుంటున్నారు. ఆమె అవినీతిపై దర్యాప్తు చేయించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

జైపూర్ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డికి ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ భూములను కోల్పోతున్న రైతులు గ్రామస్తులు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా వ్రాసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వినతి పత్రంలో చేర్చిన అంశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో జైపూర్ మండలంలోని నర్వ గ్రామ శివారు నుండి మొదలుకొని గోపాలపూర్ శివారు వరకు మధ్య గల అన్ని గ్రామాల శివారులలో గల భూములను రైతులు కోల్పోతున్నారని, కోల్పోతున్న భూమికి నష్టపరిహారంగా చాలా తక్కువ మొత్తాన్ని వెలకట్టి ఇస్తూ నోటీసులు జారీ చేశారని, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం మా యొక్క భూములు 40 లక్షల రూపాయల నుండి మొదలుకొని కోటి రూపాయల వరకు అమ్మకపు ధర పలుకుతున్నాయని తెలిపారు. ఇంతకుముందు అదే గ్రామ శివారులలో పార్వతి బ్యారేజ్ నిర్మాణంలో భూములను కోల్పోతే అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2017 వ సంవత్సరంలో ఎకరానికి గాను 8,20,000(ఎనిమిది లక్షల ఇరవై వేలు)వేల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించారని, అప్పటినుండి ఇప్పటివరకు గడిచిన 8 సంవత్సరాల కాలంలో బహిరంగ మార్కెట్ లో భూముల విలువ ఐదు రెట్లు అధికంగా పెరిగిందని తెలిపారు. ఇదే జైపూర్ మండలంలోని టేకుమట్ల,ఇందారం గ్రామాల శివారులలోని భూములు సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కోల్పోతే సింగరేణి సంస్థ ఎకరానికి గాను 24 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించిందని తెలిపారు. అలాంటిది మాకు మాత్రం అతి తక్కువగా ఎకరానికి గాను 4,31,000 రూపాయలు మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడం చాలా దారుణమని వాపోయారు. కావున ప్రభుత్వం మా భూములకు బహిరంగ మార్కెట్ లో గల ధరను దృష్టిలో ఉంచుకొని, మా మనుగడకు ముఖ్యమైన భూములను కోల్పోతున్న రైతు కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకొని నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. మా మనవిని అంగీకరించని యెడల ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఇవ్వడం జరగదని, రైతులందరం ఒక్కటై ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,భూములు కోల్పోతున్న రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది: ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమా వేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇంఛార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభు
త్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జేరిపె టి జైపాల్ తో కలిసి పాల్గొన్న కూక ట్పల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు( జి.వి.ఆర్) అన్న. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ కమిటీలు అనుసరించాల్సిన విదివిదానాలా పైన బూత్ కమిటీ
సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 123 డివిజన్ సీనియర్ నాయకులు కూన
సత్యంగౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయ కురాలు శిరీష సత్తూర్,క్రిష్ణకుమా రి,శారద,సాదా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానము

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలో గల రామాలయం ఆలయంలో ఈనెల 17 వ తేదీ బుధవారం రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఈనెల 18 వ తేదీ గురువారం రోజున జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు రావాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త అనంతుల భూమయ్య, రామాలయ అర్చకులు తిరునాహరి సత్యనారాయణ చార్యులు, గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, గురిజాల బుచ్చిరెడ్డి, ముస్కు కొండల్ రెడ్డి, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, సాతల్ల ఎల్లయ్య, ఏడ గొట్టి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఏ ఎస్ ఆర్ గార్డెన్ (కుందురు పల్లి ) నందు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలోనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ,వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాసనసభ్యులందరు భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి
పాల్గొంటారు.కావున కాంగ్రెస్ పార్టీ గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు ,బూత్ ఎన్ రోలర్స్ మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ కోరారు

ఎస్పీ కార్యాలయం రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నేటి ధాత్రి

ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.సెక్టార్ల వారీగా ఇన్చార్జ్ అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.సుమారుగా 2000 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలియజేసారు.భక్తుల కొరకు పార్కింగ్ స్థలాలు,లడ్డూ కౌంటర్లు,సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసుల తరపున ప్రత్యేకంగా ఒక QR కోడ్ ను, అదేవిదంగా ఆన్లైన్ లింకు ( https://bhadrachalam.netlify.app ) ను రూపొందించడం జరిగిందని తెలిపారు.కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.

ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు : ఐజీ ఏవీ రంగనాథ్

హసన్ పర్తి / నేటి ధాత్రి

వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు అందడంతో ఆదివారం రంగనాథ్ స్పందించారు.మల్టీజోన్–1 జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థల ప్రాంగణాల్లో జిల్లాల ఎస్పీలు సోదాలు చేపట్టారు. ఈ మేరకు ఐజీ ఆఫీసు ప్రెస్ నోట్ వెలువరించింది. దాడుల్లో వడ్డీ వ్యాపారుల ఇండ్లు, సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నగదు
బంగారం, విలువైన డాక్యుమెంట్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుల్లో అందజేయడంతో పాటు డబ్బును ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 3 రోజులుగా దాడులు చేపట్టామని వెల్లడించారు.

విద్యార్థుల సమస్యలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా : మంద నరేష్

హసన్ పర్తి / నేటి ధాత్రి

తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పోరాడిన వారికి ఏ రాజకీయ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించలేదని ఏ బి ఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు కావున విద్యార్థులు, ఉద్యమ కారులు తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

తెలంగాణ ప్రజా గొంతుక నేను. -కరీంనగర్‌లో నాదే విజయం.

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/4

ఎంపిగా కరీంనగర్‌ ప్రగతికి మార్గం వేసాను.

కరీంనగర్‌ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌.

బిఆర్‌ఎస్‌ కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం.

తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్‌ఎస్‌.

తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టింది కేసిఆర్‌.

తెలంగాణ తెచ్చి అన్నపూర్ణగా మార్చింది కేసిఆర్‌.

బంగారు తెలంగాణ చేసింది కేసిఆర్‌.

నాలుగు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్‌.

అరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్‌.

పచ్చగా వున్న రైతును మళ్ళీ గోసపుచ్చుకుంటున్నది కాంగ్రెస్‌.

పచ్చగా కళకళలాడిన తెలంగాణను ఎడారి చేస్తోంది కాంగ్రెస్‌.

పదేళ్ళలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు.

రూపాయి నిధులిచ్చింది లేదు.

బిజేపి ఎంపి. పైసా తెచ్చింది లేదు.

తెలంగాణ ఉద్యమంలో వున్నది నేనే.

కరీంనగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది నేనే.

ఒక్కసారి కరీంనగర్‌ ప్రజలు బిజేపిని నమ్మితే ఒక్క పని చేయలేదు.

ఎంపిగా తెలంగాణ సమస్యలు అనేకం కేంద్రం దృష్టికి తెచ్చింది నేను.

కేంద్ర నిధుల కోసం కొట్లాడిరది నేను.

కరీంనగర్‌ లో ఓట్లడిగే నైతికత కాంగ్రెస్‌, బిజేపిలకు లేదు.

ప్రజల్లో వారికి గుర్తింపు లేదు.

తెలంగాణ ప్రజల గుండెలు పిండుతున్న ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు.

పార్లమెంటు ఎన్నికలలో కారుదే జోరు.

నమ్మిన ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌ నైజం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇస్తామని చెప్పి పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను గోస పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. గెలిచేదాక తెలంగాణ జపం చేసి, గెలిచాక తెలంగాణను మోసం చేయాలని చూసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. దాంతో కాంగ్రెస్‌ మెడలు వచ్చి, తెలంగాణలో ఉద్యమం రగిలించి, ప్రజల గుండెల నిండా తెలంగాణ నినాదాన్ని నింపింది కేసిఆర్‌. తెలంగాణకోసం ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించింది కేసిఆర్‌. సాధించిన తెలంగాణన అన్న పూర్ణ చేసింది కేసిఆర్‌. తెలంగాణ బతుకును బంగారంగా మార్చింది కేసిఆర్‌. పదేళ్ల తర్వాత మరోసారి తెలంగాణను మాయ చేసి, మభ్యపెట్టి అలవి కాని హామీలతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తన వెనకటి గుణాన్నే చూపిస్తోంది. తెలంగాణ ప్రజలను వంచనకు గురి చేస్తోంది. తన నీతి మాలిన తనాన్ని వదులుకోలేదని మరోసారి నిరూపిస్తోంది. తెలంగాణ ప్రజలను మళ్లీ బాధల్లోకి నెట్టేస్తోంది. ఒక్కనాడు కూడా తెలంగాణ అనని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, తెలంగాణను మళ్లీ ఆగం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు తెలంగాన అంటే అర్ధం కూడా తెలియదు. తెలంగాణ అస్ధిత్వం ఎంత గొప్పదో తెలియదు. తెలంగాణ ఆత్మ గౌరవం అంతకన్నా తెలియదు. కేవలం డిల్లీ నాయకులకు ముందు మోకరిల్లడం తప్ప కాంగ్రెస్‌ నాయకులకు మరేం తెలియదు. పదవులుంటే చాలు, అదికారముంటే చాలు తెలంగాణ ప్రజలు ఏమైపోయినా ఫరవాలేదనుకునే గుణం కాంగ్రెస్‌పార్టీది. ఆ పార్టీ నాయకులది. ఓ వైపు తెలంగాణ గొంతెండుతుంటే కూడా పట్టించుకునే తీరిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు. తెలంగాణ పల్లెకు నీటికి గోస పడుతుంటే వినే ఓపిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు. అందుకే పల్లెలు ఏడుస్తున్నాయి. కాంగ్రెస్‌కు శాపనార్ధాలు పెడుతున్నాయి. ఇక బిజేపి తెలంగాణ చేసిందేమీ లేదు. తెలంగాణ మేలు కోరిందేనాడు లేదు. పదేళ్లలో బిజేపి తెలంగాణకు తీరని అన్యాయమే చేసింది. పదేళ్లలో బిజేపి ఇచ్చిన నిదులు లేవు. చేసిన అభివృద్ది లేదు. మాటలు కోట దాటించి, ప్రజలను మతం మత్తులో ముంచి, ఓట్లు దండుకోవడం తప్ప, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బిజేపి చేసిందేమీ లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బిజేపిని కూడా నమ్మే పరిస్ధితుల్లో లేరు. తెలంగాణ ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే…ప్రజల గుండెల్లో వున్నది కేసిఆరే..అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కారుకు ఎదురులేదని, తెలంగాణ ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే అని నిరూపణ జరగబోతోందని, కాంగ్రెస్‌, బిజేపిలకు తగిన గుణ పాఠం తప్పదని అంటున్న కరీంనగర్‌ పార్లమెంటు అభ్యర్ధి బోయిన పల్లి వినోద్‌ కుమార్‌తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుకు వివరించిన ఎన్నికల ప్రచార విశేషాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు ఆయన మాటల్లోనే…

నేను తెలంగాణ గొంతుకను. తెలంగాణ కోసం కేసిఆర్‌తో కలిసి సాగాను. గతంలో ఎంపిగా కరీంనగర్‌ ప్రగతినికి మార్గం వేశారు. దేశంలోనే ఎక్కువగా పార్లమెంటుకు హజరైంది నేనే. అదంరికన్నా ఎక్కువగా తెలంగాణ సమస్యలు ప్రస్తావించి, పరిష్కరించేందుకు ప్రశ్నించి, సమస్యల సాధనుకు, అభివృద్దికి నిధులు తేవడం కోసం కొట్లాడాను. కరీంనగర్‌ అభివృద్దికి బాటలు వేశాను. తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌ పార్టీ. అందుకే తెలంగాణ సాధించింది. తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పలాలు అందించింది. అంత గొప్పది బిఆర్‌ఎస్‌ పార్టీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ చేసిన అధ్భుత ప్రగతి ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయలేదు. డెబ్బె ఏళ్లుగా వెనకకు నేట్టేయబడి, ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణ పౌరులుగా బతికిన తెలంగాణ ప్రజల్లో ఆత్మ గౌరవం నింపింది కేసిఆర్‌. అభివృద్ది బాటలు వేసింది కేసిఆర్‌. పదేళ్లలో పల్లెల రూపు రేఖలు మార్చాడు. ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలను సస్యశ్యామలం చేశాడు. కరీంనగర్‌ను అన్నపూర్ణగా మార్చాడు. పదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ ఇక భవిష్యత్తు లేదని ఎలాగైనా అధికారంలోకి రావాలని 420 హమీలు ఇచ్చింది. అప్పుడు ప్రజలకు అనుమానం వచ్చింది. కానీ ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలంటూ అబద్దాలను పదే పదే చెప్పి, ప్రజలను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ప్రజలకు చాలా తొందరగానే ఈ విషయం అర్ధమైంది. కాంగ్రెస్‌ అంటే కరువు, కరంటు కోతలే అని కేసిఆర్‌ ఎంత చెప్పినా వినిపించుకోలేదని ప్రజలు మధనపడుతున్నారు. ఎంతో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలను కూడా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసింది. మళ్లీ తెలంగాణను గోస పెడుతోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ బాగోతం బైట పడిరది. ప్రజల సంక్షేమం పక్కన పెట్టి కక్ష్య సాధింపు తప్ప మరేం చేత గాని కాంగ్రెస్‌ నైజం ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణను ఐదేళ్లపాటు గంగాలం చేసిన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసి, తెలంగాణకు కరువు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. రైతుల సంక్షేమం విస్మరించి, తన పంతాలు పట్టింపులతో తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేసింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ చేతిలో ఎంత మోసపోయామో అర్దం చేసుకుంటున్నారు. పంటలకు నీళ్లివ్వక, నాణ్యమైన కరంటు ఇవ్వక రైతుల ఆరుగాలం శ్రమను అక్కరకు రాకుండా చేసిన కాంగ్రెస్‌ పార్టీమీద కసితో వున్నారు. రైతు బంధును రూ.15వేలు చేస్తామని నమ్మించి, అసలుకే ఎసరు పెట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దమౌతున్నారు. రెండు లక్షల రుణమాఫీ పేరుతో ప్రజలు మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్‌ అంటేనే ప్రజలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. పచ్చగా వున్న తెలంగాణను ఎడారి చేసి ఎండబెడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో ఇక నూకలు చెల్లినట్లే.
పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి తెలంగాణకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలంగాణకు విభజన చట్టం హమీలను అమలు చేయాల్సిందిపోయి, తెలంగాణను దగా బిజేపి దగా చేసింది. తెలంగాణలో ఐటి విప్లవానికి తోడు కావాల్సిన ఐటిఐఆర్‌ను గుజరాత్‌ తరలించుకుపోయి, తెలంగాణ యువత నోట్లో మట్టికొట్టిన బిజేపిని తెలంగాణ ప్రజలు సహించేందుకు సిద్దంగా లేరు. కాజీ పేట కోచ్‌ ప్యాక్టరీ మీద మిగిలివున్న ఆశలను వమ్ముచేసి, ఆశలను కూడా తుంచేసిన పార్టీ బిజేపి. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతూ, తెలంగాణ ప్రగతిని అడ్డుకున్న బిజేపి. ఒక వేళ తెలంగాణ ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను నమ్మినట్లు నమ్మితే రైతుల మోటార్లకు మీటర్లు ఖాయం. ఖచ్చితంగా రైతాంగం నుంచి ముక్కుపిండి కరంటు బిల్లులు వసూలు చేయడం తధ్యం. కేసిఆర్‌ పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడిచేసినా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపినా రైతులకు అన్యాయం జరగనివ్వలేదు. కాని కాంగ్రెస్‌, బిజేపిలు రైతులను ఎలా వంచించాలని గోతి కాడ నక్కల్లా ఎదరుచూస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడేది, పోరాటం చేసేది, తెలంగాణ ఆత్మ గౌరవం నిండి వున్నది ఒక్క బిఆర్‌ఎస్‌ పార్టీయే. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజేపిలకు తగిన గుణ పాఠం ప్రజలు నేర్పుతారు. ఆ పార్టీలకు తెలంగాణలో చోటు లేదని నిరూపిస్తారు. ఇక కరీంనగర్‌ విషయంలో బిజేపి ఎంపి నమ్ముకున్న మత రాజకీయమే ఆయనకు కర్రు కాల్చి వాత పెడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, ఆయనలో మానవత్వం మేలుకోవడం లేదు. మతం తప్ప ఆయన నోటి నుంచి మరో పదం రావడంలేదు. ప్రజా శ్రేయస్సు గాలిలో కలిసినా పరవాలేదు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఎన్నికలు రాజకీయం కాచుకోవాలని చూస్తున్న బండి సంజయ్‌కి మరోసారి పరాభవం తప్పదు. కాంగ్రెస్‌కు కరీంనగర్‌లో స్కోపే లేదు. గెలిచేది నేనే. ప్రజలు మావైపే. కేసిఆర్‌ లేని తెలంగాణ పాలన ఎంత ఆగమ్య గోచరంగా వుందో, ఎన్ని గోసలు పడాల్సివస్తుందో ప్రజలకు తెలిసింది. ఒక్కసారి నమ్మినందుకే ఇంతగా బతుకులు పొయ్యిలో వేసుకున్నట్లైంది. ఇంకా ఆ పార్టీలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు. రాజకీయాలు తప్ప, ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్‌, బిజేపిలను ప్రజలు తరిమికొట్టే రోజులు కూడా దగ్గర్లోనే వున్నాయి.

కౌమర దశ కార్యక్రమం పై అవగాహన

గొల్లపల్లి నేటి ధాత్రి:
ఆదర్శ పాఠశాల గొల్లపల్లి యందు ఆడ పిల్లల సాధికారక క్లబ్ ఆధ్వర్యంలో కౌమర దశ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌమర దశలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆడపిల్లల సాధికారత తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు చైల్డ్ హెల్ప్ లైన్, విమెన్ హెల్ప్ లైన్ కు సంబంధించిన విషయాలను కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రోగ్రాం కన్వీనర్ తాడూరి శ్రీనివాస చారి విద్యార్థులకు ఆడపిల్లల సాధికారత సంబంధించిన విషయాలను ప్రధాన వక్తగా తెలియజేశారు. కౌమార దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా కన్వీనర్ తాడూరి శ్రీనివాసచారి, పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తో పాటు తిరుపతి వైస్ ప్రిన్సిపాల్ కాంతం నగేష్, ఎన్ పెద్దన్న, టి రాజేశ్వరి, ఏ సంధ్యారాణి, జి సంధ్య, అర్చన, అన్నపూర్ణ, కె రజిత, ప్రియాంక విద్యార్థులు పాల్గొన్నారు.

జైపూర్ మండల్ పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

జైపూర్ నేటి ధాత్రి

శివాజీ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ సేన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ ఫోటో కి పూలమాలవేసి పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు మరువలేనివని, కుల వివక్షను రూపుమాపి సమ సమాజాన్ని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.ఇట్టి కార్యక్రమంలో శివాజీ సేన వ్యవస్థాపకుడు మంతెన ఉదయ్ కిరణ్, అధ్యక్షుడు మెరిమిడి గణేష్, కోశాధి కారి మంతెన రవితేజ, ప్రచార కార్యదర్శి వేల్పుల సంజయ్,సహ కార్యదర్శి వేముల సాయికిరణ్ గౌడ్, సభ్యులు గణేష్, జనగామ నితిన్ ఎం ఆర్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టేకుమట్ల గ్రామంలో అంబేద్కర్ 133 జయంతి వేడుకలు

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు నాయకులు యువకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు విద్య ఒకటే మార్గం అని అంబేద్కర్ తెలిపిన బాటలో భావితరాలు నడవాలని గ్రామ పెద్దలు మాట్లాడారు.

ఇందారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు

జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది నాయకులు ప్రజలు అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, అపరవిద్యవేత్త, రాజ్యాంగ శిల్పి, ఉద్యమ జ్యోతి అయినటువంటి అంబేద్కర్ చూపించిన బాటలో పయనించి యువత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాల సమీపంలో అడవి దున్నలు

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపురం, మర్రిగూడెం గ్రామాల సమీపంలో అడవి దున్నల మంద వచ్చి మేత మేస్తున్నాయి అది చూసిన బాటసారులు భయందోళన చెందారు గిరిజన రైతులు..ప్రయాణికులు దారి వెంట వెళ్లాడనికి భయపడుతున్నారు

ప్రజా నాయకుడి వెంటే నడుస్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి,ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదర్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.

హైదర్ నగర్ డివిజన్ కు చెందిన బిఆర్ఎ స్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి తండా నుంచి సుమారు 300మంది తో ప్రజా నా యకుడి వెంటే నడుస్తామ ని,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం గ్రహించి ఈరోజు చేవెళ్ల పార్ల మెంట్ సభ్యు లు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, నియోజ కవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచా ర్జ్.జగదీశ్వర్ గౌడ్ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరి గింది.బిఆర్ఎస్ పార్టీ నుండీ కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళ నాయకులు,కార్య కర్తలకు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.టూరిజాం డెవల ప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,ఎం.బి.సి డెవలప్మెంట్ చైర్మన్ జేరిపేటి జైపాల్,కాం గ్రెస్ సీని యర్ నా యకులు కూన సత్యంగౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో జరిగింది.

అమ్మవారి ఆలయంలో అధిక ధరకు టెంకాయల చలామణి.

సోయి లేకుండా వ్యవహరిస్తున్న సంభందిత అధికారులు.

టాప్ లేపిన టెంకాయ ధర..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

అయ్యో.. మెసమ్మ .. మీ మొక్కుబడి తీర్చుకోవడానికి మేము వస్తే.. ఇక్కడ టెంకాయల విక్రయదారులు ధరకు మించి వసూళ్లు చేస్తూ మా చేతికి కుళ్లిన టెంకాయలు ఇస్తున్నారమ్మ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ ఆలయనికి ప్రతి ఆది మంగళ గురువారాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఒకవైపు వ్యాపారులు, మరోవైపు దళారులు మోసానికి పాల్పడుతున్నారు. భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి కి కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ. జాతరలో టెంకాయల విక్రయ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్ తన కడుపు చల్లగుండ టెంకాయలతో పాటు కుళ్లిపోయిన టెంకాయలను సైతం భక్తులకు అంటగడుతున్నాడు.

ఒక టెంకాయ 25 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 30 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. కానీ టెండర్ దారులు ఒక్క టెంకాయ ఇవ్వకుండా రెండు టెంకాయలు కట్టబెట్టి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు.దుకాణదారులు విక్రయించే టెంకాయలలో రెండు మూడింటిలో ఒకటి కుళ్లిపోయి ఉంటున్నట్లుగా భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. మంచి టెంకాయలే అమ్ముతానని హామీ ఇచ్చి మళ్లీ కుళ్లిపోయిన టెంకాయలే విక్రయిస్తున్నాడు. అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా కుళ్లిన టెంకాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నా ఆలయ సీఈవో అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటనీ భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో అక్కడక్కడ కుళ్లిపోయిన టెంకాయలు కుప్పలు తిప్పలుగా పడి ఉంటున్నాయి. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి నాణ్యతతో కూడిన టెంకాయల విక్రయాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version