ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం

ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం

మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న… మార్కెట్ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మార్కెట్ యార్డులో ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రాన్ని కేసముద్రం మున్సిపల్ చైర్మన్ బానోత్ సునీత వెంకన్న చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి
కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు డిహెచ్ఎస్ఓ మరియన్న, జిల్లా ఆయిల్ పేడ్ ఇన్చార్జ్ చిలువేరు దయాకర్ , కేసముద్రం తాసిల్దార్ గుండు వివేక్, ఏ ఎం సి సెక్రెటరీ అమర లింగేశ్వరరావు, పి ఎ సి ఎస్ ధనసరి సీఈఓ జి మల్లారెడ్డి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కేసముద్రం బి వెంకన్న, ఉద్యానవన అధికారి శాంతి ప్రియదర్శిని , ఆయిల్ఫీడ్ సిబ్బంది ,ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నటువంటి అభ్యుదయ రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు
నూతన రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నాము
ఆయిల్ పామ్ ఉద్యాన పంటల సాగు లాభదాయకం
పంట మార్పిడితో అధిక ఆదాయం
ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, మామిడి కాయలకు ఫ్రూట్ బాగింగ్ మరియు రాయితీలు
వేసవిలో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్దతులు

జిల్లాలో ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాలు – కందికొండ గ్రామం కురవి మండలం, హరిపిరాల గ్రామం తొర్రూరు మండలంతో పాటు ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ, కేసముద్రం వారి సహకారంతో మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది.

వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలకి బదులుగా మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మునగ, ఉల్లి, వెల్లుల్లి, పూలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేయాలి.

ఎలాంటి మార్కెట్ ఇబ్బందులు, కోతులు, కుక్కలు, దొంగలు బెడదలేని మరియు ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ఆయిల్ పామ్ పంట రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఎకరానికి లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని ఆయిల్ పామ్ ఆదర్శ రైతు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి రైతులకు తెలిపినారు. ఆయిల్ పామ్ పంట సాగు గురించి రైతులకు అవగాహన చేసినారు.
అదే విధంగా అభ్యుదయ రైతు బొబ్బల యాకుబ్ రెడ్డి ఆయిల్ పామ్ పంటలలో ఎక్కువ దిగుబడి పొందే విషయం లో తీసుకోవలసిన జాగ్రత్త ల మీద వారి అనుభవాన్ని రైతులతో పంచుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version