నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండల కేంద్రంలో నర్సంపేట పోలీస్ శాఖ సబ్ డివిజన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల దృశ్య పోలీస్ ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సుమారు కిలోమీటర్ మేర పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా ఉన్నారు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఓటు హక్కు శాతాన్ని పెంచుకోవాలని ప్రజలను కోరారు. శాంతి భద్రతలపై ప్రజల్లో నమ్మకం కలిగేందుకు పోలీస్ కవాతు నిర్వహించినట్లు ఏసిపి తెలిపారు.
ఈ కార్యక్రమంలో
దుగ్గొండి సిఐ రాజగోపాల్,నర్సంపేట టౌన్ సిఐ రమణ మూర్తి,నెక్కొండ సిఐ చంద్రమోహన్,దుగ్గొండి ఎస్సై పరమేష్ లతో పాటు నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం
మండలాల ఎస్సైలు రామారావు, అరుణ్ కుమార్, ప్రవీణ్, రఘుపతి, ఏఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.