ఓ సైనికా.. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు..

 ఓ సైనికా.. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు.. బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందే..

 

మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ హృ‌దయ విదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఓ బిడ్డ పుట్టిన గంటల వ్యవధిలోనే స్మశానానికి వచ్చి తన తండ్రిని చివరి చూపు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన భార్య స్ట్రెచర్ మీదనే స్మశానికి వచ్చి భర్తను చివరి చూపు చూసుకుంది.మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ హృ‌దయ విదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ బిడ్డ స్మశానానికి వచ్చి తన తండ్రిని చివరి చూపు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన భార్య స్ట్రెచర్ మీదనే స్మశానికి వచ్చి భర్తకు కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికింది. ఆ వీడియో చూసిన వారందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (soldier became father after death)

మహారాష్ట్రలోని డేర్ గ్రామానికి చెందిన ప్రమోద్ పరశురామ్ జాదవ్ సికింద్రాబాద్-శ్రీనగర్ సెక్టార్‌లో ఆర్మీ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్య ప్రసవం సందర్భంగా సెలవుపెట్టి ఇంటికి వెళ్లాడు. అయితే బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి బైక్‌ను ఓ ట్రక్ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. జాదవ్ మరణించిన కొన్ని గంటల తర్వాత, ఆయన భార్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఆ సైనికుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు (Indian Army emotional story).జాదవ్ భార్యను అంత్యక్రియల కోసం ఆసుపత్రి నుంచి స్ట్రెచర్‌పై స్మశానానికి తీసుకువచ్చారు (viral emotional news). తన తండ్రిని మొదటి, చివరి చూపు చూసేందుకు కొన్ని గంటల వయసున్న నవజాత శిశువును కూడా అంత్యక్రియల స్థలానికి తీసుకువచ్చారు. ప్రసవం నుంచి ఇంకా కోలుకుంటున్న భార్య తన భర్త మృతదేహం పక్కన హృదయ విదారకంగా విలపిస్తుండడం చాలా మందిని కలిచి వేస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version