”నేటిధాత్రి” వార్త ఢిల్లీలో సంచలనం?
ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బి!?
`మిల్లర్లకు కొత్త సలహా ఇచ్చిన “ఎఫ్ సిఐ.జీఎం?”
ఎఫ్ సిఐ.జీఎం ప్లాన్ ఏ “బంపర్ ఆఫర” బ్లాస్ట్?
`కేంద్ర మంత్రికి మెయిల్స్ మీద మెయిల్స్?
`ఆగిపోయిన బంపర్ ఆఫర్ ప్లాన్?
`”జీఎం” ఇచ్చిన కొత్త ఆలోచనకు ఎగిరి గంతేస్తున్న బాయిల్డ్ మిల్లర్లు?
`గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ పట్టుకొని ఢిల్లీకి వెళ్ళండి?
కేంద్ర మంత్రితో మళ్ళీ మాట్లాడతా? అని “జీఎం” హామీ?
`యాసంగి వడ్లతో బకాయిలు పూడ్చుకున్నే పన్నాగం?
`15 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్రం తీసుకునేలా మరో దొడ్డి దారి ప్రయత్నం?
కేంద్రం ససేమిరా అంటున్నా ఒప్పిచేందుకు “ఎఫ్ సిఐ,జీఎం.” మరో రాయబారం?
`గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన ఉత్తరాన్ని అడ్డం పెట్టుకునే వ్యూహం?
`ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ పెట్టమన్నా బియ్యపు గింజ మిలర్ల వద్ద లేదు?
ఒట్టి చేతులతోనే కేంద్రం, రాష్ట్రాన్ని నిండా ముంచే మిలర్ల దుర్మార్గం?
`యాసంగి పంట చేతికొస్తే గాని బియ్యం పెట్టలేరు?
`అయినా బియ్యం ఉన్నట్లు నాటకాలడుతున్నారు?
`బాయిల్డ్ మిల్లర్లు ఎప్పుడో బియ్యం అమ్ముకొని చేతులు దులుపుకున్నారు?
`ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుండడంతో కుడితిలో పడ్డ ఎలుకలవుతున్నారు?
`ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ పెట్టమన్నా పెట్టలేరు?
`గత ఏడాది బియ్యం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు? దాచుకున్నారు?
`ప్రభుత్వానికి ఎగనామం పెట్టేశారు?
`ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుందని బాయిల్డ్ మిల్లర్లు ఊహించలేదు?
`15 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలడం తో తెలుకుట్టిన దొంగలయ్యారు?
`ఇప్పటికే “12 వేల కోట్ల రూపాయలు” ప్రభుత్వానికి బకాయిలు వున్నారు?
`యాసంగి వడ్లు తీసుకుంటే మరో “12 వేలకోట్లు” కొత్త బకాయిలు పేరుకుపోతాయి?
`గతంలో టెండర్ ప్యాడి బకాయిలు ఇంకా “4 వేల కోట్లు” పైచిలుకు పెండింగ్ లోనే వున్నాయి?
`ఇవన్నీ కలిపితే బాయిల్డ్ మిలర్ల బకాయిలు ఎంత లేదన్నా 20 వేల కోట్లు ఆవుతాయి?
ఈ బకాయిలు వసూలు చేస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్క దెబ్బతో అమలు చేయొచ్చు?
హైదరాబాద్, నేటిధాత్రి:
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటే ఇలానే వుంటాయేమో! ప్రభుత్వ సొమ్ము పక్కదారి మళ్లించి, అప్పనంగా బియ్యం అమ్ముకదొబ్బి, ఆస్దులు పెంచుకొని, కోట్లు కూడేసుకొని, ఇంకా ప్రభుత్వాన్ని ఎలా మోసం చేయాలా అని చూస్తున్నవారికి ప్రభుత్వ అదికారుల అండనా? వినడానికే విడ్డూరంగా వుంది. ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాద్యతలో వున్న అధికారులు లంచాలకు అలవాటు పడి, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మోసాలు చేస్తుంటే వ్యవస్ధ ఎక్కడ బాగుపడుతుంది. ఆరు గాలం రైతులంగా శ్రమించి, వడ్లు పండిస్తే, ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఆ వడ్లను బియ్యం చేసి ఇవ్వాల్సిన బాయిల్డ్ మిల్లర్లు అప్పనంగా బియ్యాన్ని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం దర్జాగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి మొండి చేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి చేస్తే, అక్రమ అదికారులతో కలిసి, ప్రభుత్వాన్ని మరింత మోసం చేయాలని చూస్తున్నారు. ఇదేనా వ్యవస్దల పనితీరు..ఇంతేనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారి కర్తవ్యం? అసలు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను బియ్యం చేసి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సిన మిల్లర్లు ఇష్టాను సారం అమ్ముకోవడమా? పైగా ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుంటే అధికారులతో కలిసి మరింత మోసానికి తెగబడడమా? ఇదేనా మిల్లర్లు చేయాల్సిన పని? ప్రభుత్వాల మెతక వైఖరిని అలుసుగా చేసుకొని కొందరు మిల్లర్లు ఆటలాడుతున్నారు. ప్రభుత్వాన్ని నిండామోసం చేస్తున్నారు? ఇంతకీ ఏం జరిగిదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ మిల్లర్లంతా కలిసి సుమారు 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ పడ్దారు. దాని విలువ వేల కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ శాఖ నుంచి అందాల్సిన రాయితీలు అనేకం పెండింగ్‌లో వున్నాయి. వాటిని విడుదల చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో తెలంగాణలో వున్న బాయిల్డ్ రైస్‌ను ఇస్తామని ప్రభుత్వం కేంద్రానికి విన్నవించుకున్నది. కేంద్రం బాయిల్డ్ రైస్ అవసరం లేదు! రా రైస్ వుంటే ఇవ్వండి. రా రైస్ మాత్రమే తీసుకుంటామని కూడా తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి కేంద్ర 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం బాయిల్డ్ మిల్లర్ల దగ్గర ఒక్క బియ్యం గింజ లేదు. అందులోనూ బాయిల్డ్ రైస్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పూడ్చేందుకు కూడా కొంత సమయం కావాలి. అందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. పైగా కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా ఒక దారి కావాలి. అందుకోసం తెలంగాణలోని మిల్లర్లంతా కలసి ఫుడ్‌కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ జిఎంను కలిశారు? తమ పరిస్దితి విన్నవించారు? తనకు ఇరవై కోట్లు ఇస్తే పరిస్ధితి చక్కదిద్దుతానని చెప్పినట్లు కూడా సమాచారం. అందులో భాగంగా ముందు కోటి రూపాయలు అందజేయాలి. కేంద్ర మంత్రి నుంచి అనుమతి తెచ్చిన వెంటనే మిగతా సొమ్ము ఇచ్చేలా మిల్లర్లు, కాంట్రాక్టర్ల మధ్య డీల్ కుదిరింది? ఈ సంగతి నేటిధాత్రికి ఉప్పందింది. వెంటనే నేటిధాత్రి జరుగుతున్న విషయాన్ని వెల్లడించింది. ఎఫ్‌సిఐ జిఎం. బంపర్ ఆఫర్ అని వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అది డీల్లీకి చేరింది. డీల్‌కు క్యాన్సలైంది. కేంద్రం సీరియస్ అయ్యింది. ఇక నేనేం చేయలేనని జిఎం. చేతులెత్తేశారు. కాని ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి చెబుతానని మిల్లర్ల చెవిలో వేశారు? గతంలో రాష్ట్ర ఫ్రభుత్వం కేంద్రానికి రాసిన ఉత్తరం తోనే పని పూర్తి చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఎందుకంటే గతంలోనే రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాశారు. తెలంగాణలో 15లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ వుందని, దానిని కొనుగోలు చేయాలన్నది ఆ లేఖ సారాంశం. కాని అప్ప్పుడు కేంద్రం ఒప్ప్పుకోలేదు. ఉప్ప్పుడు బియ్యం వద్దే వద్దని తెల్చి చెప్పేసింది. రా రైస్ వుంటే ఇవ్వండి తీసుకుంటామని చెప్పింది. ఎలాగైనా బాయిల్డ్ రైస్ మిల్లర్లను గట్టెంచాలని ప్రభుత్వం కూడా అనుకున్నది. కాని బాయిల్డ్ రైస్ మిల్లర్ల బాగోతం ప్రభుత్వానికి తెలియలేదు. ప్రభుత్వాన్ని బాయిల్డ్ రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని గమనించలేదు. అయితే ఇప్ప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన లెటర్‌ను పట్టుకొని , డిల్లీకి వెళ్లండి? నేను మళ్లీ కేంద్ర మంత్రితో మాట్లాడతానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడే అసలు చిక్కంతా వుంది. కేంద్రం ఒక వేళ ఒప్ప్పుకున్నా బియ్యం ఇచ్చేందుకు మిల్లర్ల దగ్గర ఒక్క గింజ కూడా లేదు. యాసంగి పంట వస్తే, ప్రభుత్వం కేటాయిస్తే ఆ వడ్లను మరాడిస్తే తప్ప బాయిల్డ్ మిల్లర్లకు బియ్యం లేవు. యాసంగి పంట వచ్చే దాక రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలి. కేంద్రాన్ని ఒప్పించాలి? ఇదీ బాయిల్డ్ రైస్ మిల్లర్ల అసలు బాగోతం. చేతిలో బియ్యంపు గింజ లేకపోయినా, కేంద్రాన్ని ఒప్పించేట్లు కొత్త నాటకం మిల్లర్లు ఆడుతున్నారు. ఎఫ్‌సిఐకి బియ్యం మిల్లర్లు ఇస్తారన్న సంగతి జిఎం చూసుకుంటారు. దాంతో కేంద్రం నుంచి రాష్ట్ర ఫ్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వస్తాయి. అప్ప్పుడు ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి వుండదు. బియ్యం లేవన్న సంగతి అసలే తెలియదు. ఇదీ అసలు స్కెచ్. ఇలా ప్రభుత్వాన్ని నిండా ముంచే ఎత్తుగడ అందరూ కలిసి వేశారు. ప్రభుత్వం కళ్లు గప్ప్పుతున్నారు. అయితే ఇక్కడ మరో అతిపెద్ద ట్విస్టు వుంది. బాయిల్డ్ రైస్ మిల్లర్లంతా కలిసి ప్రభుత్వానికి సుమారు రూ.12వేల కోట్ల రూపాయల బకాయిలు వున్నారు. అయితే ఇందులో కొంత మంది బకాయిలు చెల్లించిన వారున్నారు. కాని నాయకులుగా చెలామణి అయ్యే వారు..పెద్ద పెద్ద మిల్లర్లు పెద్దఎత్తున బకాయిలు పడ్డవారున్నారు. ఆ బకాయిలు గత ఏడాది ఖరీఫ్ నుంచి వున్నాయి. ఆ బకాయిలే రూ.12వేల కోట్లకు చేరుకున్నాయి. ఇప్ప్పుడు మళ్లీ యాసంగి వడ్లు ఇస్తే మరో రూ.12వేల కోట్లు బకాయిలు పడతారు. అంటే రెండేళ్లకు గాను మొత్తం రూ.24 వేల కోట్లు బకాయిలు పడుతున్నట్లు లెక్క. అందులో కొన్ని చెల్లింపులు ఒక వేళ చేసినా బకాయిలు సుమారు రూ.20వేల కోట్లైనా వుంటాయి. వీటికి తోడు ఈ మిల్లర్లు గతంలో ప్యాడీ టెండర్‌కు సుమారు రూ.4వేల కోట్లు ఇంకా ఇప్పటికీ బకాయిలు వున్నారు. వాటిని కూడా చెల్లించలేదు. మొత్తం బకాయిలన్నీ లెక్కేస్తే సుమారు రూ.25వేల కోట్ల వరకు బకాయిలు వుండే అవకాశం వుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ప్రతి ఏడాది వడ్లు తీసుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ప్రబుత్వం ఒత్తిడి చేసిన సందర్భాలలో అప్ప్పుడింత, అప్ప్పుడింత చెల్లిస్తున్నారు. పెద్దమెత్తం బకాయిలు మాత్రం అలాగే పెండింగ్ పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ బకాయిలను వసూలు చేస్తే ఏటా సంక్షేమ పథకాలను రూపాయి లోటు లేకుండా అమలు చేయొచ్చు. కొత్త పథకాలు కూడా ప్రకటించి, అప్ప్పులేకుండా పాలన సాగించొచ్చు. వేలాది కోట్లరూపాయలు మిల్లర్ల వద్ద పెండింగ్‌లో పడిపోతున్నాయి. అయినా మొసలి కన్నీరు కారుస్తూ, మిల్లర్లు సానుభూతి పొందే ప్రయత్నం మరింత చేస్తున్నారు. ఒక్కొ మిల్లర్ వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి మిల్లర్లను కట్టడి చేసి, వారి నుంచి బకాయిలు వసూలు చేయాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు. మిల్లర్లు ఇచ్చే లంచాలను మింగుతున్నారు. ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్నారు. ప్రజల సొమ్ము దిగమింగుతున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రతినిధులు కూడా అండగా నిలుస్తున్నారు. అటు మిల్లర్లు, ఇటు అదికారులు కలిసి ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలు కుంటే మిల్లర్ల నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేయొచ్చు. మిల్లర్ల బకాయిలు కొండలా పేరుకుపోకుండా కాపాడొచ్చు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవచ్చు. ఇదీ మ్యాటర్!!
