వనపర్తి లో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు రోడ్లు తొలగించారు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-20T134007.618.wav?_=1

 

వనపర్తి లో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు రోడ్లు తొలగించారు

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి ఎదురుగా

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 33 వ వార్డు లో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి ఇంటి ఏరియా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తరం గేటు ముందర సి సి రోడ్డు నిర్మాణం కొరకు రోడ్డును తొల గించారు అదేవిధంగా నడిరోడ్డుపై మొరం కుప్ప పోసి వదిలారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు కార్లు జీపులు స్కూల్ వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నామని వాహనాల యజమానులు తెలిపారు చాలా రోజుల క్రితం సీసీ రోడ్డు నిర్మాణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఆలయ పూజారులు నివాసము ఉండడానికి క్వాటర్స్ నిర్మాణం కొరకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి నిధులు మంజూరు చేయించారు. పనులు నత్త నడకన సాగడంతో భక్తులు వృద్ధులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు వృద్ధులు తెలిపారు .అదేవిధంగా 15వ వార్డ్ శ్రీ బాలాంజనేయ గుడి దగ్గర సిసి రోడ్ నిర్మాణం కొరకు వనపర్తి ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రారంభించారు రెండవసారి 15వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ వార్డు ప్రజలతో కలిసి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు కిరాణం క్లాత్ మర్చంట్ హోలీ సెల్ వ్యాపార సంస్థలు ఇ క్కడ ఉన్నాయి లారీలు ద్విచక్ర వాహనాలు పాదాచారులు సి సి రోడ్డు నిర్మాణం చేపట్టనందుకు ఇబ్బందులకు గురవుతున్నట్లు 15వ వార్డు ప్రజలు తెలిపారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి కాంట్రాక్టర్ పై విచారణ జరిపి వనపర్తి లో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి ఏరియా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందర సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని 33 అవార్డు ప్రజలు వృద్ధులు ఒక ప్రకటనలో కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version