ఆగస్టు 23న.. అనిరుధ్ ‘హుకుం’! టికెట్లకు భారీ డిమాం.
అనిరుధ్ రవిచందర్ సారథ్యంలో ‘హుకుం’ పేరుతో భారీ సంగీత విభావరి ఆగస్టు 23వ తేదీ జరుగనుంది.రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సారథ్యంలో ‘హుకుం’ (HUKUM) పేరుతో భారీ సంగీత విభావరి ఆగస్టు 23వ తేదీ జరుగనుంది. నగర శివారు ప్రాంతమైన ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్), కూవత్తూరులో ఉన్న ‘మార్గ్ స్వర్ణభూమి’ అనే ప్రాంతంలో జరుగనుంది.
అయితే ఈ షోకు సంబంధించి టికెట్లకు తమిళనాడు నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో రెండు మూడు దఫాలుగా నిర్వహించిన కన్సర్ట్‌లకు మాములుగా రూ.1200 నుంచి మొదలై రూ.13 వేల వరకు ధరలు ఉన్నాయి. కాగా ఇప్పుడు అనిరుధ్ షోలకు హై డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రేట్లు రూ.1500 నుంచి మొదలై రూ. 20 వేల వరకు ఉండవచ్చని అనుకుంటున్నారు.