ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిదాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రాజ వేణుగోపాలస్వామి మరియు శ్రీ భవాని సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్వర్యంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా రాజ గోపాల స్వామి ప్రధాన అర్చకులు కాండురి శ్రీనివాస చార్యులు మరియు శివాలయ అర్చకులు మల్లోజుల శ్రీనివాస శర్మ, స్వేతన్ శర్మ పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని జరిపించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.అనంతరం మోర్తల సుబ్బారెడ్డి,మల్లికాంబ కుటుంబ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుల్లూరి రాంబాబు,సింగిల్ విండో ఛైర్మెన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,ఎంపీటీసీ రెడ్డి స్వరూప,శ్రీనివాస్,ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి,దాసరి రాజయ్య,మహేష్,కిషన్, బిక్షపతి,అనిల్ మరియు ప్రజలు పాల్గొన్నారు.