రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందల సాయికిరణ్ మొదటి ప్రయత్నంలోనే ఇటీవల విడుదలైన యూపీఎస్పి ఫలితాలలో ఆల్ ఇండియా ఇరవై ఏడోవ ర్యాంకు సాధించడంతో సాయికిరణ్ ఇంటికి వెళ్లి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈసందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యానికి ఎంతో ప్రణాళిక బద్ధంగా కష్టపడితే అందరి విజయం అంటూ ఉండదని, విద్యార్థులందరూ సాయికిరణ్ నీ ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, సాయికిరణ్ మన చొప్పదండి నియోజకవర్గానికి చెందినవాడు అయినందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు శుక్రోద్దిన్, పూడూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.