పరిపాలన దక్షితలో శ్రీరాముడు మేటి అందరికీ శ్రీరాముడు మార్గదర్శి: శేరి సతీష్ రెడ్డి

కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి

శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించి న సీతారాముల కల్యాణ మహోత్స వంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా రు.కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాల నీలోని రెండవ రోడ్డులో గల శ్రీ ఆంజ నేయస్వామి ఆలయంలో జరిగిన సీతా రాముల కల్యాణ వైభవం కార్యక్ర మంలో కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,కాం గ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మల్కా జ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుమార్తె పట్నం మనిషారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లా డుతూ శ్రీరాముడు అన్ని వర్గాలకు ఆదర్శ ప్రాయుడని పరిపాలన అధ్యక్షతన శ్రీరా ముని ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు.శ్రీ సీతారాముల కల్యాణ మహో త్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కుమార్తె మనిషారెడ్డి పాల్గొనడం అభినందనీయ మన్నారు.రాబోయే పార్లమెంట్ కార్యక్ర మంలో పాల్గొన్న కూకట్పల్లి కూకట్ప ల్లి ఇంచార్జ్ బండి రమేష్,పుష్పరెడ్డి, సత్యం శ్రీరంగం,సాదు ప్రతాపరె డ్డి,బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్,శివ పటేల్ గౌడ్ ,శ్రీకాంత్ పటేల్ గౌడ్,రాము, ప్రసన్నకుమార్,అరవింద్రెడ్డి,మేకల మైఖేల్ రేష్మ,మనీ,వాణి,పాల్గొన్నారు. తదితరు లు పాల్గొన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ నేత లు కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.కార్యక్ర మంలో పలువురు కాంగ్రెస్ నేతలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొ న్నారు.

సివిల్స్ లో సత్తా చాటిన సాయికిరణ్ ని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె శంకర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందల సాయికిరణ్ మొదటి ప్రయత్నంలోనే ఇటీవల విడుదలైన యూపీఎస్పి ఫలితాలలో ఆల్ ఇండియా ఇరవై ఏడోవ ర్యాంకు సాధించడంతో సాయికిరణ్ ఇంటికి వెళ్లి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈసందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యానికి ఎంతో ప్రణాళిక బద్ధంగా కష్టపడితే అందరి విజయం అంటూ ఉండదని, విద్యార్థులందరూ సాయికిరణ్ నీ ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, సాయికిరణ్ మన చొప్పదండి నియోజకవర్గానికి చెందినవాడు అయినందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు శుక్రోద్దిన్, పూడూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం
చూద్దాం రారండి
తండోపతండాలుగా తరలివచ్చిన జనం

రామనామ స్మరణతో నిండిపోయిన దేవాలయాలు..

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా, సీతారాముల కళ్యాణం జరిగింది.
ఈ కళ్యాణానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తి పరవశంతో దేవాలయాలు భక్తులతో నిండాయి. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనిల్ శర్మ పూజారి మాట్లాడుతూ రాముని జీవితం దేశానికి ఆదర్శమని, రాముడు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు. కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది వరకు పాల్గొన్నారు.

పోత్కపల్లి లో అంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిదాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రాజ వేణుగోపాలస్వామి మరియు శ్రీ భవాని సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్వర్యంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా రాజ గోపాల స్వామి ప్రధాన అర్చకులు కాండురి శ్రీనివాస చార్యులు మరియు శివాలయ అర్చకులు మల్లోజుల శ్రీనివాస శర్మ, స్వేతన్ శర్మ పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని జరిపించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.అనంతరం మోర్తల సుబ్బారెడ్డి,మల్లికాంబ కుటుంబ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుల్లూరి రాంబాబు,సింగిల్ విండో ఛైర్మెన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,ఎంపీటీసీ రెడ్డి స్వరూప,శ్రీనివాస్,ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి,దాసరి రాజయ్య,మహేష్,కిషన్, బిక్షపతి,అనిల్ మరియు ప్రజలు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి

శ్రీరామనవమి పురస్కరించుకొని ముత్తారం మండలంలోని పలు ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించారు లక్కారంలోని శ్రీ కోదండ రామాలయంలో వేద పండితుల మంత్రోత్సవంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములు కల్యాణ వేడుకలు నిర్వహించారు మండలంలోని ఖమ్మం పల్లి ఓడేడు ముత్తారం కేసనపల్లి తో పాటు పలు గ్రామాలలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు వేద పండితులు రామాయణం గురించి వివరించారు భక్తులు శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు విశేష సంఖ్యలో పాల్గొని అక్షింతలతో దీవెనలు అందుకున్నారు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొని భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీ గెలిపించుకుంటాం: గురు ప్రసాద్

కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటా మని కేపిహెచ్బి కాలనీ డివిజన్
బిజెపి కన్వీనర్ గురు ప్రసాద్ అన్నా రు. కేపిహెచ్బి కాలనీ డివిజన్ బిజెపి కన్వీనర్ గురు ప్రసాద్ నియమి తు లైన సందర్భంగా పలువురు ఆయన కు అభినందనలు తెలియజే జేశా రు.ఈ సందర్భంగా గురు ప్రసాద్ కూ
కట్పల్లి ఇన్చార్జి మాధవరం కాంతా రావుకు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కోకన్వీన ర్ పద్మయ్య,రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ స భ్యులు సూర్యప్రకాష్, పాపయ్య గౌడ్ కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఉన్న సభ్యులందరికీ కలుపుకుని పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేంద ర్ గెలుపుకు కృషి చేస్తామని తెలిపా రు. మన దేశం అన్ని రంగాల్లో అభి వృద్ధి సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రా వాలని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారని దీమా వ్యక్తం చేశారు.అందుకోసం ప్రజలు పార్టీల అతీతంగా ఈటెల రాజేందర్ ను మల్కాజిగిరి ఎంపీగా గెలిపిం చాలని ప్రజలను కోరారు.

శ్రీరామనవమి శుభవేళ… సీతారాముల కల్యాణో త్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించారు అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పుణ్యా వచనం నిర్వహించి వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించినారు అంతకు ముందు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో జిన్నా ప్రతాప్ రెడ్డి కృపాకర్ రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి లెక్కల మదన్మోహన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి గిద్దమారి సురేష్ నాగరాజు విద్యాసాగర్ రాము చంద్రమౌళి నవీను అబ్బు రాజు కృష్ణారెడ్డి దేవరాజు సుమన్ వెంకటయ్య సమ్మిరెడ్డి మురళి రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

నిజాంపేట, నీటి ధాత్రి, ఏప్రిల్ 17

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నీరటి వెంకటేష్ అనే వ్యక్తి నిన్న తేదీ 16- 4- 2024 మధ్యాహ్నం సమయంలో చేపలు పట్టడానికి వెళుతున్నట్టుగా ఇంట్లో చెప్పి వెళ్ళగా ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి అతని కోసం వెతుకుతూ చెక్ డాం వైపు తన బంధువులు వెళ్లి చూడగా అతను చెక్ డాం లో మునిగి చనిపోయి ఉండవచ్చని అనుమానంతో వెతకగా ప్రమాదవశాత్తు చేపలు పట్టే వల కాళ్లకు చిక్కుకొని చనిపోయినట్టుగా ఉన్నది అతని భార్య నేరటి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమయినది

శ్రీరామనవమి కళ్యాణంల్లో పాల్గొన్న కూన సత్యంగౌడ్,ఆవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్

కూకట్పల్లి, ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి

శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా అవని స్వచ్ఛంద సంస్థ వ్యవ స్థాపకురాలు,కాంగ్రెస్ మహిళా నాయ కురాలు శిరీష సత్తూర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్,శ్రీనివాస్ గౌడ్,మదు, మారుతీరావు,మహేష్,గా యత్రి తదితరులతో కలిసి హైదర్నగర్,ఆ ల్విన్ కాలనీ డివిజన్లోని పలు రామాల యాల్ని దర్శించుకుని,శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలలో పాల్గొని,సీతారా ముల కళ్యాణం జరిగిన అనంతరం హైదర్ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద కూన సత్యంగౌడ్ తో కలిసి కళ్యాణానికి హాజరైన భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డిం చి,ప్రజలంతా ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు శిరీష సత్తూరు మీడియా ప్రతినిధితో ఆమె మనసులోని భావాన్ని వ్యక్తపరి చారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు పురోహితు లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రశాంత్ నగర్, హంటర్ రోడ్డులో గల నంది హిల్స్, హాసన్ పర్తి లోని ఆర్ టి సి కాలనీ, వంగపహడ్, ఆరేపల్లి, హన్మకొండ చౌరస్తా, శాయంపేట, నక్కలపల్లి, తిమ్మాపూర్ మరియు మమూనూరు లో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్.
ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా రామ భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు అయోధ్యలో ఆనాడు ఏ విధంగా ధర్మ పాలన అందించాడో దేశంలో మోడీ పాలన కూడా అలాగే సాగుతుంది. కావున దేశానికి మోడీ పాలనే శ్రీరామ రక్ష అని రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమాల్లో బిజెపి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తినేని ధర్మరావు, 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్,
ప్రబారి మురళిదర్ ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు హిందూ భక్తులు పాల్గొన్నారు.

అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం !!

మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణం !!!* శ్రీరామ నామ స్మరణ తో మారు మోగిన పలు ఆలయాలు!!!
ఎండపల్లి నేటి ధాత్రి
శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం లోని గ్రామాలలో ఘనంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం జరిగింది,గుల్లకోట లోని వేణు గోపాల స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది.
సమాజ సేవకులు , విగ్రహ దాతలు ముదిగంటి పద్మ రమణా రెడ్డి దంపతులు పాల్గొని స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం జరిగింది,ఆలయ అర్చకులు ఆరుట్ల రంగా చార్యులు కళ్యాణ మహోత్సవం జరుపగా,ప్రత్యేక అర్చకుల వేద మంత్రోచ్చారణ ల మధ్య అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం జరిగింది,భక్త జనం పెద్దసంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది, అలాగే ఆలయాల వద్ద అన్న దాన కార్యక్రమాలు జరుగడం ,భక్తులు ఎంత గానో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ కార్య క్రమంలో,ఎంపిటిసి సభ్యులు గొల్ల పెల్లి శ్రీజ మల్లేష్ గౌడ్, , స్వాములు మహిళలు,భక్తులు పాల్గొన్నారు,అలాగే కొత్త పేట లో ఘనంగా సీతా రాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది,మరియు రాజారాంపల్లి,కొండాపూర్,పాత గూడూరు , గొడిశెల పేట మొదలైన గ్రామాల్లో కూడా రాముల వారి ఆంజనేయ ఆలయాల్లోఅంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణం మహోత్సవం జరిగింది

కన్నుల పండుగగా సీతారాముల కల్యాణ మహోత్సవం

చందుర్తి, నేటిధాత్రి:

శ్రీరామనవమి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల, కట్ట లింగంపేట లింగంపేట జోగాపూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి ఆధ్వర్యంలో కన్నుల పండగగా శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం హోమం , అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని కార్యక్రమానికి గ్రామ ప్రజలు మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ శ్రీరామచంద్రుని కోరారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మరియు శ్రీ సీతారామ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామ మహోత్సవ వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రజలు మాల ధారణ చేసిన హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇట్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవత మూర్తుల విగ్రహాలను గ్రామంలో వీధి వీధిన పురవీధుల్లో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భారీ ఎత్తున గ్రామంలోని ప్రజలు మహిళలు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం సూర్యనాయక్ తండాగ్రామంలో శ్రీరామనవమి పురస్కరించు కుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అన్ని దానాల లో కన్నా అన్నదానం గొప్పదని సూర్య యూత్ అధ్యక్షుడు లింగునాయక్అన్నారు.హనుమాన్ గుడి ఆవరణలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీఎంపిటిసి రెడ్డి నాయక్,అజ్మీరా దూదా,రఘు,బానోతు రాజు,మాలోతు భాష, సుధాకర్,సునీల్,వినోద్, సూర్యాయూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గుండం శివాలయం లో శ్రీరామ నవమి వేడుకలు

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం పల్లి గుడి తండా శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పండిత్ భానుప్రసాద్ శాస్త్రి వారి దివ్య కరములచే హైందవ సాంప్రదాయ పద్ధతిలో కనుల పండుగ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చలువ పందిళ్ళు ముత్యాల తలంబ్రాలు సన్నాయి మేళాలు దివ్య మంగళ హారతులు
వరుడు రామయ్య తండ్రి వధువు సీతమ్మ తల్లి వారి వివాహము ను చుట్టూ నలు మూలాల గ్రామాల నుండి భక్తులు పోటెత్తారు శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులు కనులారాగాంచిరి తీర్థ ప్రసాదములు పానకం స్వీకరించి మహా అన్నదానంలో పాల్గొని భోజనాలు స్వీకరించారు

ప్రగతిసింగారంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.వచ్చేబ్రహ్మోత్సవాలు కూడా గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కళ్యాణ మహోత్సవం ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన కృషిచేసినగ్రామస్థులకు,నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.

నస్పూర్ సీతారామలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

నస్పూర్ (మంచిర్యాల) నేటిదాత్రి

నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామలయంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా వేద పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అన్న ప్రసాద వితరణను రాచకొండ గోపాల్ రావు వారి సోదరులు నిర్వహించారు ఇంక ఈ కార్యక్రమంలో రాచకొండ వారి కుటుంబ సభ్యులు ఎం పి ఓ శ్రీపతి బాపురావు మల్లేష్ పురుషోత్తం రమేష్ గోపాల్ వెంకటేష్ శంకర్ గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అన్నారు

కనుల పండుగ కళ్యాణ మహోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో ఈరోజు జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రామంలోని వీధి వీధినా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించారు ఇట్టి అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పద్మనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మొర శ్రీకాంత్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు గ్రామ మరియు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీలు..

రాములోరి కళ్యాణంలో మహా అన్నదాన కార్యక్రమాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

గజకేసరి యోగం తో పాటు, ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కోదండ రామాలయంలో ఘనంగా జరిగాయి.రామాలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ నిర్వహించింది, రాములోరి వివాహ మహోత్సవానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ దంపతులు హాజరై సీతారాముల ఆశీర్వాదం పొందారు. పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సీతారాముల కళ్యాణం లో హాజరయ్యారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ విజయ గణపతి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పుర పరిధిలోని గద్దెరాగడి, శేషుపల్లి, దుబ్బపల్లి, కుర్మపల్లి, అమరవాధి, క్యాతనపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాల్లో సైతం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీల సభ్యులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భారీ కూలర్లు మంచినీటి సౌకర్యం మజ్జిగ పంపిణీ క్యూ లైన్ లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సై రాజశేఖర్ ఆలయాల సమీపాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనంతరం ఆలయాలలో మహాఅన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాములోరి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు.

 వనం వీడి జనంలోకి రండి

# కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు

# జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి

# లొంగిపోయిన మావోయిస్ట్స్ ల ఉపాధి మా భాద్యత*

జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐపిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదు. కొంతమంది అగ్ర నాయకులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో సామాన్య ప్రజల జీవితానికి విఘాతం కల్పిస్తూ ఇన్ఫార్మర్ నేపంతో అమాయకపు ఆదివాసులను చంపుతూ, మందు పాతరాలు పేల్చుతూ, తెలంగాణ మరియు చతిస్గడ్ సరిహద్దుల్లో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తునారు తుపాకీ గొట్టం ద్వారా రాజాధికారం సాదించవచ్చు అనే అపోహ వదిలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లోoగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత నేరవేర్చే వ్యక్తిగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ వారు కోరుచున్నారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేయుచున్న నాయకులు మరియు సభ్యులు ములుగు జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును మరియు జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయు చున్నాము సంప్రదించవలసిన నెంబర్లు ఎస్పి ములుగు 8712670100 ఓఎస్డి ములుగు 8712670101ఏఎస్పి ఏటూరునాగారం 8712670104 డి ఎస్ పి ములుగు 8712670103 ఎటువంటి భయాలకు లోను కావద్దు ధైర్యంగా లొంగిపోండి మీ సంరక్షణ – సంక్షేమం మా బాధ్యత. మీ కుటుంబంతో హాయిగా జీవించండి డా. శబరిష్ పి ఐపిఎస్
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

error: Content is protected !!
Exit mobile version